చాలా రోజుల తర్వాత మరల బ్లాగు లోకం లోనికి ప్రవేశించాను..ఈ మధ్య కాలం లో  ఎన్నెన్నో సంఘటనలు ... కష్టాలు, సుఖాలు, తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే పనులు ...వీటన్నింటి మధ్య సాగిపోతుంది మనిషి జీవితం . మనం కష్ట పడుతున్నా, సుఖపడుతున్నా.. మెలకువలో వున్నా , నిద్రించినా , ఏదీ ఆగదు . అదే మరి కాల మహత్యం.. మనం చేసే పని కరెక్టా  కాదా అని తెలుసుకునే  లోపలే ఎన్నో జరిగి పోతుంటాయి .ఆగదు ఎ  నిముషం నీ కోసమూ, ఆగితే సాగదు ఈ లోకము.. ముందుకు సాగదు ఈ లోకము అన్న పాత గుర్తు వస్తుంటుంది ప్రతి క్షణం....ఎన్ని పుస్తకాలు chadivinaa, ఎప్పుడు ఎం చెయ్యాలో అని ఎన్ని ప్లానులు వేసుకున్నా ఒక్కో సమయం మన చేజారిపోతుంటుంది .. మరి వెనక్కి తిరిగి రాదు ...ఒక్కోసారి మనసు పూర్తి వైరాగ్యం తో నిండి పోతుంది. మరుక్షణం లోనే ఆశావహ పరిణామాలు . .ఏమిటి ఈ జీవితం అని లెక్కలేనన్ని సార్లు అనుకుంటూ వుంటాము . కాని ఇంకా ఇంకా బ్రతకాలని , ఏదో కావాలని కోరుకుంటూ వుంటాము . .మన మనుగడను ప్రశ్నించుకుంటూ  వుంటాము .. బ్రతకక మానము ...వట్టి చేతులతో వస్తాము, వట్టి చేతులతోనే వెళ్తాము అన్నది అందరికి తెలిసిందే . అయినా సంపాదనకి పరుగులు తీయక మానము ...గీత చదువుతాము . గీతల్ని  దాటుతాము .ఇదండీ ప్రస్తుతం మనకి తెలిసిన జీవితం . 

ఒక చిన్న అనుభవం చెప్తాను . 

ఒక రోజు నేను స్కూల్ కి వెళ్ళడానికి స్కూల్ బస్సు కోసం రోడ్డు ప్రక్కగా నిలబడ్డాను..ఇంకా బస్సు రావడానికి కొంత సమయం వుంది ..రోడ్డంతా వురుకులు పరుగులు గా వున్న వాతావరణం .. ఈ రోజుల్లో ట్రాఫిక్ గురించి తెలియనిదేవరికి ? ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని వున్నాను .. విచిత్రం - రోడ్డు మీద మనుషులు, వాహనాలు కనబడలేదు . ఎందఱో సాధువుల కాషాయ వస్త్రాలలో, పెరిగిన పెరిగిన, శిఖలతో , కమండలాలు  చేత పట్టుకుని రోడ్డు మీద నిదానంగా నడిచి వెళ్తున్న దృశ్యం . . అద్భుతం ఆ దృశ్యం  , అదే నిజమైతే ? చాలా ప్రశాంతంగా అనిపించింది. .
ఆ ప్రశాంతత కావాలి ..కానీ కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన ప్రశాంతత దొరుకుతుందా ??మనల్ని మనం ప్రశ్నించుకోవలసినదే.. కదా .....
 

కామెంట్‌లు

  1. కాలం ఆగడం లేదు, మరి మనలో మార్పు కనపడం లేదు, ఏమి చెయ్యాలంటారు ఆ ప్రాసంతతకోసం?

    రిప్లయితొలగించండి
  2. కాలం ఆగదు ..దానిని గమనించుకుంటూ వెళ్ళడమే మన పని .. ఎవరికి వారు మనలోకి మనం తొంగి చూసుకుంటే, మనలని మనం విశ్లేషించుకుంటే, కోరుకున్న మార్పు తప్పకుండా వస్తుంది ..మనసా, వాచా, కర్మణా ........ మన వల్ల ఎవరికి హాని గాని, బాధ గాని కలగకుండా చూసుకోగలిగితే చాలు ..........ప్రశాంతతను అనుభవిస్తాము .. చిక్కులు పడిన దారాన్ని ఒకేసారి చిక్కు తీయాలి అనుకునే బదులు, ఓపిక వహించి నెమ్మదిగా చిక్కు విడదీస్తే, తప్పక పలితం దొరుకుతుంది ..

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం