Content

Saturday, January 21, 2012
ఖర్మకి, కర్మకి మధ్య అవినాభావ సంబంధం  వుందా అంటే వుంది అనే చెప్తుంది భగవద్గీత. ఖర్మ అను పదమును  మనం కష్టాలలో వున్న సమయంలో మన తలరాత ను  నిందిస్తూ ఉపయోగిస్తాము ..నుదుటి వ్రాత అంటే విధి లిఖితం .." విధి" ని బ్రహ్మ రాత గా పేర్కొంటాము .పర్యాయ పదం డ్యూటీ అంటే కర్తవ్యమ్ ..అంటే జీవుడు  ఎన్నో జన్మల పుణ్య ఫలం వల్ల మానవునిగా జన్మ తీసుకునే సమయంలో మనం చేయవలసిన లేదా మన వల్ల ఈ ఈూమండలం మీద జరగవలసిన పనులు,మన పూర్వ జన్మ కర్మల ఫలితాలు ఆ బ్రహ్మ దేవుడు   మన నుదుటి మీద వ్రాసి మరీ పంపుతాడు అన్నమాట .అందుకే కాబోలు ఏది ఎలా జరగాలని వ్రాసి వుంటే అలా జరుగుతుంది అని అంటారు పెద్దలు ..విధి అంటే కర్మే అని శ్రీ యోగ వాసిష్టం లో శ్రీరామచంద్రునికి  వశిష్ట మహర్షి కర్మల గురించి వివరించినప్పుడు ఈ క్రింది విధంగా తెలియజేయబడినది .... 
"ప్రతీదీ దైవం ప్రకారమే జరిగిపోతూ వుంటుంది .విధి ఆడించి నట్లు ఆడేవాళ్ళమే మనమంతా,మనం దేవుడి చేతిలో కీలు బొమ్మలమని, ఇలా  మనలో కొంతమంది తరచూ మాట్లాడుతుంటాము .ఆ మాటల లోని ఉద్దేశ్యం ఏమిటంటే- మానవులు ఎంత ప్రయత్నం చేసినా ఏమి ప్రయోజనం వుండదని , దైవం అనబడే వాడు పైన కూర్చుని తనకు నచ్చినట్లుగా మన తల రాతలు వ్రాస్తాడు అని ..కాని వాస్తవానికి కొడుకుని పెంచి పెద్ద చేసేటపుడు తల్లిదండ్రులు ఒక ఆశను ఆ కొడుకుతో పాటే తమలో పెంచుకుంటారు . పెద్దవాడై తమని ఉద్దరిస్తాడని అంటే తమ ఆలనా పాలనా చూసుకుంటాడని.. కానీ ఎ కారణం చేతనైనా అది నెరవేరనప్పుడు వారు " మా  ఖర్మ ఇలా కాలింది " అని శోకాలు పెడుతుంటారు . దీనిని బట్టి నా కర్మ అన్నా, విధి అన్నా , దైవం అన్నా ..ఒకటే  అవుతుంది. వారు  నా కర్మ అన్నారు  . అంటే ఎప్పటి కర్మ ?  ..అది వారి  పూర్వ జన్మలో చేసుకున్న కర్మ అన్నమాట . . ఇప్పుడు వర్తమానం లో ఒకడు తెలిసి గాని , తెలియక గాని నిప్పు పట్టుకుంటే కాలినప్పుడు "నా కర్మ " అనడు . ఎందుకంటే , ప్రత్యక్షంగా చేసిన పనికి ప్రత్యక్షంగా ఫలితం కనిపిస్తే కర్మ అనరు. ఐతే ఈ రెండు చర్యలలో కర్మ అన్నది ఒకటే ఐనప్పటికీ పాత కర్మకు "విధి" అని  పేరు పెట్టారు . అందువల్ల సరిగ్గా పరిశీలించి చూస్తె --పూర్వం చేసుకున్న కర్మ , ఇప్పటి కర్మ అని రెండు రకాల కర్మలు వున్నాయి తప్ప విధి అనేది లేనే లేదు . అది పేరు మాత్రమె"....  
                      నహి కశ్చిత్ క్షణమపి  జాతు తిష్టత్య కర్మ కృత .
                      కార్యతే హ్యనశః కర్మ సర్వః ప్రక్రుతి జైర్గుజై:      
                                                                                  -- భగవద్గీత

అనగా ఎ మనిషైనా ఎ కాలంలో నైనా క్షణం కూడా కర్మాణి ఆచరించకుండా వుండలేదు .దీనిలో ఎలాంటి సందేహం లేదు . ఎందుకంటే, మనుష్యులంతా ప్రకృతికి చెందినా త్రిగుణాలకి లోబడి కర్మలని చేయవలసి వుంటుంది .. 

అసలు "కర్మ" అంటే ఏమిటి ?

         క్రియతే ఆనేన ఇతి కర్మ ---చేయబడేది ఏదైనా కర్మయే . కర్మ అనగా మానసికంగా గాని , శారీరికంగా గాని చేయబడేది .. పూర్తీ ఐన పనిని కర్మ అని, పూర్తీ కాక జరుగుతున్నా పనికి క్రియ అని అన్నారు .అనగా కర్మ తాలూకు భీజం క్రియ లోనే వుంటుంది . కర్మ మంచి కావచ్చు , చెడు కావచ్చు .లేదా మంచి చెడుల మిశ్రమం కావచ్చు .
                 నీతు భోగాద్రుతే  పుణ్యం కిమ్చిద్వా కర్మ మానవం 
                 పావకం నా పునాత్యాషు క్షయో భోగా త్ప్రజాయతే 
                                                               --కర్మ విపాక సంహిత
అనగా సుఖ దుఃఖ  రూపాలైన కర్మలని , అంటే పాప పుణ్యాలని అనుభవించక మానవుడు వాటి నుండి విముక్తుడు కాలేడు ...  

హిందూ సనాతన ధర్మం కర్మ సిద్ధాంతాన్ని ఇలా వివరిస్తుంది ..

            'ఈ ప్రపంచం లో ప్రతి జీవి జన్మించడానికి కారణం, ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే ..చెడు కర్మకి ఫలితం పాపం , పాపానికి దుఖం , మంచి కర్మకి ఫలితం పుణ్యం , పుణ్యానికి ఫలం సుఖం. వాటిని అనుభవించడానికే  ప్రతి జీవీ జన్మని తీసుకుంటుంది .."  © Rukmini Devi J
mmanindarkumarTwitter:ACMWCTRss:mk

3 వ్యాఖ్యలు:

 1. కర్మ అంటే ఓక పని, కార్యం....కర్మ లో నుంచి వచ్చిన చెడు ఫలితాన్ని, పాప ఫలితాన్ని ఖర్మ అంటారు....కర్మ చేయకుండా ఎవ్వరూ వుండరు....కర్మ చేయాల్సిందే....కానీ ఖర్మ రాకుండా జాగ్రత్త పడవచ్చు...నా ప్రాప్తం, నా ఖర్మ ఇలా తగలబడింది....అని అంటారు....అంతేగానీ నా కర్మ ఇలా తగలబడింది అని అనరు....కర్మ అంటే అది పాపపు పని గావచ్చును లేదా పుణ్యం పని గావచ్చును....కర్మ అంటే పని...

  ReplyDelete
  Replies
  1. నమస్కారములతో ... నిజమేనండి .. ఖర్మ కి గురి కాకుండా జాగ్రత్త పడవచ్చు .. మనం చేసే కర్మ ద్వారా ఖర్మ కి గురి కాకుండా .. అందుకే అవినాభావ సంబంధం వుంది అని శ్రీ కృష్ణుడు చెప్పాడు .. ధన్యవాదాలతో ...

   Delete
 2. కర్మ అంటే ఓక పని, కార్యం....కర్మ లో నుంచి వచ్చిన చెడు ఫలితాన్ని, పాప ఫలితాన్ని ఖర్మ అంటారు....కర్మ చేయకుండా ఎవ్వరూ వుండరు....కర్మ చేయాల్సిందే....కానీ ఖర్మ రాకుండా జాగ్రత్త పడవచ్చు...నా ప్రాప్తం, నా ఖర్మ ఇలా తగలబడింది....అని అంటారు....అంతేగానీ నా కర్మ ఇలా తగలబడింది అని అనరు....కర్మ అంటే అది పాపపు పని గావచ్చును లేదా పుణ్యం పని గావచ్చును....కర్మ అంటే పని...

  ReplyDelete