ఎవరు గొప్ప
మనలో చాలా మందికి ఒక గొప్ప సందేహం కలుగుతూ వుంటుంది . దేవుళ్లలో ఎవరు గొప్ప ?.. శివుడే గొప్ప ..కాదు, విష్ణువే గొప్ప ...అదేమీ కాదు శక్తి లేనిదే ఈ ఇరువురూ దేనికీ పనికి రారు అని ఇలాంటి వాదనలు చూస్తూనే వుంటాము.. అసలు ఎవరిని పూజించాలి ? మనకెందుకు ఈ గందర గోళం ? ఇది కేవలం హిందువులలో మాత్రమె కనబడుతుంది .. ఎందువల్ల ? ఆత్మ, పరమాత్మ ల తత్త్వం తెలిసిన మన పెద్దలు మనకు ఏమి తెలియ జెప్పాలనుకున్నారు.. మూలాన్ని వదిలేసి ఈ వాదనలు అవసరమా అని ఒక ప్రశ్న ..కానీ భగవద్ గీత లో నేను ఎవరిని పూజించాలి అన్న సందేహానికి ఒక శ్లోకం ద్వారా ఆ కృష్ణ పరమాత్మ వివరించారు ........... యే యదా మాం ప్రవద్యంతే తాంస్తదేవ భజామ్యహమ్ ! మమ వర్త్మానువర్తనే మనుష్యః పార్ధ సర్వశః !! ...