ఈ మధ్య బ్లాగ్ లో వ్రాస్తున్నాను  గాని, ఎందుకో అమనస్కం గా అనిపిస్తుంది...అలాంటప్పుడు మనం అనుకునే రిజల్ట్  రాదు .. అందువల్ల తాత్కాలికంగా  కావచ్చు లేదా శాశ్వతంగా కావచ్చు నేను ఇక వ్రాయలేక పోవచ్చు .. ... నేను బ్లాగ్ మొదలు పెట్టిన కారణాలు వేరు ..అవి అమలు లోనికి తేవడంలో ఏదో ఇబ్బంది .. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది .. నిజానికి కంప్యూటర్ లో తెలుగు భాషలో ప్రయోగాత్మకమైన  విప్లవానికి నేను చాలా హర్షించి ఈ బ్లాగ్ కి నా సమయం కేటాయించడం జరిగింది ..పూర్తి న్యాయం చేయగలిగినప్పుడే సంతృప్తి వుంటుంది ..అసంతృప్తికి లోనవుతూ ఎ పనీ చెయ్యలేము ... అందుకే  నన్ను ప్రత్యక్షం గా మరియు  పరోక్షంగా ప్రోత్సహించిన పెద్దలకు సవినయ నమస్కారములతో .....ఒక రచయిత ప్రాకృతిక విశేషాలకు తన వూహామయ ప్రపంచంలో ఎన్నో రంగుల పదములు అద్ది ఒక అందమైన వూహా చిత్రాన్ని మన ముందు వుంచగలడు   ... కానీ ఆధ్యాత్మిక విషయాలకు మనం అనుభవించ గలము గాని ,ఎటువంటి రంగులు అద్దలేము..ఆధ్యాత్మికత వాస్తవంలోవుంచుతూ , సహజంగా  జీవించడం నేర్పుతుంది ..అదే నాకూ ఇష్టం .. ...  పెద్దలకు నాలాంటి అతి చిన్న వారు తెలియజేసే సాహసం కూడనిది .. ..ఈ నిర్ణయం నాకు అమిత ఆనందాన్ని ఇస్తుంది ...ధన్యవాదాలతో ....

కామెంట్‌లు

 1. మీ post అంతరతం బోడ పడలేదు కానీ ఒక చిన్న మనవి....
  జ్ఞాన పరంగా వయసుని నిర్ణయించలేము
  AGE తక్కువే కావచ్చు జ్ఞాన వ్రుద్ద్త్వం ఉండొచ్చు
  Blogs అనునది కేవలము ఒక మాధ్యమము మాత్రమే...
  మీలో సత్ కి చెందినా అభిలాష ఉన్నది...
  అది పలువురితో పంచుకోగలిగే సహృదయము ఉన్నది...
  అంచేత మీ ఈ భావన సరి కాదేమో అని తోచి ఈ కామెంట్ వ్రాయటం చేస్తున్నాను...
  అమనస్కం అనే పదం వాడారు,
  మనస్సు లేక పోవటం అని వాచ్యార్థం అయిన లక్ష్యార్థం దృష్ట్యా సాక్షాత్తు పరబ్రహ్మ స్థితి సమీప స్థితి...

  లోకం లో ఎన్నో విషయాలు వున్నాయి
  ఇంద్రియ విషయాలు కోకొల్లలు పైగా వాటికీ demand అత్యధికం
  కానీ స్వతః సిద్ధమైన సత్ గుణములతో ఈ విధమైన సత్ కి చెందిన
  ఆధ్యాత్మిక ఉన్నతి కలిగించే అంశాలు ప్రచురిస్తూ పంచుకుంటున్నారు

  ఈ చర్య వాసన ప్రేరితం కాక వివేక ఫలితమే అని తోస్తోంది ....

  సరే ఇంతకు నేచేప్పోచ్చేది ఏమంటే...
  మేము online లో సత్సంగం చేస్తుంటాము...
  ఇతర దేశములలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో
  ఆధ్యాత్మిక అభిలాశులతో సాధకులతో...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీ యుతులు సత్యం శివం సుందరం గారికి .. ముందుగా నా ధన్యవాదములు ..ఎందఱో పెద్దలు . వారికి నేను ఏదో చెప్పాలని ప్రయత్నించడం ఒక దుస్సాహసమే ...అందులోనూ ఆధ్యాత్మిక సమాచారం .. అది అనంతమైనది .. మొదలు ఎక్కడని చెప్పగలము ? తుది ఏమని తెలుపగలము .. అది ఒక పరిమళ భరితమైన పూలతో నిండిన లోకం .కాని ఆ పూవులని అంటుకునే ముళ్ళూ వుంటాయి ..పరిమళంతో పాటు ముళ్లనీ ఆనందంగా స్వీకరించితే.. అది అనుభవించిన వారికే తెలుస్తుంది కదా... .ఈ బ్లాగ్ ప్రపంచం ఒక బంధం అనుకోండి .. ఆ బంధానికి తగిన న్యాయం చెయ్యగలను అని నాకు అనిపించడం లేదు .. అందుకే ఆ ఆలోచన ..నాకు మీ సత్సంగం యొక్క లింక్ ఇవ్వండి ..తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నిస్తాను ..సరేనా....

   తొలగించండి
  2. ఈ మధ్య బ్లాగ్ లన్నీ బాగానే వున్నాయి.. మనకి తెలిసిన విషయాలు, అనుభవాలు, రాయడం లో తప్పు లేదు.. ఎన్నో బ్లాగుల కన్న మీ బ్లాగ్ బాగానే వుంది..ఓపిక వున్నప్పుడే రాయంది.. ఆపీకండి..

   తొలగించండి
  3. చాల ఆలస్యముగా reply ఇచ్చుటకు క్షంతవ్యుడను,

   అన్యధా భావింప వలదు, నిన్ననే స్మరణ blog నందు మీ పాత జ్ఞాపకం ఒకదానిని

   http://smarana-bharathi.blogspot.in/2012/02/blog-post.html

   ఆధ్యాత్నిక దృష్టి కోణంలో మీరు ఇరువురు గ్రహించిన తీరు చూసి

   ఆత్మానంద పారవశ్యం చెందినంత పని అయినది,

   అంతటి సాధనైక దృక్కోణం కలగటం అనేది ఈశ్వర కృప చేతనే కలుగుతుంది....

   ఇది చూశాక నేను చెప్పదలచుకున్నది

   (అభ్యర్థనా రూపాన)

   ""మీకు కలుగుతున్న

   ఈ శుద్ధసాత్విక భావజాలమును

   వ్యక్తపరచ గలరు అని ""

   Sairam

   తొలగించండి
 2. thank you sir...vraayaalane anukunnaanu .. kaani karmala gurinchi vraayadam modalupettina tarvaata enduko edo teliyani bhaavamuku lonayyaanu ..paigaa gata konni nelalugaa anukunnade..idi kevalam spiritual blog. spiritulityni real life tho kalipi vraase amshaalu enno ..kaani nyaayam cheyyalenu anipinchindi. anduke.. meelanti peddala aasheervachanaalu korutoo.. namaskaaramulatho . ..

  రిప్లయితొలగించండి
 3. మీరు ఇన్ని విషయాలు ....బ్లాగు రూపంలో వుంచిన తర్వాత కూడ ...సంశయించదం అర్ధ రహితం ! మీరు చెప్పదలిచుకున్నది సూటిగా చెప్పండి. చెప్పడం వరకే మీ భాధ్యత !అపై అంతా అయనే చూసుకొంటాడు !

  రిప్లయితొలగించండి
 4. correct gaa grahinchaaru sir..karmala gurinchi chaalaa utsaahamto modalu pettaanu .. anubhava poorvaka udaaharanalato vraaddaamukunnaanu .. kaani, anubhavam saripodu anipinchindi ..anta pedda subject.. nyaayam cheyyalenu anipinchindi .. thank you sir ...

  రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం