షిర్డీ సాయి నాధుని లీలలు తెలియనిది ఎవరికీ ? సమాధిలో నుండి కూడా తనని నమ్మిన వారిని రక్షిస్తానని చెప్పడమే గాక అనుభవం లోనికి తెచ్చిన లీలలు ఎన్నో.   ఒక్కో కధ  ఒకో సత్యం తెలుపుతుంది.
 సాయినాధుడు ఏనాడూ తనని దైవం గా చెప్పుకోలేదు అని చెప్తారు కాని తనలో అందరి దేవుళ్ళనీ చూపిన సంఘటనలు వున్నాయి..
దానిని బట్టి చూస్తె     "అహం బ్రహ్మస్మి"   అన్న వాక్యానికి అద్దం  పడుతుంది.
 ఎక్కిరాల భరద్వాజ గారు వ్రాసిన సాయి లీలామృతం అన్న పుస్తకం చదువుతుంటే కొన్ని కొన్ని ఘటనలలో మనల్ని మనం విశ్లేషించు కోగల స్థితి కలుగుతుంది.
యుగాన్ని బట్టి ధర్మం మారుతుంది అన్న విషయం అందరికీ తెలిసినదే ..
 ఇహ పర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం అని చెప్పబడింది.    మానవుల తత్వం ఎరిగిన మహనీయులు అన్ని దేశాలకు  తగిన  ధర్మం బోధించారు.  ప్రకృతిలో ప్రతిదానికీ   వృద్ది, క్షయము,  పునరుద్ధరణ సహజమని తెలిపారు.   అంటే, పుట్టుక, వృద్ది చెందుట, మరణించుట , మరల జన్మలను తీసుకొనుట...ఇది  ఆత్మ  స్వభావము.. ఈ జన్మలో మానవ జన్మనెత్తిన వాడు మరల మానవ జన్మ   తీసుకుంటాడని గారంటీ లేదు ..అది తన కర్మాచరణల మీద ఆధార పడి  వుంటుంది.  .క్రమేణా ధర్మంలో మూడాచారాలు చోటు చేసుకోవడం వల్ల మత ద్వేషాలు ఏర్పడానికి కారణమయినాయి అని చెప్తారు.
 ప్రతి యుగంలో వలెనే ఈ యుగంలో కూడా  ఆధ్యాత్మిక ధర్మం తెలిపి మూడా చారాలు  తొలగించడానికి  బాబా  అవతరించారు అని చెప్తారు. 
ఈ   మతవిద్వేషాలతో మనుషులు ఎంత నష్టపోతున్నారో తెలిపే కధ ఒకటి .....

ఒక పేద బ్రాహ్మణుడు  బాబాను ధన  సహాయం కోరుతాడు.. కాని, అతనిలో బాబా ముస్లిం అన్న సందేహం వుంది .

 ముందుగా బాబా పట్టించుకోక పోయినా, కొంత సమయం తర్వాత ఒక కాగితం  ఇచ్చి "దీనిని ఇంటికి తీసుకుపోయి నువ్వు, బిడ్డలూ తినండి. మార్గ మధ్యంలో పొట్లం విప్పి చూడవద్దు" ... అని చెప్పారు.
అతను   ఇంటి  దారి పట్టి వెళ్తూ కుతూహలం కొద్ది ఒక కాలువ కాలువ గట్టు చేరి ఆ పొట్లం విప్పి చూడగా అందులో పొట్టేలు మాంసం ఉన్నది..వెంటనే దానిని కాలువలో పారేశాడు.  నీరు తగలగానే ఆ మాంసం బంగారంగా మారి నీటిలో మునిగిపోయింది.   ఆత్రుతగా తన  పై పంచ ఆ నీటిలో  పిండుకోగా సన్నటి బంగారపు పోగు కనబడింది... బాబా  సద్గురువు  అని గుర్తించక, కేవలం  వేష భాషలను బట్టి ఆ పేద బ్రాహ్మణుడు చేతికందిన అదృష్టాన్ని కాల దన్నుకున్నాడు..
ఏ  పుట్టలో ఏ  పామున్నదో.... అని పెద్దలు అంటూ వుంటారు .. మన నిత్య జీవితంలో మనకు ఎంతో  మంది తారస పడుతూ వుంటారు.
ఎవరి దగ్గర ఎంత జ్ఞాన మున్నదో మనకు తెలియదు.
అందుకే ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుని దర్శించ గలిగిన వాడు ధన్యుడు   
                  

కామెంట్‌లు

  1. ఇంతవరకు ఈ కధ నాకు తెలియదు. తెలియని వాటిని తెలుసుకున్టున్నందుకు ఆనందంగా ఉంది. మీరు తెలిపింది సత్యం. చక్కటి పోస్ట్.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం