పోస్ట్‌లు

భారతీయం: యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా....

భారతీయం: యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.... : "యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే  తత్ర దేవతా" .. . స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో, అక్కడ దేవతలు నివాసం వుంటారు అని పురాణాలు , పెద్దలు ...

యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా....

"యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే  తత్ర దేవతా" .. . స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో, అక్కడ దేవతలు నివాసం వుంటారు అని పురాణాలు , పెద్దలు పదే పదే  చెప్తూనే వుంటారు .  ఢిల్లీ ఒక్కటే కాదు, దేశం అంతటా స్త్రీ నిరాదరణకి గురి అవుతూనే వుంది ... ఎన్నో వుదాహరణలు .. అందరికీ తెలిసిన విషయమే . అయినా పరిస్థితి మారలెదు. ఎందరు గగ్గోలు పెట్టినా జరిగేది జరగక ఆగడం లేదు .. రెమిడీ ఏమిటో ఆలోచించే తీరిక ఎవరికీ లేదు ... కొందరి వల్ల మాత్రమే  సాధ్యం కానిది .. మార్పు కావాలి . మారాలి మారాలి అనుకోవడం లోనే జీవితం గడిచిపోతుంది ..కాని , హృదయ భారం మాత్రం మిగిలిపోతుంది .. ఇంతటి వుపోద్గాతం ఎందుకు అనుకుంటున్నారా .. ? ఒకరోజు రాత్రి ఒంటి గంటకి ట్రైన్ దిగి నేను ,మావారు స్టేషన్ బయటకి వచ్చాము . పేవ్మెంట్స్ మీద కొందరు నిరాశ్రయులు అక్కడక్కడా పడుకుని వున్నారు .. drainage మాన్ హోల్స్ కూడా వున్నాయి పైన ఎటువంటి కవర్స్ లేకుండా .. ఇవి మనకి ఆశ్చర్యకరమయిన   విషయాలు కాదు. . ఈ పడుకుని వున్న వారిలో ఒక చివరగా ఆడవారు కూడా వున్నారు .. ఎటువంటి క్షేమకరమైన పరిస్థితి కనబడలేదు.. సరి ఐన ఆచ్చా...

భారతీయం: ▶ Ornaments Missing in Gollapalli Raghunatha Swamy...

భారతీయం: ▶ Ornaments Missing in Gollapalli Raghunatha Swamy... : ▶ Ornaments Missing in Gollapalli Raghunatha Swamy Temple At Krishna District - Video Dailymotion

భారతీయం: నేనెలా వుండాలనుకుంటానంటే..............

భారతీయం: నేనెలా వుండాలనుకుంటానంటే.............. : పడిలేచే కెరటం లా చల్లగా,మెల్లగా వీచే చిరుగాలిలా ప్రకృతి సందడిలా వాన చినుకులా ముత్యపు బిందువులా విద్యుత్తరంగంలా పదహారేళ్ళ ప్రాయంలా సు...

నేనెలా వుండాలనుకుంటానంటే..............

పడిలేచే కెరటం లా చల్లగా,మెల్లగా వీచే చిరుగాలిలా ప్రకృతి సందడిలా వాన చినుకులా ముత్యపు బిందువులా విద్యుత్తరంగంలా పదహారేళ్ళ ప్రాయంలా సుమధుర గానంలా గలగల పారే సెలయేరులా గాలికి కదిలే ఆకులా చిరుమువ్వల సందడిలా పసిపాప నవ్వులా అమ్మ ఒడిలా నాన్న లాలనలా... నేను "నేను" లా....................................... చాలా సార్లు మా స్నేహితురాలు ,   ఎలా ఉంటే బాగుంటుందీ అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటే "మీరు మీరు లా ఉంటే చాలు" అని సమాధానం ఇచ్చాను.. ఆ తర్వాత నా మదిలో కదిలినవి ఇదిగో. ఇలా వ్రాయడం జరిగింది....   

భారతీయం: "జీవితం నీకు ఏది ఇస్తే అది తీసుకో"...

భారతీయం: "జీవితం నీకు ఏది ఇస్తే అది తీసుకో"... :  అసంతృప్తి ... ప్రతి ఒక్కరి జీవితాలలో పాచిపట్టబడి అంటుకుపోయిన ఒక భావన .. దానికి వయసుతో సంబంధం లేదు . కేవలం మనసుతో మాత్రమె బంధం .. ఒక నిమిష ...

"జీవితం నీకు ఏది ఇస్తే అది తీసుకో"...

 అసంతృప్తి ... ప్రతి ఒక్కరి జీవితాలలో పాచిపట్టబడి అంటుకుపోయిన ఒక భావన .. దానికి వయసుతో సంబంధం లేదు . కేవలం మనసుతో మాత్రమె బంధం .. ఒక నిమిష మా, ఒక గంటా , ఒక నెలా లేక ఒక సంవత్సరమా అని కాకుండా జీవితాంతం మనతో వుండిపోయేది ..బాల్కనీ  లో నిలబడి అల్లంతదూరాన ఒక చిన్న గ్రామం వంటి వాతావరణం చూసినప్పుడు ..." ఆహా ఎంత హాయి ఐన జీవితాలు.." అని మన మనసులో ఒక భావన పుడుతుంది. అవి ఎంత హాయి ఐన జీవితాలో మనకి తెలియదు గాని ఆ నిమిషం మనకు ఒక హాయినిస్తుంది . ఇది నిజమ్.. ఆ భావన మన మనసులో పాతుకుంటుంది . మన జీవనానికి , అక్కడి జీవనానికి పోలిక కట్టడం మొదలుపెడుతుంది .. ఇక్కడ మనమేదో కష్ట పడిపోతున్నట్లు , అక్కడి వారు సుఖపడిపోతున్నట్లు , వాళ్ళు అదృష్టవంతులు ఐనట్లు, మనం దురదృష్టవంతులము ఐనట్లు ఒక పెద్ద ఫీలింగ్ కలుగుతుంది..  దూరపుకొండలు నునుపు అన్న సంగతి మన మనసు ఆ క్షణంలో మరచిపోతుంది .  .  . అక్కడ మొదలౌతుంది మన మనసులో అసంతృప్తి ... "జీవితం నీకు ఏది ఇస్తే అది తీసుకో"...   అని మా వాడు ఎవరికో హితభోద చేస్తుంటే ఆశ్చర్యం తో నిలబడిపోయాను ..ఎంత గొప్ప సత్యం దాగి వుంది ఆ మాటలో. ...
  ఓం శ్రీ గురుభ్యోన్నః  సమస్త సన్మంగళాని భవంతు ( మా చిన్నప్పుడు ఉషశ్రీ గారు  హనుమాన్చాలీసా  చదివేముందు రేడియో లో వినిపించేవారు. చిరస్మరణీయం )..    అందరికీ   మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...    ఈ పోస్ట్ పోయిన సంవత్సరం రామ నవమికి వ్రాసినది . అనివార్య కారణాల  వల్ల నేను టైప్ చేయలేకపోతే నా స్నేహితురాలు, ప్రముఖ బ్లాగర్ భారతిగారు టైపు చేసి ఇచ్చినప్పటికీ పోస్ట్ చెయ్యలేకపోయాను ..   ఈ సంవత్సరం ముందుగానే ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే , రేపటినుండి  తొమ్మిది రోజులు రామ నవమి వరకు కొందరు రామవ్రత దీక్షలో వుంటారు . ఈ తొమ్మిది రోజులూ కేవలం రామ నామం ని మాత్రమె ఆశ్రయించేవారు ఎందఱో .. వారికై మరియు నాకై ఈరోజే పోస్ట్ చెయ్యాలి అనిపించింది.. తప్పులున్న సవరించగలరు. శ్రీ రామ జయ రామ జయ జయ రామ .. ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ...........  రామావతారం - నిత్యకళ్యాణం పచ్చతోరణం                       ...
  శర్మ  గారూ,, అయ్యా నమస్కారమ్.. మీ కబుర్లు మా మామయ్య గారిని   గుర్తు తెస్తున్నాయి .. ఆ సామెతలు మన జీవితాలకి , మన చుట్టూ తిరిగే జీవితాలకీ అద్దం   పడతాయి.. ధన్యవాదాలతో  

శివోహం .........

చిత్రం
  శంకరుడు అంటే  సంతోషం  కలిగించువాడు  అని వేదాలలో వివరింపబడినది...   గాలి ఏ విధముగా వ్యాపిస్తున్నదో ఆ విధముగా వ్యాపించే శక్తి "శం"  అక్షరమునకు కలదు. " శం" నామము ఆనందముతో నిండినది.   ఏదైనా శివాలయమునకు మనం వెళ్ళినప్పుడు  శివ నామ ఘోష మన మనసులో ఆనందాన్ని నింపివేస్తుంది .  అదే పెద్ద నిదర్శనం . "శం" అనే పదానికి చిదానందం అని కూడా అర్ధమ్. "కర" అనగా అందించేవాడు లేక చేకూర్చువాడు అని అర్ధమ్. నిత్యానందమును , సచ్చిదానందమును అద్వైతానందమును అందించువాడు శంకరుడు .శంకరుడు  కైలాసవాసి ... అర్ధనారీశ్వరుడు , వినాశాకారుడు, సృష్టికర్త ,శంకరుడు మూర్తి స్వరూపుడు ,  జటాజూటం , ఫాలభాగాన నెలవంక ,నుదుట  అగ్ని నేత్రం ,విభూతిదారణ ,రుద్రాక్షమాల , గజ చర్మదారుడు , త్రిశూలమ్, డమరుకం మొదలైన అలంకారాలతో ,ఆయుధాలతో విరాజిల్లుచున్నట్లు మనకు కనబడతాడు . అధర్వణ వేదంలో శివుని ఇలా స్తుతిస్తారు "ముఖాయతే పశుపతే  యాని చక్శూంచి తే భవత్వచే రూపాయ సంద్రుశే ప్రతీ చీనాయతే నమః అంగభ్యస్త ఉదయరాయ జిహ్వాయ అస్సాయ తే దద్యో గందాయతే నమః" దీని అర్ధం.. " ఓ పశుపతి; దేవా, శివా, మీ ముఖ...