పోస్ట్‌లు

గురువు అవసరం ................

గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన  ఇలా వివరించాడు. ఆత్మలోని జ్యోతి యమరుగా లింగంబు తెలిసి చూడకున్న తేటపడదు అదియు గురువు లేక అబ్బునా తెలియంగా విశ్వదాభిరామ వినుర వేమా ! తాత్పర్యం  : హృదయంలో తేజో రూపుడుగా వున్న పరమేశ్వరుని దర్శించడానికి సద్గురువు దగ్గర అభ్యాసం లేకుండగా సాధ్యపడదు. ఇంకా.........ఇలా చెప్పారు......... ఉడుగక క్రతువుల తపముల నడవుల తీర్ధముల తిరిగినంతనే ధరలో నోడయని కనుగొనజాలదు కడు ధీరత గురుడు తెలుపగలడిది వేమా   ! తాత్పర్యం : ఎ మాత్రం విడిచి పెట్టకుండా యజ్ణ యాగాదులు , తపస్సు చేసి, అడవులలో తిరిగి తీర్ధయాత్రలకు వెళ్ళినప్పటికీ స్వామిని కనుగొన లేరు. ఆ పరమాత్మను చేరుకొనే విధానాన్ని గురువు మాత్రమే చెప్పగలడు. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో అజునికైన వాని యబ్బకైన తాళపు చెవి లేక తలుపెట్ట్లూడునో? విశ్వదాభిరామ వినుర వేమా ! తాత్పర్యం : తాళం చెవులు లేకుండా తలుపు ఏవిధంగా  రాదో, అదే విధంగా గురువు ఉపదేశం లేకుండా, ఆత్మా జ్ఞానాన్ని బ్రహ్మ గాని ఆతని అబ్బ (తండ్రి ) గాని తెలుసుకోలేరు. గురువు లేక విద్య గురుతుగా దొరకదు నృపతి లేక భూమి ని...

Hari OM Hari OM Sai OM Sai OM - Shirdi Sai Bhajan

చిత్రం
హరి ఓం, హరి ఓం, సాయి ఓం, సాయి ఓం, భజన చేద్దాం రండి.  

గురు పౌర్ణమి శుభాకాంక్షలు ...................

అందరికి నమస్కారం.... మనిషి పుట్టుకతో అన్నీ నేర్చుకుని రాడు.  కొందరికి స్వతహాగా నేర్చుకునే శక్తి వుంటే, మరి కొందరికి ఎదుటి వారిని చూసి నేర్చుకునే శక్తి వుంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి, రాత్రి నిద్రించే వరకూ ప్రక్క వారి సహాయం అవసరమౌతుంది. అది మాట సహాయం కావచ్చు లేదా పని సహాయం.... ఎందుకంటే మనిషి ఒంటరి జీవితం గడపలేదు.  అలానే ఎవరి సహాయం లేకుండా అస్సలు బ్రతకలేడు. పుట్టిన మరుక్షణం నుండి మాతా పితరుల      ఆధ్వర్యంలో, యవ్వనంలో జీవిత భాగస్వామి సహచర్యంలో     , వృద్ధాప్యంలో తన బిడ్డల అండలో కాలం గడిపేస్తాడు.  ఓనమాలు అమ్మ ఒడిలో నేర్చుకుంటే, అ ఆ లు బడిలో నేర్చుకుంటాడు . ఇలా ఎవరో ఒకరి  సహకారంతో జీవన పయనం సాగిస్తాడు . కాని అదే జీవితాన్ని ఎటువంటి  మార్గంలో, ఎలా  నడిపించాలి అన్నమీమాంస ను ఒక్క గురువు మాత్రమే తీర్చగలడు.  మనలో ఎన్నో సందేహాలు. వాటిలో ముఖ్యమైనది గురువుని గురించిన సందేహం. అందుకే ఈ గురుపౌర్ణమి సందర్భంగా నాకు మరియు మరికొందరి సందేహ నివృత్తి కోసం చిన్ని ప్రయత్నం మా అత్యంత ఆప్తురాలు భారతి గారి సహకారం...

భారతీయం: Tirupati Ghat Road

భారతీయం: Tirupati Ghat Road : "Tirupati Ghat Road , a photo by Arun Sundar on Flickr. ఏడుకొండల వాడా..వెంకట రమణా.... తిరుమల తిరుపతి... అత్యధ్బుతమైన ఆధ్యాత్మిక కేంద్రం......"

Tirupati Ghat Road

చిత్రం
Tirupati Ghat Road , a photo by Arun Sundar on Flickr. ఏడుకొండల వాడా..వెంకట రమణా.... తిరుమల తిరుపతి... అత్యధ్బుతమైన ఆధ్యాత్మిక కేంద్రం... గొప్ప పేరు పొందిన యాత్రాస్థలం... వెంకటేశ్వర స్వామి  దర్శనం కోసం మేము బస్సు లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా క్రిందకి చూసి అమ్మో అనుకుని ముందు  బాట వైపు దృష్టి సారించాను.. సామాన్యంగా ప్రతి యాత్రికుడు చేసే పనే అదే.. ఐతే నాలో ఏవో భావాలు... మన  వెనుకగా వున్న లోయ ప్రదేశం మన గతం ఐతే, ముందున్న బాట మన గమ్యాన్ని సూచిస్తుంది అన్న ఆలోచన..  మనం కూర్చున్న బస్సు మన వర్తమానం... గతం మనకు గతుకుల లోయను చూపిస్తుంది.. భవిష్యత్తు మనలో ఆశ ను రేకెత్తిస్తుంది.. ముందు ముందు అంతా  మంచే జరుగుతుంది అన్న ఆశ... అందుకే గతం గతః అన్న సూక్తిని గుర్తు పెట్టుకుని, మనం ఎ  స్థితిలో వున్నామో గమనిస్తూ,చిన్న చిన్న తుఫానుల తాకిడికి తట్టుకుని నిలబడే  వృక్షాల్లా ముందుకు సాగాలి.. అయినా మనం ఆకాశాన ఎగిరే పక్షుల కన్నా బలమైన వాళ్ళం.......కదా... వాటిని  మించిన కష్టాలా మనవి ????????    

ఏడుకొండల వాడా..వెంకట రమణా

ఆధ్యాత్మిక అనుభవాలు

 మన నిత్య జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో  అనుభవాలు.... అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే  ఆనందిస్తాం, లేకపోతె విచారిస్తాము... ప్రపంచంలో మనకున్న కష్టాలు వేరెవరికీ వుండవనే భావనలో వుంటాము..  ఈ నవ్వడం, ఏడవడం అనేవి  మానసికములు...మనసు మీద ఆధార పడి వుంటాయి...ప్రాపంచిక జీవనం నుండి ఆధ్యాత్మిక జీవనంలోనికి మనకు తెలియకుండానే అడుగులు పాడినప్పుడు చాలా అనుభవాలు, వాటి ద్వారా కొంత కలవార పాటు సహజం.. అకస్మాత్తుగా అప్పుడు అనిపిస్తుంది------ "ఒక వ్యక్తి అవసరం. ఒక గురువు అవసరం" అని. అదేమిటి ? స్కూల్ లో, కాలేజీ లో  టీచర్లు వుంటారు కదా. ఇంకా వేరే గురువు ఏమిటి అనుకోవచ్చు.. అత్యవసరం ....... ప్రాపంచిక జీవనంలో మనకు అమ్మ,నాన్న, ఉపాధ్యాయులు నేర్పేవి అనుసరిస్తే ఒక మంచి వ్యక్తి గా మనల్ని మనం తీర్చి దిద్దుకోగలం.. కాని ఆధ్యాత్మిక ప్రయాణం పూల బాట కాదు.. ముళ్ళ బాట. అడుగులు ఆచి, తూచి వెయ్యాలి.. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా పడిపోవడం తప్పదు.. అందుకే మనకు ఆ బాటలో జాగరూకతతో నడిపించే ఒక వ్యక్తి కావాలి.. ఒక మంచి గురువు కావాలి..దొరికిన వారు అదృష్టవంతులు. దొరకనివారు వారి అన్వేషణ కొనసాగిస్తూనే వుండాలి.. ఈలోగ...

" సర్వేజనా సుఖినో భవంతు"..........

నిన్నటి ధర్మం గురించిన చర్చా విషయాలు చదివి  సత్య పళ్ళెం గారు   స్పందించి వ్రాసినది  చూడండి.. ...... "ధారనాద్ధర్మ మిత్యాహు  ధర్మోధారయతేప్రజాః యత్స్యాద్ధారణ సంయుక్తం  సధర్మ ఇతినిశ్చయః ధర్మ శబ్దానికి అర్ధం ధరించుట, ధారణమొనర్చుట. "ఆహార నిద్రా భయ మైధునం చ సామాన్య మేతత్ పశుభిర్నరాణాం, ధర్మో హి తేషామధికో  విశేషో, ధర్మేణహీనాః  పశుభి సమానాః " (భావం: భోజనం,నిద్ర భయం,మైధునం మనుష్యులకు పశువులకు సమానం. మనిషికున్న విశేషత ధర్మం. ధర్మహీనుడు పశువుతో సమానం) "ధనాని భూమౌ పశవో హి గొష్టే, నారీ గృహద్వారి సఖ శ్మశానే, దేహశ్చితాయాం పరలోకమార్గే, ధర్మానుగోగాచ్చతి జీవ ఏకః " (భావం: ధనం  భూమిలో నిలిచిపోతుంది.పశువులు శాలలోనే  ఆగిపోతాయి. భార్య ఇంటి గుమ్మంలోనే ఆగిపోతుంది. బంధుమిత్రులు స్మశానం వరకు సాగనంపి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. దేహం చితిపైన కాలిన తర్వాత కూడా పరలోక మార్గమున వెంటనుండి,జీవున్ని అనుసరించి వచ్చేది దర్మం మాత్రమే) "ధర్మాదర్ధః  ప్రభవతి, ధర్మాత్ ప్రభవతి సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసార మిదం జగత్ " ( భావం: ధర్మం వలన అర్ధం, సుఖం,సర్వం...
ధర్మాన్ని ఆచరించడమే కాని ప్రశ్నించ కూడదు అని కృష్ణ ద్వైపాయనుడు, ధర్మరాజు ఇద్దరూ చెప్పారని మన యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు తన "ద్రౌపది" లో వ్రాయడం జరిగింది... కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ధర్మం మారుతుందని, ద్రౌపది వివాహం పాండవులతో జరగాలని కృష్ణ ద్వైపాయనుడు నిర్దేశించాడు కనుక అది ధర్మం ఐనదని, కుంతీ తన ఐదుగురు పుత్రులు ద్రౌపదిని సమానంగా పంచుకొమ్మని ఆదేశించింది కనుక అది ధర్మమైంది అని చెప్పారు...కాలాన్ని బట్టి మారిన ధర్మాన్ని మనం అంగీకరిస్తున్నాము. తప్పడం లేదు.. కాని అధర్మం మాత్రం ఏమాత్రం మార్పు చెందడం లేదు అనడానికి ఉదాహరణ ........ఆనాడు త్రేతా యుగంలో సీతాదేవిని రావణుడు అపహరించడం, ద్వాపర యుగంలో ద్రౌపదిని నిండు సభలో దుశ్శాసనుడు అవమానించడం, .....ఈనాడు గోనే సంచుల్లో, సూట్ కేసుల్లో ఆడవారిని చంపి దాచి వుంచడం ..కలియుగం కాబట్టి అధర్మం కొంత టెక్నాలజీ నేర్చుకుందా  ?   ... అధర్మం వెనకాలే ధర్మం వుందని నిరూపణ అవుతుందా లేక ధర్మం వెనక అధర్మం పొంచి వుందా ??  

సత్సంగం

అందరికీ నమస్కారం....నేను ఈ మధ్యనే గూగుల్ సత్సంగం గ్రూప్ లో జాయిన్ అవడం జరిగింది... ఎందరో పెద్దలు ,అనుభవజ్ఞులు, జరిపిన కొన్ని అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక చర్చలు మీ అందరికీ పరిచయం చెయ్యాలని ఆకాంక్షతో, వారి అనుమతితో అందరికీ ఉపయోగపడే ఆధ్యాత్మిక విషయాలను నా బ్లాగ్ లొ పోస్ట్ చెయ్యడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.. ఇది కేవలం     పుస్తక పరిజ్ఞానం ఎంత ఉన్నప్పటికీ, తమ తమ స్వీయ ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక  అనుభవాలు మన జీవన పయనంలో ఎంతగా దోహదపడతాయో తెలిపే   ప్రయత్నం....సదుద్దేశ్యపూర్వకమైనది ..... ఈనాటి  చర్చలో భాగంగా "ధర్మం" ఏ పాత్ర వహించిందో చూద్దామా మరి.............  ముందుగా అయ్యవారి నాగేంద్ర గారు అడిగిన ప్రశ్నలు చూడండి ..... " ధర్మం అంటే ఏమిటి? దాని స్వరూపమేమి? ధర్మాన్ని పట్టుకుంటే జరిగేదేమిటి ఒరిగెదేమిటి? ధర్మాన్ని పట్టుకోవడంలో వచ్చే వైక్లవ్యాలు ఏమిటి? వగైరా వగైరాలు కొన్ని దృష్టాంతాలతో.. ఎవరికెంత తెలుస్తే అంత తెలుపవచ్చు."   అన్నారు....    సమాధానంగా  రాజశేఖరుని విజయశర్మ గారు   ఇలా చెప్పారు ........... "సత్యము, శౌచము, తపస్సు, దయ ...