ధర్మాన్ని ఆచరించడమే కాని ప్రశ్నించ కూడదు అని కృష్ణ ద్వైపాయనుడు, ధర్మరాజు ఇద్దరూ చెప్పారని మన యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు తన "ద్రౌపది" లో వ్రాయడం జరిగింది... కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ధర్మం మారుతుందని, ద్రౌపది వివాహం పాండవులతో జరగాలని కృష్ణ ద్వైపాయనుడు నిర్దేశించాడు కనుక అది ధర్మం ఐనదని, కుంతీ తన ఐదుగురు పుత్రులు ద్రౌపదిని సమానంగా పంచుకొమ్మని ఆదేశించింది కనుక అది ధర్మమైంది అని చెప్పారు...కాలాన్ని బట్టి మారిన ధర్మాన్ని మనం అంగీకరిస్తున్నాము. తప్పడం లేదు.. కాని అధర్మం మాత్రం ఏమాత్రం మార్పు చెందడం లేదు అనడానికి ఉదాహరణ ........ఆనాడు త్రేతా యుగంలో సీతాదేవిని రావణుడు అపహరించడం, ద్వాపర యుగంలో ద్రౌపదిని నిండు సభలో దుశ్శాసనుడు అవమానించడం, .....ఈనాడు గోనే సంచుల్లో, సూట్ కేసుల్లో ఆడవారిని చంపి దాచి వుంచడం ..కలియుగం కాబట్టి అధర్మం కొంత టెక్నాలజీ నేర్చుకుందా  ?   ... అధర్మం వెనకాలే ధర్మం వుందని నిరూపణ అవుతుందా లేక ధర్మం వెనక అధర్మం పొంచి వుందా ??  


కామెంట్‌లు

 1. ధనాన్ని భూమిలో - దానాన్ని కాదు. సవరించగలరు

  రిప్లయితొలగించండి
 2. "అహింసా పరమో ధర్మః "
  ఆత్మ భావమే ఆత్మ దృష్టితో జీవించటమే అహింస
  అన్య దృష్టి, అన్య భావం అహింసా !!

  ఆత్మ భావన చేస్తూ జీవించటమే మన పరమ ధర్మం
  http://paramapadasopanam.blogspot.com/

  రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం