అలానే రాబిన్ శర్మ తన మరో పుస్తకం టైటిల్ కూడా  "who will cry when you die " చూడగానే ఒక శ్మశాన వైరాగ్యం కలిగి నిజమే కదా , జీవితకాలం కష్టాలే.  నేను పొతే ఏదో ఒకరోజు ఏడుస్తారు . పదిరోజుల తర్వాత అందరూ బాగానే వుంటారు అని ఒక ఫీలింగ్ కూడా వస్తుంది,..  (ఒక విషయం నోట్ చేయండి .. నిర్జీవ శరీరం శ్మశానంలో తగలబడే వరకూ వున్న విషాద వదనాలు ఆ కార్యక్రమం పూర్తి  ఐన   తర్వాత తేలిక పడి ఒక ఫీలింగ్ కలుగుతుంది .. అన్ని కార్యక్రమాలు సక్రమంగా,సంతృప్తి కరంగా  పూర్తి చేయగలిగాము(పిండి కొద్ది రొట్టే).. అని .. 
అంటే వీడు పొతే పోయాడులే అని  కాదు అర్ధం .. ఒక ఆత్మ జన్మ తీసుకుని ఈ భూమి మీద పడిన సమయం లో  తోటివారి సహాయం అవసరం పడుతుంది . మరల ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్న సమయంలో కూడా తోటివారి సహాయం అవసరపడుతుంది . MAN CANNOT LIVE ALONE..  )

ఐతే ఇక్కడ రాబిన్ శర్మ ఇలా చెప్పాడు -"మనీషిగా జీవించి మరణాన్ని జయించు " ... అని.. మనీషి గా అంటే ?
చాలా పాయింట్స్ వున్నాయి .. ఒక్కటొక్కటిగా మాట్లాడుకుందాము .. రాబిన్ శర్మ తండ్రి మాటలు _నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఎడ్చావు . ఈ లోకం ఆనందించింది . నువ్వు ఎలాటి జీవితం గడపాలంటే నువ్వు మారానో పొందినప్పుడు ఈ లోకమంతా ఏడవాలి . నువ్వు ఆనందంగా వుండాలి ." ఎంతమంది తండ్రులు ఈ విధమైన భోధ చేస్తారు చెప్పండి . 
ఎంత టెక్నాలజీ పెరిగినా మనం కొన్ని విషయాలు మర్చిపోకూడదు కదా మరి.  ముందుగా 
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి  .. వుదాహరణకు -చదువు గురించి ఒక ప్రణాళిక అవసరం . అలానే వుద్యోగం విషయం లో ఒక ప్రణాళిక అవసరం .. మరి వివాహ విషయం లో కూడా ఒక ప్రణాళిక అవసరం .. ఈ అవసరాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారు ?


    

ఐతే ఇక్కడ రాబిన్ శర్మ  చెప్పాలి అనుకున్నది తెలుగులో మంచి వివరణతో ఇచ్చారు -- మనీషిగా జీవించి మరణాన్ని జయించు అన్నాడు      

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం