ఒక బంతిని గోడ కేసి కొడితే అది తిరిగి మన వైపు ఎలా వస్తుందో అలానే మనం చేసిన కర్మ తాలూకు phalitam తిరిగి మనక్నే వచ్చి తాకుతుంది.
మోక్షం  పొందడానికి కర్మ ఒక్కటే చాలదు . జ్ఞానం కూడా తోడవ్వాలి .. అది ఎలా అన్న  ఉదాహరణ తర్వాత వివరిస్తాను ..
జీవులు జనించే విధానం :---:-ఇందులో ఒక విశేషం వుంది . పుట్టిన ఎ జీవీ మరణించక తప్పాడు. మనిషి ఎదురు చూడనిది, ఆహ్వానం పలకనిది ఒక్కటే ----అదే మృత్యువు .....కాని తప్పనిది కూడా అదే ..ఐతే, అప్పటి వరకూ తన జన్మని ఎందుకొచ్చిన జన్మ అని తిట్టుకుంటూ బ్రతికే వాడు కూడా ముంచుకొచ్చే సమయం ఆసన్నం అయ్యే  సరికి ఇంకా బ్రతకాలి అనుకుని తను పూర్తీ చెయ్యలేని, తనతో పూర్తీ చెయ్యబడని పనులు ఎన్నో గుర్తు తెచ్చుకుని నేను లేనిది ఆ పనులు అసంపూర్ణం అనే భ్రమతో కొట్టు మిట్టాడుతూ వుంటాడు . ఆ విధంగా  జీవునికి తన జన్మ మీద అభిమానం మిగిలిపోయి , అజ్ఞానం బలపడి , ఆ మేరకే తన prapancham స్థూల ప్రపంచంగా దర్శనం ఇస్తుంది ....udaaharanaku  ఆతడి పూర్వ  వాసనల వాళ్ళ ఆతనికి భూమి మీద అధిక ప్రీతి ఏర్పడితే, తనకి భూలోకమే స్థూల లోకంగా మారి, ఆ భూమి మీద ఒక జీవిగా జన్మిస్తాడు . జీవులకు వాసనల యొక్క మార్పుల వాళ్ళ వారి అభిమానాలు మారిపోతూ వుంటాయి . కనుక, వారు పై లోకాలకు, క్రింది లోకాలకూ ప్రయాణాలు చేస్తూనే వుంటారు . ఈ ప్రయాణ ప్రవాహానికి అంటూ ,పొంతూ వుండదు . ఈ ప్రవాహమే  కల్పాలుగా, యుగాలుగా పెద్దలు లెక్కలు కడుతూ వుంటారు .జీవి జననం తన పూర్వ జన్మ కర్మల మీద ఆధార పది వుంటుంది అని కృష్ణ పరమాత్ముడు గీత లో సెలవిచ్చాడు . అదే కారణం ఈ భూమి మీద జన్మించిన మానవుల జీవితాల్లో వైషమ్యాలకి   ..
విధి  అనేది కర్తా లేక సాధనమా అన్నవిషయంలో శ్రీ రాముడు అడిగిన  ప్రశ్నకు వసిష్ఠ మహర్షి సమాధానం ఏమిటో రేపు తెలుసుకుందాము ... 
                
                                                                                                                                    

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం