మనోయోగ సాధన........

మౌనంగా వుండడం చాతకానితనం కాదు. బడబడా మాట్లాడడం గడసరితనం కాదు.. మౌనంగా వుండేవారు అంతర్లీనంగా ఆలోచనా శక్తితో నిండి ఉంటారు.
అవి ఎదుటివారిని ఇబ్బంది పెట్టవు. వారు అలాగే ఆనందంగా వుంటారు. గబగబా మాట్లాడెవారు తొందరలో మాట్లాడే మాటలు ఎదుటివ్యక్తిని బాధపెట్టవచ్చు.
ఇబ్బందుల్లో పడవేయవచ్చు.. వీరికి ఆలోచనా శక్తి తక్కువగా ఉంటుంది.

పుస్తకాలంటే అమితమైన ఇష్టం ఉన్న నేను ఈనాటివరకూ భగవద్గీతను పూర్తిగా చదవలేకపోయాను. కాని నా కర్మను నేను ఏనాడూ విడిచిపెట్టలేదు. జరిగేది గమనిస్తూ వుంటాను. కష్టపడడానికి ఇష్టపడతాను. అలా అని నాలో అంతర్లీనంగా దాగి ఉన్న ఆనందాన్ని విడిచిపెట్టను.. ఎన్ని పుస్తకాలు చదివినా ఏదో వెదుకులాట.. చివరకు నాకు దొరికిన పుస్తకం "యోగసాధన,  మనోయోగదర్శనం"..రచన..రాజీవ్ గాంధీ ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత భారతజ్యోతి ఆచార్య డా//యోగశ్రీ గారు. 1910 వ సంవత్సరంలో ప్రారంభమైన కుండలినీ యోగం 2010 నాటికి నూరేళ్ళకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంతవరకూ వెలుగు చూడని కుండలినీ యోగంపై రచించిన పుస్తకం ఇది.

సహజంగానే ధ్యానసాధన మొదలుపెట్టిన మానవునికి కుండలినియోగం గురించిన విషయంలో ఆసక్తి వుండడం పరిశీలనలోకి వచ్చింది. కారణం ఒక్కటే...
ధ్యానంలో వున్నప్పుడు తమకు కలిగిన అనుభవాలు వారికి ఎన్నో సందేహాలు కలుగజేస్తాయి.. వాటిని తీర్చుకోవాలన్న తాపత్రయంలో అటు,ఇటూ పరుగులు తీయడం కూడా గమనిస్తాము.. ఆధ్యాత్మికం అంటే పూలబాట కాదు, ముళ్ళబాట అని ఉదాహరణలతో సహా వివరించారు పెద్దలు.. అవి అనుభవాలు కూడా..
మానవుడు తనలో దాగియున్న, తనకు తెలియని అంతర్గతశక్తిని గుర్తించడంలో విఫలమౌతూ, కష్టాలు, నష్టాలు అని నిత్యం దుఖ్ఖంలో మునిగి తేలుతూ వుంటాడు అన్నది మనకి తెలియని విషయం కాదు..
బంధాలూ,బాధ్యతలు మనకి దుఖ్ఖాన్నే మిగులుస్తాయి అన్నదీ తెలియనిది కాదు.
పుడుతూ ఏడుస్తూ పుట్టే మానవుడు, పోతూ ఏడ్పించి మరీ పోతాడు.
ఈ దుఖ్ఖాన్ని మననుండి దూరం చేసుకోవడం కోసం మనం ప్రత్యాయామ్న పద్దతులు వెదకడానికి సిద్దపడతాము.
అందులో ఒక పద్దతి "ధ్యానమార్గం" అని మహాత్ములు మనకి వివరించారు. అదీ మనకి తెలిసిందే.
ప్రతి మనిషి తన జీవిత చరిత్ర వ్రాయడం మొదలుపెడితే ఈనాటికి భూమిపై మనుషుల కన్నా వారి చరిత్రలు, అనుభవాలు నిండిపోయి వుంటాయి అని అంటాను నేను..
ఆశాజీవులం.. మనకి పడని విషయాలకై ఆశిస్తూనే ఉంటాము. ఏదో కావాలి అని పరితపిస్తూ వుంటాము. ఎవరినైనా మనం అతి తేలికగా నీకు "మనసు లేదా", నీకు హృదయం లేదా అని అంటూ వుంటాము. గుండె ఎడమప్రక్కన ఉంటే హృదయం కుడిప్రక్కన ఉంటుందట.

  ఆశాజీవులం.. మనకి పడని విషయాలకై ఆశిస్తూనే ఉంటాము. ఏదో కావాలి అని పరితపిస్తూ వుంటాము. ఎవరినైనా మనం అతి తేలికగా నీకు "మనసు లేదా", నీకు హృదయం లేదా అని అంటూ వుంటాము. గుండె ఎడమప్రక్కన ఉంటే హృదయం కుడిప్రక్కన ఉంటుందట. ఈ మధ్యనే ఒకరి ద్వారా తెలిసింది.
మనిషి బ్రతికి ఉండడానికి కావలిసింది గుండె కద. అది సరిగ్గా పనిచేస్తే చాలు కద. మరి ఈ హృదయం ఏమిటి? ఎక్కడినుండి వచ్చింది ఆ పదం అని వెదకడం మొదలుపెట్టాను. (స్పందన లేని జీవితం వ్యర్ధం అంటారు కొంతమంది. ఈ స్పందనలు ఏమిటి అని ప్రశ్నిస్తూ వుంటాను.)
సరిగ్గా ఈ ప్రశ్నలు నాలో మొదలైన తర్వాత నా అన్వేషణ సాగింది. యోగ సాధన అన్న ఈ పుస్తకం నా కంటబడిన క్షణంలో ఏదో గుప్త నిధి దొరికిన ఆనందం.. ఈనాటికీ అది నిలిచి ఉంది..
అంతటి ఆనందాన్ని, అమిత జ్ఞానాన్ని ప్రసాదించగల శక్తి వున్న ఈ పుస్తకాన్ని ఎందరో చదివి ఉండవచ్చు.ఐనప్పటికీ పూర్తిగా కాకపోయినా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలన్న తలంపుతో మీ ముందుకు వచ్చాను.
ఒక్కోసారి ఏ ధ్వని వచ్చినా అది "ఓంకారం" లా ప్రతిధ్వనిస్తూ వుంటుంది. ఈ పుస్తకం నా చేతిలొ వున్నప్పుడు కూడా ఆ అనుభూతిని కలిగిస్తుంది.
నా అనుభవాలూ, అనుభూతులూ నిజమైన ఆనందం ఏమిటో తెలియజేసాయి. అశాశ్వతమైన ఈ ప్రపంచం మాత్రమే మనకి తెలిసినది. బౌతికమైనది.. మనకి కలిగే ఈ కష్టాలు కష్టాలే కాని..కావు..నారాయణున్ని ఎలా ప్రేమిస్తామో, మనకి కష్టాల్ని కలిగిస్తాడన్న శనీశ్వరుణ్ణి కూడా అలానే ప్రేమిస్తున్నానన్న నా అనుభూతి ఒక అద్భుతం.. అందువల్ల ఒయాసిస్సు లాంటి ఈ జీవితంలో జ్ఞానమనే సాగరాన్ని త్రాగమని చెప్తున్నాను.. 
ఇక పుస్తకంలోని విషయానికి వస్తాను..

ముందుగా  యోగశ్రీ గారు ఏం చెప్పదలచుకున్నారో మీకు తెలియపరచాలన్న అభిలాషతో మీ ముందుకు వస్తున్నాను..

  " కేవలం కొన్ని నిమిషములు కళ్ళుమూసుకుని కూర్చోవడం కాదు యోగసాధన అంటే, జ్ఞానం లేని సాధన గ్రుడ్డిసాధన అంటే ఒక గ్రుడ్డివాడు ఇంకొక
గ్రుడ్డివానికి సూర్యుని చూపించినట్లు వుంటుంది. జ్ఞానము, సాధన మిళితము ఐనప్పుడే సాధకునికి పూర్ణత్వం సిద్ధిస్తుంది."...........డా//యోగశ్రీ...

సాధకులు యోగమును ఎలా ప్రారంబించాలి, సాధనా విధాన సూత్రములు, ఏకాగ్రతను సాధించుట, మనస్సుని ఎలా జయించాలి..దగ్గరనుండి, ఆరోగ్యమునకు అవసరమైన సచ్చిదానంద స్థితిని పొందడానికి కావలసిన ఆధ్యాత్మిక ఉపాయాలూ, బ్రహ్మానందస్థితికి చేరుకునే ఉపాయాలూ తెలియ జేయబడ్డాయి ఈ పుస్తకంలో.
మనకు వాడుక పదం........ఎవరికైనా కోరుకున్నది లభ్యం కానప్పుడు " నాకు యోగం లేదు" అనో  "నీకు యోగం లేదురా" అనో అంటూ వుంటాము.
గృహయోగం, వాహనయోగం ,కల్యాణయోగం... అసలు "యోగం" అంటే ఏమిటి?

"యోగం" అనగా కలయిక లేక ఐక్యము, కలుపునది అని అర్ధం తెలిపారు.
"సమత్వం యోగ ఉచ్చతే" అన్న గీతా వాక్యానికి అర్ధం.........కార్యం ఫలించినను, ఫలించకున్నను సమస్థితి కలిగి ఉండడం..అని తెలిపారు.
నిశ్చలస్థియే యోగమని, ఆత్మ దర్శనం పొందు సాధనే యోగమని చెప్పారు.

మమత, ఆసక్తి, ప్రీతి, కోరికలను త్యజించుటయే యోగం..
సన్యాసం ఒక యోగం..
సన్యాసం అనగా ఇంద్రియములు, మనస్సు, శరీర క్రియలందు ఆసక్తి వదిలి పరమాత్మయందు దృష్టి సారించుట.
 పఠనం, శ్రవణం, మననం, ఆలోచన,చింతన, నిరంతర అభ్యాసం, ధ్యానం, ఏకాగ్రత, అనుభూతి ..యోగ లక్షణాలు...

యోగి:
 ఆత్మ ప్రాప్తి కొరకు నిరంతర సాధన చేయువాడు యోగి.
అడ్డంకులు, అపనిందలు వచ్చినవని రామక్రిష్ణుల వారు వెనక్కి మళ్ళితే, ఈనాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యోగిపుంగవులు వివేకానందుల వారి ఉనికి మనకి తెలిసేది కాదేమో.... నా మాట ఇది.    
అనన్య,నిరంతర సాధన చేయువాడు పరమానందానుభూతిని చెందును. తనను తానే ఉద్దరించుకొనును..

అందుకే అంటారు..."నిన్ను నేవే ఉద్దరించుకో" అని........ తరువాయి భాగం రేపు..........    

కామెంట్‌లు

  1. ఆత్మ మన శరీరములో ఎక్కడుంటుందో గీత లో వివరముగా వుంది, కాని ఆ స్థానములో ఎవరు దృష్టి పెట్టారు.. ఎందువల్లో మరి..!

    రిప్లయితొలగించండి
  2. baagundi..నేను కూడా ఎందుకో పుస్తకాలు పూర్తీ చదవకుండా పోతున్నాను..అందులో యోగావాసిష్టం ఒకటి..మీ లాగ సారంసాలు చెబితే మాలతి వారికి చాల వుపయోగం.
    లక్ష్మీ రాఘవ

    రిప్లయితొలగించండి
  3. అందరికీ నమస్కారం..నా ధన్యవాదాలు కూడా.. అమ్మ అనారోగ్యం, ఆమె అకాలమరణంతో నేను మిమ్మల్ని పలకరించలేకపోయాను...ఆలస్యానికి మన్ననలు కోరుతున్నాను..

    రిప్లయితొలగించండి
  4. madam please tell me , the publisher name of this book yogasadhana, manoyogadharshanam.

    రిప్లయితొలగించండి
  5. SURE ........yogasaadhana, himalaya yoga darshanam is written by aachaarya Dr.Yogashree..Published by "THE YOGA SCHOOL FRIEND'S SOCIETY".....You can get it in Vishalandra book house anywhere.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం