పోస్ట్‌లు

జూన్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆధ్యాత్మిక అనుభవాలు

 మన నిత్య జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో  అనుభవాలు.... అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే  ఆనందిస్తాం, లేకపోతె విచారిస్తాము... ప్రపంచంలో మనకున్న కష్టాలు వేరెవరికీ వుండవనే భావనలో వుంటాము..  ఈ నవ్వడం, ఏడవడం అనేవి  మానసికములు...మనసు మీద ఆధార పడి వుంటాయి...ప్రాపంచిక జీవనం నుండి ఆధ్యాత్మిక జీవనంలోనికి మనకు తెలియకుండానే అడుగులు పాడినప్పుడు చాలా అనుభవాలు, వాటి ద్వారా కొంత కలవార పాటు సహజం.. అకస్మాత్తుగా అప్పుడు అనిపిస్తుంది------ "ఒక వ్యక్తి అవసరం. ఒక గురువు అవసరం" అని. అదేమిటి ? స్కూల్ లో, కాలేజీ లో  టీచర్లు వుంటారు కదా. ఇంకా వేరే గురువు ఏమిటి అనుకోవచ్చు.. అత్యవసరం ....... ప్రాపంచిక జీవనంలో మనకు అమ్మ,నాన్న, ఉపాధ్యాయులు నేర్పేవి అనుసరిస్తే ఒక మంచి వ్యక్తి గా మనల్ని మనం తీర్చి దిద్దుకోగలం.. కాని ఆధ్యాత్మిక ప్రయాణం పూల బాట కాదు.. ముళ్ళ బాట. అడుగులు ఆచి, తూచి వెయ్యాలి.. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా పడిపోవడం తప్పదు.. అందుకే మనకు ఆ బాటలో జాగరూకతతో నడిపించే ఒక వ్యక్తి కావాలి.. ఒక మంచి గురువు కావాలి..దొరికిన వారు అదృష్టవంతులు. దొరకనివారు వారి అన్వేషణ కొనసాగిస్తూనే వుండాలి.. ఈలోగ...

" సర్వేజనా సుఖినో భవంతు"..........

నిన్నటి ధర్మం గురించిన చర్చా విషయాలు చదివి  సత్య పళ్ళెం గారు   స్పందించి వ్రాసినది  చూడండి.. ...... "ధారనాద్ధర్మ మిత్యాహు  ధర్మోధారయతేప్రజాః యత్స్యాద్ధారణ సంయుక్తం  సధర్మ ఇతినిశ్చయః ధర్మ శబ్దానికి అర్ధం ధరించుట, ధారణమొనర్చుట. "ఆహార నిద్రా భయ మైధునం చ సామాన్య మేతత్ పశుభిర్నరాణాం, ధర్మో హి తేషామధికో  విశేషో, ధర్మేణహీనాః  పశుభి సమానాః " (భావం: భోజనం,నిద్ర భయం,మైధునం మనుష్యులకు పశువులకు సమానం. మనిషికున్న విశేషత ధర్మం. ధర్మహీనుడు పశువుతో సమానం) "ధనాని భూమౌ పశవో హి గొష్టే, నారీ గృహద్వారి సఖ శ్మశానే, దేహశ్చితాయాం పరలోకమార్గే, ధర్మానుగోగాచ్చతి జీవ ఏకః " (భావం: ధనం  భూమిలో నిలిచిపోతుంది.పశువులు శాలలోనే  ఆగిపోతాయి. భార్య ఇంటి గుమ్మంలోనే ఆగిపోతుంది. బంధుమిత్రులు స్మశానం వరకు సాగనంపి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. దేహం చితిపైన కాలిన తర్వాత కూడా పరలోక మార్గమున వెంటనుండి,జీవున్ని అనుసరించి వచ్చేది దర్మం మాత్రమే) "ధర్మాదర్ధః  ప్రభవతి, ధర్మాత్ ప్రభవతి సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసార మిదం జగత్ " ( భావం: ధర్మం వలన అర్ధం, సుఖం,సర్వం...
ధర్మాన్ని ఆచరించడమే కాని ప్రశ్నించ కూడదు అని కృష్ణ ద్వైపాయనుడు, ధర్మరాజు ఇద్దరూ చెప్పారని మన యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు తన "ద్రౌపది" లో వ్రాయడం జరిగింది... కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ధర్మం మారుతుందని, ద్రౌపది వివాహం పాండవులతో జరగాలని కృష్ణ ద్వైపాయనుడు నిర్దేశించాడు కనుక అది ధర్మం ఐనదని, కుంతీ తన ఐదుగురు పుత్రులు ద్రౌపదిని సమానంగా పంచుకొమ్మని ఆదేశించింది కనుక అది ధర్మమైంది అని చెప్పారు...కాలాన్ని బట్టి మారిన ధర్మాన్ని మనం అంగీకరిస్తున్నాము. తప్పడం లేదు.. కాని అధర్మం మాత్రం ఏమాత్రం మార్పు చెందడం లేదు అనడానికి ఉదాహరణ ........ఆనాడు త్రేతా యుగంలో సీతాదేవిని రావణుడు అపహరించడం, ద్వాపర యుగంలో ద్రౌపదిని నిండు సభలో దుశ్శాసనుడు అవమానించడం, .....ఈనాడు గోనే సంచుల్లో, సూట్ కేసుల్లో ఆడవారిని చంపి దాచి వుంచడం ..కలియుగం కాబట్టి అధర్మం కొంత టెక్నాలజీ నేర్చుకుందా  ?   ... అధర్మం వెనకాలే ధర్మం వుందని నిరూపణ అవుతుందా లేక ధర్మం వెనక అధర్మం పొంచి వుందా ??  

సత్సంగం

అందరికీ నమస్కారం....నేను ఈ మధ్యనే గూగుల్ సత్సంగం గ్రూప్ లో జాయిన్ అవడం జరిగింది... ఎందరో పెద్దలు ,అనుభవజ్ఞులు, జరిపిన కొన్ని అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక చర్చలు మీ అందరికీ పరిచయం చెయ్యాలని ఆకాంక్షతో, వారి అనుమతితో అందరికీ ఉపయోగపడే ఆధ్యాత్మిక విషయాలను నా బ్లాగ్ లొ పోస్ట్ చెయ్యడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.. ఇది కేవలం     పుస్తక పరిజ్ఞానం ఎంత ఉన్నప్పటికీ, తమ తమ స్వీయ ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక  అనుభవాలు మన జీవన పయనంలో ఎంతగా దోహదపడతాయో తెలిపే   ప్రయత్నం....సదుద్దేశ్యపూర్వకమైనది ..... ఈనాటి  చర్చలో భాగంగా "ధర్మం" ఏ పాత్ర వహించిందో చూద్దామా మరి.............  ముందుగా అయ్యవారి నాగేంద్ర గారు అడిగిన ప్రశ్నలు చూడండి ..... " ధర్మం అంటే ఏమిటి? దాని స్వరూపమేమి? ధర్మాన్ని పట్టుకుంటే జరిగేదేమిటి ఒరిగెదేమిటి? ధర్మాన్ని పట్టుకోవడంలో వచ్చే వైక్లవ్యాలు ఏమిటి? వగైరా వగైరాలు కొన్ని దృష్టాంతాలతో.. ఎవరికెంత తెలుస్తే అంత తెలుపవచ్చు."   అన్నారు....    సమాధానంగా  రాజశేఖరుని విజయశర్మ గారు   ఇలా చెప్పారు ........... "సత్యము, శౌచము, తపస్సు, దయ ...

కొన్ని అమూల్యాలు...

సాధన ఇలా చేయవచ్చా?...... ................. చిత్తవృత్తి నిరోధం,తపస్సు,అష్టాంగయోగాలు( యమ,నియమ,ఆసన,ప్రాణాయామ,ప్రత్యా హార,ధారణ,ధ్యాన,సమాధి), సాధనాచతుష్టయం(నిత్యానిత్య వస్తువివేకం,ఇహాముత్రార్ధఫలభో గవిరాగం,శమాదిషట్క సంపత్తి,ముముక్షుత్వం), యజ్ఞయాగాదులు, గురు సాంగత్యం....... అమ్మో! ఎన్నో భాద్యతల నడుమ, మనమున్న నేపద్యంలో ఈ విధమైన ఆధ్యాత్మిక సాధన  సాధ్యమేనా? ముమ్మాటికి కాదు. మరి ఎలా? ఇలా సాధన చేయవచ్చా ?...... ప్రార్ధనలు,శత,సహస్ర నామావళిలు,పారాయణాలు చేయడం కంటే ఇలా చేస్తే ఎలా వుంటుందంటారు? మనం (ఇక్కడ మనం అంటే మనిద్దరం కాదు. నాలాంటి వారందరూ) పూజించే "బాబా" చరితంను పారాయణం చేయడమే కాకుండా, మనం చదివిన ఆ చిన్నచిన్న ఘటనలలో అంతరార్ధం గ్రహించి, బాబా ఆ ఘటనల ద్వారా అందిస్తున్న ఆ జ్ఞానబోధను మన జీవన గమనంలో త్రికరణశుద్ధిగా అలవర్చుకుంటే........ ఎలా వుంటుందండీ? ఉదాహరణకు కొన్ని.......... * ఒక పాలవర్తకురాలు- శివుని అభిషేకార్ధం పాలు ఆలస్యముగా పోస్తుందని పూజారి కోపడితే- పడవలో ఏరుదాటి రావడం ఆలస్యమౌతుందని ఆమె చెప్పగా- "భవసాగరాన్ని తరింపచేసే భర్గుడి అభిషేకానికి పాలు తెస్తుంటే ఆలస్యం ఎ...