ఒకసారి నా మిత్రురాలు శ్రీమతి హరిప్రియ బాబా చరిత్రలోని కొన్ని అంశాలను గురించి నాతొ సంభాషించారు .. ఈరోజు ఆ మెయిల్ చూసిన తర్వాత మా ఇద్దరి సంభాషణ పోస్ట్ చేద్దాము అనిపించిన్ది.. ఇది ఒక చిన్న , మంచి ప్రయత్నం మాత్రమె శ్రీమతి హరిప్రియ .. . చిత్తవృత్తి నిరోధం,తపస్సు,అష్టాంగయోగాలు( యమ,నియమ,ఆసన,ప్రాణాయామ,ప్రత్యా హార,ధారణ,ధ్యాన,సమాధి), సాధనాచతుష్టయం(నిత్యానిత్య వస్తువివేకం,ఇహాముత్రార్ధఫలభో గవిరాగం,శమాదిషట్క సంపత్తి,ముముక్షుత్వం), యజ్ఞయాగాదులు, గురు సాంగత్యం....... అమ్మో! ఎన్నో భాద్యతల నడుమ, నేనున్ననేపద్యంలో ఈ విధమైన ఆధ్యాత్మిక సాధన నాకు సాధ్యమేనా? ముమ్మాటికి కాదు. మరి ఎలా? ఇలా సాధన చేయనా? ప్రార్ధనలు,శత,సహస్ర నామావళిలు,పారాయణాలు చేయడం కంటే ఇలా చేస్తే ఎలా వుంటుందంటారు? మనం (ఇక్కడ మనం అంటే మనిద్దరం కాదు. నాలాంటి వారందరూ) పూజించే "బాబా" చరితంను పారాయణం చేయడమే కాకుండా, మనం చదివిన ఆ చిన్నచిన్న ఘటనలలో అంతరార్ధం గ్రహించి, బాబా ఆ ఘటనల ద్వారా అందిస్తున్న ఆ జ్ఞానబోధను మన జీవన గమనంలో త్రికరణశుద్ధిగా అలవర్చుకుంటే........ ఎలా వుంటుందండీ? ఉదాహరణకు కొన్ని..........