Content

Wednesday, August 26, 2015
ఇక ఐదవ విషయం ఏమిటంటే, వ్యక్తిగతంగా మనమేమిటి అని తెలుసుకోవడం .. దానికి రెండు మార్గాలు. ఒకటి నిరంతరం మనలోనికి మనం చూసుకోవడం, అంటే మనల్ని మనం విశ్లెశించుకొవడం.ఇక రెండవది మనరోజు వారీ అనుభవాలను, దానినుంచి నేర్చుకున్న పాఠాలను ఒక పుస్తకం లో(డైరీ ) వ్రాసుకోవడం .. ఈ పద్దతులు మన వ్యక్తిగత కార్యకలాపాలకు, వూహాశాక్తికి , జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి ఏంతో  దొహదపడతాయి..

ఆరవది- నిజాయితీని పెంపొందించుకోవడం - ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం . సరళతరంగా వుండే విషయాలని సంక్లిష్టంగా మార్చుకోకుండా వుండడం , మనం మనకి ఇచ్చుకున్న మాటని నిలబెట్టుకోకపోవడం . వుదాహరణకి, కొత్త సంవత్సరం రాబోతుంది అంటే నేను చేయబోయే అంటే నా నెక్స్ట్ ఇయర్ కి సంబందించిన కార్యకలాపాల ప్రణాళిక లేక నేను ఇలా వుండాలి అన్న ఒక resolution ఫాలో కాకపొవదమ్. నన్ను నేను మార్చుకొలెకపొవడం. వున్దకోదదు.. మనం అనుకున్నది చెయగలగాలి.. ఒక మంచిమాట ఈ సందర్భం గా -- వుపకారం చేయకపోయినా పర్వాలెదు. అపకారం చేయాలన్న తలంపు లేకుండా వుంటే చాలు.. చూసారా తలంపు వుంటే మనసు లాగుతూ వుంటుంది కద.. అందుకే తలంపు లేకుండా వుండాలి అన్నది. మా నాన్నగారు ఎంత  నిజాయితీ పరులు అంటే ,చిన్న అబద్డంతో తప్పించుకోగల విషయాన్ని సిన్సియర్ గా నిజం చెప్పి చివాట్లు తినేవారు .. ఎవరితో అని అడగ వద్దు .. అది ఆయన నిజాయితీ .. ఆయన సంస్కారం .. నా మనఃపూర్వక నమస్కారాలు ఆయన ఆత్మకి ..
మాట ఇస్తే నిలబెట్టుకొండి .... అవతలివాళ్ళ వలన ఆ మాటని కోల్పోయే పరిస్థితి వస్తే మౌనం వహించండి .. చాలు.. అదే మీ నిజాయితీ ..
  ఏడవ విషయం గతాన్ని గౌరవించడం .. గతం గతః అని పెద్దలు చెప్పారు .. గతాన్ని మర్చిపోవాలి అనీ పెద్దలే చెప్పారు.. ఎందుకంటే విషాదాలు మనల్ని ముందుకు ఎదగనీయవు అని .. మనకి ఎక్కువగా గుర్తుండేది విషాద సంఘటనలే . వాటినే మనసులో పెట్టుకుని పగలూ ప్రతీకారాలు పెంచుకుంటాము .. మరపు మానవ సహజం , మరపు దేవుడిచ్చిన   వరం అని   సుఖాలని మర్చిపోతాము ..అదే మనలని దెబ్బ తీస్తుంది ..అక్కడే  పొరపాటు  జరుగుతుంది .... ప్రకృతి ,వికృతి అని రెండు పదాలను మన నిత్య జీవితంలో ఎలా అనుభవిస్తున్నామో సుఖడుఖ్హాలను కూడా అంటే హాయిగా అనుభవించాలి.. అందుకే గతాన్ని తీసిపారేయకుండా ,మన భవిష్యత్తుకి నిచ్చేనలా స్వీకరించి గౌరవించాలి అని రచయిత  చెప్పడం జరిగింది  ...
ఎనిమిదవది -కొత్త రోజుని ఆనందంగా ఆహ్వానించడమ్.. నిద్రలేచిన తోలి 30 నిమిషాలని "ప్లాటినం 30" గా రచయితా వర్ణించాడు .. ఈ విషయం పై రేపు మాట్లాడతాను        .   
    .   


© Rukmini Devi J
mmanindarkumarTwitter:ACMWCTRss:mk

0 వ్యాఖ్యలు:

Post a Comment