ఎందరో రచయత(త్రు)లు..అందరికీ నా అభివందనాలు. ముందుగా కదంబమాల అనే సిరీస్ ని మొదలు పెట్టిన జ్ఞానప్రసూన గారికి నా నమస్కారాలు.. ఈ ఒరవడిలో నేనూ వున్నాను అని చేసిన నా యీ చిన్నిప్రయత్నాన్ని మీ ముందు ఉంచుతున్నందుకు ఆనందిస్తున్నాను..

ఈ ప్రయత్నం సఫలం కావాలంటే మీరు  సుభద్ర గారు  వ్రాసిన కథ చదివి రావాలి మరి...

కదంబమాల___

"అమ్మా, అనితా... అనితా" అన్న నారాయణమ్మ గారి కేకలకి పరుగున వెళ్ళిన సరోజిని అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టురాలై నిలబడిపోయింది కొన్ని క్షణాలు..

వెంటనే తేరుకుని వంటింట్లోకి పరుగెత్తి గ్లాసుతో నీళ్ళు తీసుకుని వచ్చి అనిత మొహం పైన చిలకరించింది.
కొన్ని క్షణాల తర్వాత తేరుకున్న అనితని  "ఏమయిందిరా" అని అడిగిన శ్రీరాం గారిని చూసి బోరున ఏడ్చేసింది..

"అయ్యో,అయ్యో..నేనప్పుడే చెప్పాను.. పిల్ల అర్బకురాలు. ఈ మాయదారి చదువులు వద్దు అని. విన్నారా ఎవరైనా. ఇప్పుడు చూడండి ఎలా ఏడుస్తుందో". అని నారాయణమ్మ గారు గోల చెయ్యడం మొదలుపెట్టారు.

అబ్బా.. నువ్వుండవే.. నన్ను మాట్లాడనీ.. విషయం కనుక్కోనీ" అని చిన్నగా  నారాయణమ్మ గారిని
మందలించి, "అనితా! ఇలా చూడమ్మా. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు సమాజంలో ఒక బాగం ఐపోయాయి. న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థను ఒకందుకు ప్రోత్సహిస్తే,అది ఈనాటి సమాజాన్ని పెడత్రోవ పట్టిస్తుంది. అలా అని అన్ని కుటుంబాలూ అలానే వున్నాయి అని కాదు నా ఉద్దేశ్యం. చరిత్రను, సమాజాన్ని చీడపురుగుల్లా చెదలు పట్టిస్తున్న దుష్టులు ఆనాటి మన పురాణాల్లోనూ ఎందరో వున్నారు. అలానే మన సంస్కృతి రక్షించిన యుగపురుషులూ,నారీమణులూ వున్నారు. ఆకాశాన్ని అంటుకుంటున్న  దరలు, అమ్మా,నాన్న ఉద్యోగాలు చేస్తేనే కాని పిల్లల బంగారు భవిష్యత్తుకి పునాదులు వుండని రోజులు ఇవి..వారు తమ తమ పనులకి బయటకు వెళ్తే ఇంటి దగ్గర ఆయాల సంరక్షణలోనో లేక వారిద్దరూ ఇంటికి ఎన్ని గంటలకు తిరిగి వస్తారో అన్న ఎదురు చూపుల్లోనే చిక్కుకు పోతున్నారు ఈనాటి పిల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో వారు  తమ తల్లిదండ్రులతో గడిపే సమయం, అవకాశం తగ్గిపోవడంతో  మీడియా ప్రభావానికి లొంగిపోతున్నారు. మంచిని గ్రహించడానికి సమయం పడుతుంది కాని, చెడు ఇట్టే ఆకట్టుకుంటుంది మనలని. దొంగతనాలు, హత్యలు చెయ్యడానికి ఎన్ని రకాల మార్గాలు వున్నాయో, అన్ని మార్గాలని అట్టే శ్రమపడకుండా చాలా సులభంగా భోదిస్తున్నాయి ఈనాటి సినిమాలు, సీరియళ్ళూ..యువత చెడుదారి పట్టడానికి దారి చూపిస్తున్నాయి..అర్ధంలేని ప్రేమలు,ఆకతాయి చేష్టలు ఇలా సామాజిక సమస్యగా మారి ఈ సాలె గూడులొ చిక్కుకుని బలైపోతున్న యువతులు ఎందరో......అబద్దం చెప్పినంత తేలికగా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ ప్రబుద్దులు. వారికి ఎలా బుద్ది చెప్పాలో ఆలోచించాల్సిన విషయం.
కాని తల్లీ..ఒక్క మాట. ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలకి సామాజిక, శారీరిక సమస్యలను విశదపరచినపుడు ప్రతి ఆడపిల్లా తమ మానసికస్థితిని "నేను నా కారెక్టర్ని ప్రొటెక్ట్ చేసుకుంటాను" అన్న భావనను తమ బలంగా మార్చుకోగల్గినరోజున ఈ సమస్యలు తలెత్తవు తల్లీ. అప్పుడే ఈ ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది." అని ఆవేశంగా అంటూనే అనిత తలపై అనునయంగా నిమిరి "భయపడకమ్మా! రేపటినుండి నీమీద ఏ క్రీనీడా పడకుండా చూసుకునే భాద్యత మాది. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు బలహీనపడిన క్షణం, ఎదుటివ్యక్తికి బలాన్ని చేకూర్చుతుంది. చీర్ అప్ గర్ల్ " అని ధైర్యం చెప్పారు శ్రీరాం గారు.
అనిత మొహంలో చిరునవ్వు చోటుచేసుకుంది. ఆయన మాటలకు పూర్తిగా తేరుకుంది. "అలానే పెదనాన్నగారూ " అని నవ్వింది. గుండెల్లో ఏదో తేలిక భావన. "అవును, నేనెందుకు భయపడాలి", మనసులో తనని తానే ప్రశ్నించుకుంది.

 " వదినా పద,నీకు వంటలో సాయం చేస్తాను" అని సరోజిని వెంట వంట గదిలోకి వెళ్ళింది అనిత.

అందరి మనసులు తేలిక అయ్యాయి..ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నులయ్యారు..

అనితను చూసి సంతోషపడింది సరోజిని. మంచిపిల్ల. పరిస్థితులని అర్ధం చెసుకుని మసలగలిగే పిల్ల..
ఏదో చదువుకుందామని వచ్చిన ఆ అమ్మాయిని ఇంతటి ఆవేదనకు గురిచేసిన వారిపై కోపం వస్తుంది.  
ఇక జానకి గురించి ఆలోచించాలి. పసిపిల్ల. అందరూ ఉన్నప్పటికీ, తండ్రి ఆగడాలు, తల్లి వేదనల మద్య నలిగిపోతుంది. చదువుకోవాలి అన్న ఆశతో ఉన్న ఆ పిల్లకి తనకి చేతనైనంతలో ఏదో ఒకటి చెయ్యాలి. ఐనా ఎక్కడో, ఎవరో బాధల్లో ఉన్నారు అని పరుగులు తీసే మనం మనకంటి ముందు తిరుగాడుతున్న భాదితులను చూసీ చూడనట్లు వదిలేస్తాము. ఇంట గెలిచి,రచ్చ గెలవాలి అన్న సామెతను నేను జానకికి సహాయం చెయ్యడం ద్వారా నిజం చేస్తే..? ఒక మనిషిగా పేరుప్రతిష్టలకై ప్రాకులాడేకన్నా ఇలాంటివారికి సాయం చెయ్యడంలో ఉన్న తృప్తి ముందు అష్టైశ్వర్యాలు కూడా దిగదుడుపే కద. యెస్..ముందు ఆ పిల్లని హాస్పిటల్ నుండి తీసుకురాగానే తను నెమ్మదిగా కౌన్సిల్ చెయ్యాలి. తన ముద్దు,ముద్దు నవ్వులను పరిస్థితులు నలిపివెయ్యకూడదు..పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం చెప్పాలి. తన చదువుకి తగిన సహాయం నేను ఒక్కదానినే చెయ్యలేకపోయినప్పుడు ఇంకెవరి సహాయం ఐనా కోరవచ్చు. కాని ముందు ఈ ప్రపోజల్ ఇంటివారి ముందు పెట్టాలి. అని మనసులోనే నిర్ణయించుకుంది సరోజిని. తన ఆలోచనలకు తనని తాను అభినందించుకుంది. ఏదో హాయి మనసుని చోటుచేసుకుంది..
"రండి, రండి..భోజనాలు తయ్యార్"...అంటూ రాగాలు తీస్తూ అందరినీ ఆహ్వానిస్తున్న అనితని చూసి, ఎన్నాళ్ళకు పిల్ల మొహంలో నవ్వు చూసాము అని అందరూ సంతోషించారు.
"ఇంతకీ ఏమి స్పెషల్స్ అట..." అని అంటున్న భాస్కర్ కి లిస్ట్ చెప్పడం మొదలుపెట్టింది అనిత.
వడ్డిస్తూనే తన మనసులోని మాట నెమ్మదిగా బయటపెట్టింది సరోజిని. ఎప్పుడూ పూజలూ, పునస్కారాలూ,మడీ.. తప్ప వేరే ఏమీ పట్టని అత్తగారు ఏమంటారో అని చిన్న సంకోచం.
శ్రీరాం గారు అభినందనగా చిరునవ్వుతోనే తన అంగీకారం తెలిపారు.
నారాయణమ్మగారు తల పంకించి.."చూడు సరోజా. నీ ఇష్టం. ఐనా ఇవన్నీ మనకెందుకు లేనిపోని తలనెప్పులు. మనపని మనం చూసుకోక..వాళ్ళమ్మా,అమ్మమ్మా, ఉన్నారుగా .." అన్నారు.
"పోనీ అమ్మా, అందరూ ఇలా మనకెందుకూ అనుకుంటే ఎలా? ఎవరో ఒకరు ముందుకు రావాలిగా.  రాళ్ళు విసిరామని పూలు ఇవ్వడం మానేస్తున్నాయా చెట్లు..ఏదో మనకున్నదానిలో. మనకి మాత్రం పోయేది ఏముందీ. తన పిల్లలతో పాటు ఆ పిల్ల. అంతేగా.." అన్న భాస్కర్ మాటలకు ఎంతో పొంగిపోయింది సరోజిని.
ఎప్పుడైనా ఆయన కరకుగా మాట్లాడితే భయపడిపోతుంది తను. భాస్కర్ మాటలు సరోజినికి ఎంతో నచ్చాయి.
అమ్మయ్య.. అనుకుని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది సరోజిని.  జయమ్ము నిశ్చయమ్మురా..అని పాట గుర్తొచ్చింది ఆమెకి.
" ఆ..అన్నట్లు మర్చిపోయాను అనిత తల్లీ.. ఇప్పుడే నా ఫ్రెండ్ అచ్యుతరావుతో మాట్లాడాను. వాడు డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్.. ఇకనుండి మీ కాలేజీ ఒక్కటే కాదు, మరికొన్ని ప్రదేశాలలో నిఘా పెట్టించి, ఆకతాయిల ఆటలు కట్టించే ప్రయత్నాలు చేస్తున్నారట. సో..డోన్ట్ వర్రీ..ఓకే నా.."అని చేతులు కడుక్కున్న తర్వాత అనిత అందించిన టవల్ తో చేతులు తుడుచుకుంటూ చెప్పారు శ్రీరాం గారు.
"ఓకే నండి పెదనాన్నగారు." అంది అనిత.
"అనితా, సుమా వాళ్ళు వచ్చేనాటికి మనం మన ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోవాలి. గుర్తుందా?" అడిగింది సరోజిని. ఇంట్లోకి ఏం కావాలో లిస్ట్ ప్రిపేర్ చెయ్యసాగింది. ఇంతలొ
"అమ్మగారూ.. అని వచ్చిన లక్షమ్మ పిలుపుతో  జానకి గురించి వాకబు చేయాలని పెరట్లోకి  వెళ్ళింది....
సుభద్ర కూడా వచ్చింది మాటలు విని..

తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలని ఆసక్తితో ఎదురుచూస్తున్నారా... పదండి   లక్ష్మిగారిని    అడిగి తెలుసుకుందాము..

కామెంట్‌లు

  1. ప్రస్తుత సమాజంలోని సమస్యలను చక్కగా చూపించి, అటువంటి సమస్యలకు పరిష్కారం కూడా అంత బాగానూ చూపించారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. మీ బ్లాగులో అన్ని పోస్టులూ చదివాను. చాలా బాగున్నాయి. ముఖ్యంగా "భగవద్గీత" గురించి చక్కగా రాసారు. మిగిలిన నేటి సమాజ పరిస్థితి (పిల్లల మనోభావాలు) మరియు ధ్యానం గురించి విశ్లేషణ అన్ని చాలా బాగున్నాయి. ఒక టీచర్ గా, ఓ అమ్మ గా మీరు పడే వేదన చాలా బావుంది. నేను చూసిన అన్ని బ్లాగుల్లోకి మీ బ్లాగు బాగుంది. అయితే ఈ కాలం వాళ్ళకి ఇవేవీ అక్కర్లేదు, అందుకే బ్లాగుల్లో కూడా ఏవేవో పనికి రాని చెత్తలు, వాటి పై వాదనలు, దెబ్బలాటలు. మనశ్శాంతి వాళ్ళకి వుండదు, ఇవతలి వాళ్ళకి వుండదు. కాని ఈ సీరియల్ ఎందుకు మొదలు పెట్టారు? ఎవరైనా సజెస్ట్ చేసారా?

    రిప్లయితొలగించండి
  3. శ్రీలలిత గారూ, మీ ప్రోత్సాహం నా ఈ రచన...థాంక్యూ వెరీమచ్ అండి..వోలేటి గారు, విజయమోహన్ గారుమాల గారూ ధన్యవాదాలు. మాలగారి నుండి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్లున్నాను..

    రిప్లయితొలగించండి
  4. ఇంతకు ముందు రాసిన భాగంలో జానకి ఆస్పత్రిలో వుందని తెలిసి సుభద్ర ఆస్పత్రికి వెళ్ళటానికి చెప్పులువేసుకుని బయల్దేరిందన్నారు. మీరు మీ భాగం చివరలో మాటలు విని సుభద్ర కూడా వచ్చిందన్నారు. ప్రసూనగారు రాసినభాగంలో పొద్దున్నే లేచి కిందటిరోజు మల్లెపూలు పెట్టుకుని ప్రసాదానికి పరిగెత్తే సుభద్ర చిన్నపిల్లగా వూహించుకున్నాను. తర్వాత జానకిని ఆదరించిన యువతిలాగా చిత్రీకరించారు. ప్రధమ ప్రయత్నంకదా. అడ్డొచ్చే ఈ తెరలలోంచి అందమైన కధని చూద్దాము.
    psmlakshmi

    రిప్లయితొలగించండి
  5. కదంబమాలిక నేను ఎందుకు మిస్ అయ్యానో తేలేదు.ముందు లింకుల గురించి రాయండి ప్లీజ్..మీరూ బాగా రాసారు..మీది చదివాక అందరిది చదివితే బాగుండునని అనిపించింది
    లక్ష్మీ రాఘవ

    రిప్లయితొలగించండి
  6. లక్ష్మి గారు, ముందు భాగం ముందు vaaraanidi కదా.. ఈ భాగం లో జానకి పరిస్థితి ఎలా వుందో కనుక్కోవడానికి సరోజినీ వెళ్తే.. ఆ మాటలు విని సుభద్ర కూడా అక్కడికి చేరినట్లు అర్ధం చేసుకోండి చాలు..

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మి రాఘవ గారు, కదంబమాలిక ప్రారంబం జ్ఞానప్రసూనగారితో, తర్వాత వరుసగా మమత గారు, మాలగారు, దుర్గ గారు,సుభద్ర గారు, ఆరవ భాగం నేను వ్రాయడం జరిగింది.. లింక్స్ మెయిల్ ద్వారా తెలియజేయగలను. ఓ.కే నా.. మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం