నీ లక్ష్యం ఏమిటి అని ఎవరు ఎన్నిసార్లు ఎవరిని అడిగినా ఎన్నో రకాల కోరికలు, ఎన్నో రకాల విషయాలు వెల్లడి అవుతాయి .. అలానే సందేహాలూ వస్తాయి .. ఎక్కువగా ధ్యాన సాధనలో వున్నవారిని ఈ ప్రశ్న అడిగితె ఒక్కటే సమాధానం -"నాకు మోక్షం కావాలి ".. ఇదే సమాధానం .. అసలు మోక్షం అంటే ఏమిటి తెలుసుకున్న తర్వాతే మోక్షం గురించి సాధన మొదలు పెడితే మంచి ఫలితాలు కనబడతాయి . మన జీవన విదానాలలో మార్పులూ సంభవిస్తాయి .. లేకపోతె అర్ధం కాకుండా బట్టీ పడితే ఎలా వుంటుందో మన జీవితాలు కూడా అలాగే వుంటాయి . అలాగే వెళ్ళిపోతాయి .ధ్యానమార్గం అనే నా పోస్ట్ లో లక్ష్యం గురించి వివరించిన గుర్తు . అందుకే మరల వ్రాయడం లేదు
                   " The trajedy of life is not deathm but
                   what we let die inside of us while we live"- Norman Cousins 

మహాత్మా గాంధీ " నీ ప్రపంచంలో నువ్వు కోరుకుంటున్న మార్పువి నువ్వే ఐపొవాలి. అలా చేసిన నాడు నీ జీవితమే మారిపోతుంది " అన్న గొప్ప వాఖ్యం కనిపిస్తుంది ఈ పుస్తకంలో .. నిజమే "నువ్వు" మారలేని నాడు ఎదుటి వ్యక్తిలో మార్పు కోరుకునే అర్హత ఎక్కడ వుంటుంది ? ఇంతకుముందు ఒకసారి వ్రాశాను- ప్రతివారిలో ఒక అంతర్గత శక్తి వుంటుంది . ఆ శక్తిని ఒక మంచి మార్గానికి , ఒక మంచి పనికి వినియోగిస్తే నిన్ను మించిన సంతోష పరుడు అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరొకడు వుండడు .. పోనీ ఆ శక్తిని కేవలం నీ గురించే వుపయోగించుకున్నా ఒక మంచి మనిషిగా మంచి మార్గంలో వుండగలగడానికి వుపయోగించుకుంటే ,నీతో పాటు నీ సమాజానికి కూడా ఏంతో  మేలు జరుగుతుంది .
రాబిన్ శర్మ మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు . మీరు మరణించినప్పుడు ఎవరైనా ఏడుస్తారా ?ఈ భూమండలంపై నడుస్తున్నప్పుడు మీ వునికి ఎంతమందిని తాకగలదు? మీ తర్వాతి తరాలను మీరు ఎంతవరకు ప్రభావితం చేయగలరు ? మీ వూపిరి ఆగిపోఎనాటికి మీరు ఎలాంటి వారసత్వాన్ని మిగల్చగలరు? అని.
ఇంకో విషయం కూడా చెప్తాడు - నా జీవితం ద్వారా నేను నేర్చుకున్న గుణపాఠం  ఏమిటంటే, మనం జీవితాన్ని చేజిక్కించుకొకపొతె, జీవితమే మనమీద పెత్తనం చెస్తున్ది. మనకి తెలియకుండానే జీవితం ఐపొతున్ది. జీవితాన్ని సరిగా అనుభవించలేక పోయాను అన్న విచారం మనల్ని తినివేస్తుంది . . ఒక చక్కటి వుదాహరణ ,నేను కావాలనుకున్నది ఇక్కడ నేను చెప్తాను -- మా అమ్మగారు చనిపోయేముందు అంటే కోమా లోనికి వెళ్ళిపోతున్న సమయంలో డాక్టర్లు ఆమెని iccu లోనికి మార్చి immediate ట్రీట్మెంట్ ఇచ్చారు .. మెలకువ లోనికి రాగానే  ముందుగా ఆమె ముఖంలో ఒక అందమైన నవ్వు .. తమ్ముడు వెంటనే తన బుగ్గలని చేతితో నిమిరి ముద్దులు పెట్టేసుకున్నాడు.. ఆ అందమైన నవ్వు కావాలి ప్రతి ఒక్కరి జీవితం లో ,ప్రతి క్షణం .... ఇది మొదటి సూ త్రమ్.
దైనందిన జీవితంలో మిమ్మల్ని మీరే కాక ఇతరులని కూడా ఆదరించండి . అది మీ వాళ్ళే కావచ్చు ,బయటివాళ్ళు  కావచ్చు .. ఎవరైనా ... మీకు ఏమి దొరుకుతుందో అప్పుడు గ్రహించి చెప్పండి .   ఇది రెండవ సూత్రం .
మన దృక్పధం లో మార్పు రావాలి.  దుర్యోధనుడు ,ధర్మరాజు ల దృక్పధాలు ఈ బ్లాగ్ లో నేను వివరించడం జరిగింది .. ధర్మరాజు దృక్పధం అలవరచుకుంటే చాలు. . ఇది మూడవ సూత్రం .
యధాతథం గా ఒక సెంటెన్స్ వ్రాస్తున్నాను - ఏంటో అర్ధవంతమైన, విజయవంతమైన జీవితం అల్లడానికి వాడే బంగారు దారం ఆత్మ నియంత్రణ . మీరు మీతో కఠినంగా వుండండి . అంటే మీ ఆత్మని నియంత్రించుకుంటే ప్రయత్నంలో వుండండి .ప్రతి నిర్ణయం ఏంతో విశ్లేషణ లేకుండా మాత్రం వుండకూడదు . ఇంకో మంచిమాట --వైఫల్యం చెందినవారు చేయడానికి ఇష్టపడని పనులని తప్పక చేసే అలవాటు విజేతలకి వుంటుంది .. ఇది నిజంగా నిజమ్. అందుకే ఇటువంటి మంచిమాటలను పునరావలోకనం చేస్తూ మరల మరల నా జీవితాన్ని అందంగా తయారు చేసుకోవడం కోసమే నేను ఈ ప్రయత్నం చేస్తూ వుంటాను .  లేకపోతె నాకు నచ్చిన పుస్తకం అని ఒక పేరు పెట్టేస్తే అయిపోతుంది ..  ఇది ఒక చిన్న ప్రయత్నం నాలో నేను ప్రయాణించడానికి .........
                                                                                                                  మరల రేపు .... 


.. .    

 
       

    

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం