విలువైన కధ

ఇదో చిన్న, అతి చిన్న కధ .   కాని అత్యంత విలువైన కధ.    ప్రతి ఒక్కరికి తెలియాల్సిన కధ .    కధలు చిన్న

వాళ్ళకే కాదు,     పెద్దలకు  కూడా ఇష్టమే మరి.     అందుకే ఈ కధ ...........

మహా భారతం అంటే ప్రీతి లేనిది ఎవరికీ ?  మహాభారతం అంటే కేవలం పాండవులకు ,కౌరవులకు మధ్య యుద్దమే గుర్తు వస్తుంది. ద్రౌపది వస్త్రాపహరణమే గుర్తు వస్తుంది. అందులోని చిన్న చిన్న    కధలు మనకు గుర్తు రావు.. అవి నేర్పించే నీతి మనకు కనబడదు..

ఒకసారి ద్రోణాచార్యుల వారు తమ  శిష్యులైన ధర్మరాజు మరియు దుర్యోధనులను........... దేశ సంచారం చేసి ఎంతమంది  మంచివాళ్ళు వున్నారో, ఎంతమంది చెడ్డవాళ్ళు వున్నారో  లెక్క చెప్పమన్నారట    .సరే   అని ఇద్దరూ  దేశ సంచారానికి బయలుదేరి వెళ్ళారు..
కొన్ని రోజుల అనంతరం 
ముందుగా దుర్యోధనుడు వచ్చి,   "ఆర్యా,  ఈ రాజ్యంలో    అందరూ చెడ్డ వాళ్ళే . మంచివాళ్ళు మచ్చుకైనా కనబడ లేదు"   అని సగర్వంగా విన్నవించుకున్నాడట.

ఆ తర్వాత వచ్చిన ధర్మరాజుని ద్రోణాచార్యుల వారు,  "నీ పరిశీలన ఏమిటి"   అని అడుగగా, ధర్మరాజు  " ఆర్యా :   రాజ్యమంతా ఎక్కడ చూసినా మంచితనమే తప్ప చెడు చాయలు ,చెడ్డ మనిషి అని ఏమీ కనబడలేదు"    అని సవినయంగా  చెప్పాడట.

ఇద్దరి  మాటలను విన్న ద్రోణుడు నవ్వి, " మనలోని  ఆలోచనా విధానం బట్టి  మన చుట్టూ వున్న  ప్రపంచం గోచరిస్తుంది . మన ఆలోచనా విధానమే మనకు మార్గదర్శి అవుతుంది. దుర్యోధనా, ఎల్లప్పుడూ చెడు తలంపుతో వుండే నీకు చెడు తప్ప  ఈ రాజ్యంలోని మంచి కనబడలేదు. ధర్మరాజు లోని ధర్మబుద్ధి  అంతటా మంచితనమే కనబరచింది. " అని చెప్పారట.

చెడు  వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అని మహాత్మా గాంధిజీ చెప్పారు....కాని,   కలి  ప్రభావం ... అంతటా మనకు చెడె కనిపిస్తుంది. అంటే ...........మనం అందరమూ దుర్యోధనులమేనా ?

అదే మన ఆలోచనా రీతి... మనం ఇంతే.  మరి మంచితనం ఎక్కడ వుంది ?  వెదకడం మొదలు పెడదామా ?

 అరె, ఎక్కడకి   ఆ పరుగులు ? మనలోనే దాగి వున్నదానిని  ఎక్కడో  వెదకడమా ?

ప్రతి ఒక్కరూ మంచివారిగానే పుడతారు ..కాకపొతే పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొలది మాయలు, భ్రమలు  మనలను కమ్మి వేస్తుంటాయి... ఆ ముసుగులను మనమే తీసేసుకోవాలి మరి...అది మన చేతుల్లోనే వుంది..
అందుకే  అంటారు పెద్దలు ........... కృషి వుంటే మనుషులు ఋషులౌతారు , మహా పురుషులౌతారు................   అని. 
 ఎదుటి వ్యక్తి  ఏ  తీరున  వున్నాడో  గమనించడం లో తప్పు లేదు.
అతనిలో  ఏ  తప్పులు వున్నాయో  వెదకడం తప్పు..............
ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో , ఎటువంటి వాడో  విశ్లేషించే స్థితికి వచ్చినవారు భగవంతులే 
నా వుద్దేశ్యంలో .............

 


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం