వినాయక చవితి శుభాకాంక్షలు
ఓం శ్రీ గురుభ్యోన్నమః
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః


వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా శుక్లాంబరదరం విష్ణుం, శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
ఏక దంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం
లంబోదరం విశాలాక్షం వందేహం గణ నాయకం
మౌంజీ కృష్ణాజినదరం నాగయజ్ఞోపవీతినం 
బాలేందు శకలం మౌళా వందేహం గణనాయకం  
చిత్ర రత్న విచిత్రాంగం చిత్రమాలా  విభూషితం
కామరూప ధరం దేవం వందేహం గణనాయకం
గజవక్త్రం సురశ్రేష్టం కర్ణ చామరభూషితం
పాశాంకుశ ధరం దేవం వందేహం గణనాయకం
మూషికోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే
యోద్దుకామం మహా వీర్యం వందేహం గణనాయకం
యక్ష కిన్నెర , గంధర్వ సిద్ధ విద్యాధరై స్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం
అంబికా హృదయానందం మాతృభి పరివేష్టితం
భక్తప్రియం మదొంమతం వందేహం గణనాయకం
సర్వ విఘ్నహారం దేవం సర్వ విఘ్న వివర్జితం
సర్వసిద్ది ప్రదాతారం వందేహం గణనాయకం
గణాష్టకమిదం పుణ్యం యః పతేత్సతతం  నరః
సిడ్డింటి సర్వ కార్యాని విద్యావాన్ ధనావాన్ భవేత్
ఇతి శ్రీ గణనాయకాష్టకం సంపూర్ణం

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..

ఎ పని అయినా ప్రారంభించే ముందు ప్రధమంగా వినాయకుణ్ణి పూజించడం మన సంప్రదాయం.  వినాయకుణ్ణి పూజించడం వాళ్ళ మహావిఘ్నాత    ప్రముచ్యతే మహా దోషాత్ ప్రముచ్యతే  .....మహా విఘ్నాలన్నే తొలగిపోయి, మహా దోషాలన్నీ అంతమైపోతాయి అని గణపతి అధర్వ శీర్షోపనిషత్తు వివరిస్తుంది.   
తలచితినే గణనాధుని, తలచితినే విఘ్నపతిని,, తలచిన పనిగా దలచితినే హీరంభుని,, తలచితి నా విఘ్నముల దోలగుట కొరకున్ ...
గణపతి విద్యార్ధులకు ప్రియతముడు.
 ఓం గణానాం త్వా గణపతిం హవామహే, కవీం కవీనా ముపమశ్ర వస్తమం ...మేధావులలో కెల్లా మేటి మేధావి ఐన గణాధిపా..నీకు నమస్కారములు అని స్తుతిస్తాము...
వినాయక చవితి రోజున వినాయకుని ప్రతిమ ముందు తమ పుస్తకాలకు పసుపు కుంకుమలతో అత్యంత భక్తీ శ్రద్దలతో, ప్రీతితో ఓంకారాన్ని దిద్ది  తమకు మంచి విద్యాబుద్ధులను ప్రసాదించమని కోరిన విద్యలకెల్ల నొజ్జయై  ఉండేది, పార్వతీ తనయ, ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ అని ప్రార్ధిస్తారు.  . ఆ గణపతి  ప్రసాదించిన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి అవసరమైన ఏకాగ్రత, ప్రశాంతత, పరిశుద్దతలను అలవరచుకోవాలి..
విఘ్నేశ్వరుని జీవితాన్ని పరిశీలిస్తే ఈ మూడు లక్షణాలు పరి పూర్ణంగా వున్నాయని అర్ధమవుతుంది.
తల్లిదండ్రుల ఎడల   వుండాల్సిన భక్తీ, సేవా భావనలను ఆయన నుండి మనం నేర్చుకోవాలి. వినయ సంపదను  గణనాధుని నుండి నేర్చుకోవాలి ..  
ఏకాగ్రత లేని మనస్సుతో ఎంత శ్రమించినా, అది వేడి పెనం మీద పడిన నీటి చుక్కలా వెంటనే ఆవిరై పోతుంది కాని ఎంతో కాలం నిలవదు. అందుకే ఏకాగ్రత అలవరచుకోవడానికి అత్యంత కృషి అవసరం.
ఏకాగ్రత అంటే ఎలా వుండాలో తలుసుకోవడానికి ఒక చిన్న కధ...

వేద వ్యాసునుకి మహాభారత కధను ప్రపంచానికి అందించాలని ఆలోచన కలిగింది. నేను చెప్తున్నపుడు ఈ మహా గ్రంధాన్ని వ్రాయగల సమర్ధులు ఎవరైనా వున్నారా అని బ్రహ్మను అడిగాడు ఆయన.  బ్రహ్మ వినాయకుడి పేరుని  సూచించడం జరిగింది. . వినాయకుడు తప్ప వ్యాసుని సంకల్పాన్ని నెరవేర్చగల సమర్ధుడు లేదు అని బ్రహ్మ తెలిపాడు. వెంటనే వ్యాసుడు వినాయకుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకుని తన విన్నపాన్ని తెలుపుతూ, గణాధిపా, నేను భారత కధను చెపుతూ వుంటాను. మీరు ఆగకుండా వ్రాస్తూ వుండాలి, అని షరతు పెట్టాడు...అందుకు వినాయకుడు నేను ఒకసారి వ్రాయడం మొదలుపెడితే నా ఘంటం  ఆగదు. కాబట్టి అలా ఆగకుండా కధను చెప్పాలి అని తనూ ఒక షరతు పెట్టాడు. చెప్పిన దానిని అర్ధం చేసుకుంటూ వ్రాయాలని వ్యాసుడు,,, ఇలా ఒకరి షరతులను మరొకరు అంగీకరించిన తర్వాత వ్యాసుడు కధను చెప్తూ వుంటే వినాయకుడు వ్రాసాడు. ఆ విధంగా పంచమ వేదంగా ప్రసిద్ది గాంచిన మహా భారత కధ మనకు అందించడం జరిగింది..
దేవ గణాలకు అధిపతిని నియమించాలని పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి,  వినాయకుడు, కుమారస్వామి, ఇద్దరిలో ఎవరు సమర్ధులో తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెడతారు. అది ముల్లోకాలలో ఎవరు అన్ని పుణ్యతీర్ధాలను దర్శించి, ముందుగా వస్తారో వారిని గణాది పతిగా నియమిస్తారు . విషయం విన్న వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం పై ప్రయాణం అవుతాడు. కాని, మూషిక వాహన పై ముల్లోకాలను చుట్టి రావడం అసాధ్యం కావున ఆందోళన, అలజడి లేకుండా, మనో నిశ్చలతను కోల్పోకుండా ప్రశాంతంగా పరిష్కారాన్ని ఆలోచించి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే, ముల్లోకాలలోని పుణ్య తీర్థాలను సందర్శించిన ఫలితా లభిస్తుంది అన్న ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి వినాయకుడు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేస్తాడు..మార్గ మధ్యంలోకుమారస్వామికి ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడు కనిపిస్తూ వుంటాడు.. వినాయకుని బుద్ధి కుశాలతకు సంతోషించిన పార్వతీ పరమేశ్వరులు వినాయకుని గణాలకు అధిపతిగా నియమిస్తారు.. 
మనస్సు ఏకాగ్రతను సాధించాలంటే పరిశుద్ద చిత్తం అవసరం. అందుకు మనస్సులో ఎలాంటి వికారాలూ కలుగకుండా జాగ్రత్త వహించాలి.
సర్వ జీవులలోనూ తల్లినే దర్శించాలన్న కధ వినండి.  ఒకసారి వినాయకుడు ఆడుకుంటూ పిల్లిని కొడితే,  పిల్లి ముఖంపై గాయం అయ్యింది..ఆట ముగించుకుని వినాయకుడు తన తల్లి పార్వతి దగ్గరికి వెళ్ళగా ఆమె ముఖం పై గాయాన్ని చూసి, అమ్మా, ఈ గాయం ఎలా అయ్యింది ? అని  అడుగగా, అందుకు పార్వతీదేవి ,నాయనా, సర్వ జీవులలోనూ వున్నది నేనే. నువ్వు పిల్లి ముఖాన్ని గాయ పరచడం వల్ల నా ముఖానికి కూడా గాయమైంది అని చెప్పింది ..ఆనాటి నుండి వినాయకుడు జీవ హింస మానుకున్నాడట. అన్ని జీవాలలో తల్లిని  దర్శించుకునే వాడట .

ఆత్మానం రదినం విద్ధి శరీరం రధమేవాతు
బుద్ధిం తు సారదిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ

శరీరాన్ని రధంతో పోలుస్తూ, ఆత్మే అందులో ప్రతిష్టిత మైన మూర్తి అని, బుద్దే ఆ రధానికి సారధి అనీ, ఇంద్రియాలనే గుర్రాలను  మనస్సనే కళ్ళెం నియంత్రిస్తుందని kathopanishattu  వర్ణిస్తుంది.        

కామెంట్‌లు

  1. చాలా మంచి విషయాలను తెలియజేశారు. వినాయకుని గురించి మీరిచ్చిన వివరణ బాగుందండి. అభినందనలు.
    మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం