ఓ అందమైన కల .


రెండు చేతులూ చాచాను
నిన్ను నా chetullo పెడుతున్నప్పుడు
ఎవరో ఒక ప్రత్యెక అతిధి మా ఇంటి లోనికి అడుగు పెట్టిందన్న భావన ......
నీకు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అన్న తపనతో మా paapa పరుగులు   ..........
పాలతో తడిచిన నీ ముద్దు ముద్దు పెదిమలను నాలికతో తుడుచుకుంటూ వుంటే
అది ఓ అపురూపమైన ఫీలింగ్ ...
నీ మెడలోని మువ్వలు మా ఇంటికి సందడి అనుకున్నాము ..
ఇది నాది, అంటా నాదే అన్నట్లు ఇంటి చుట్టూ పరుగులు పెడుతుంటే
    మురిపెంగా చూసుకున్నాము ..
మాలో ఒక భాగమై , మాతో పాటు నువ్వూ అనుకున్నాము .......
నీ kanti మెరుపులు మా ఇంటికే అందాలని అనుకున్నాము ..
నీ నవ్వు మాకు పూల జల్లులు ...
నీ చేష్టలు మాకు పాఠాలు అనుకున్నాము ..
నీ హావ భావాలు మాకు గురువులు ...
నువ్వు అలిగిన వేల మరి మరి నీ ముఖం చూస్తూ నవ్వుకున్నాము ....
ఒంటరిగా వదిలి వెళ్లామని,
తలుపు తీసిన మరుక్షణం నీ కోపాన్ని తట్టుకునేందుకు సిద్ధమై
లోపలి అడుగు పెట్టె వాళ్లము నవ్వుకుంటూనే .........
ఆ కోపంతోనే కాబోలు శాశ్వతంగా మమ్మల్ని విడిచి వెళ్లావు ..
ఎందుకు వచ్చినట్లు ? ఎందుకు వెళ్ళినట్లు  ? 

(ఈ నెల పదకొండవ తారీఖున దేహ త్యాగం చేసి ,మమ్మల్ని వదిలి vellina మా టీను కి ఆశ్రు నయనాలతో ............

కామెంట్‌లు

  1. కుక్క పిల్లతో పిల్లలు ఇలా కలిసిపోతే నాకు కొంచం భయంగా ఉంటుంది .. ఇలాంటివి ఉహించే .. మరో కుక్క పిల్లను తెచ్చుకోండి

    రిప్లయితొలగించండి
  2. స్చప్ . . . . .
    ఈ భాధ భరించలేకనే నేను ఇంకోదానిని తెచ్చుకోలేదు :(

    రిప్లయితొలగించండి
  3. మీరు చెప్పింది ఒక విధంగా కాదు, అన్ని విధాలా కరెక్ట్ ... కాని మూగ జంతువులు మన ఆయురారోగ్య ప్రదాతలు . వాటితో కలిసి ఆడుకుంటే ఆనందమే కాకుండా , ఒక మానసిక అనుభూతి కలుగుతుంది .. మాల గారు చెప్పింది అక్షరాలా నిజం .. అందుకే మరొకటి తెచ్చుకోవాలని మనసు వున్నా , ఇదిగో ఇలా జరుగుతుంది అన్న భావన ఎక్కువ గా వుంది .. చూద్దాం భవిష్యత్తు లో ...thank a lot for you both .....

    --

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం