ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరూ ??????

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరూ ??????బైక్ మీద మా హజ్బెండ్ వెనకాల ఆరామ్ గా కూర్చుని ప్రయాణిస్తున్న నేను సడన్ గా ఉలిక్కిపడ్డాను.. మా బండి ఉన్న స్థలానికి ఎక్కడో ఆమడ దూరం అన్నట్లు సిగ్నల్స్..ఎన్నెన్నో రకరకాల వెహికల్స్ మధ్యలో..అందులోనూ దీపావళి సందడి ఏమో త్వరత్వరగా ఇంటికి చేరాలని చుట్టుప్రక్కల ఏమి జరుగుతుందో గమనించాలన్న ధ్యాస కూడా లేనంతగా ఆత్రుతతో వున్నారు...సడన్ గా నా మనసులో ఒక భయం..ఏదో జరగబోతుంది అన్న భయం..నెమ్మదిగా అన్ని వెహికల్స్ కదలడం మొదలుపెట్టాయి...మా హజ్బెండ్ కూడా ఏమీ తీసిపోరు...ఏవేవో చిన్న చిన్న సందులు దొరికినా బండి లాగించేద్దామని చూస్తారు.వెనక నుండి హెచ్చరిస్తూనే వుంటాను..వింటేగా...నా డ్రైవింగ్ నే సంశయిస్తావా అన్నట్లు ఒక చూపు నా వైపు విసురుతారు..సిగ్నల్స్ దాటుతూ టర్న్ తీసుకొనేలోగా మా ముందు స్పీడ్ గా
టర్న్ తీసుకున్న బండి స్కిడ్ అయి, బండి ఈ మూలకు..మనుషులు ఎటో విసిరేస్తున్నట్లుఒకరు డివైడర్ ని గుద్దుకున్నట్లుగా,మరొకరు బండిక్రింద కాలు ఇరుక్కుపోయి... అయ్యో, అంటూ హృదయం ద్రవించిపోయింది..
బిత్తరపోయినట్లు ఐపోయింది..కొన్ని క్షణాల్లో అంతా ఐపోయింది..ఇప్పుడే కదా దీపావళి సందడితో పెద్దగా కేకలు వేసుకుంటూ, చేతుల్లో టపాకాయలతో ఇంటి దారి పట్టారు...ఎందుకండి హడావిడి బ్రతుకులు ? ఏం సాధించడానికి? సరదాలు మన ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.. న్యూ ఇయర్ అన్నా అంతే..ఆడండి, పాడండి,ఆనందించండి,,,, ప్రాణాలు పోగొట్టుకునేంతగా కాదు..ఎన్ని బంధాలు మీ చుట్టూ వున్నాయి, గుర్తించండి.
ఏదో తెలియని భారం గుండెల్లో..ఈసురోమని ఇంటికి చేరి,పిల్లల కోసం, మన సంప్రదాయం కోసం పూజ కానిచ్చి(మా పాప దీపాలు తప్ప టపాకాయలు వద్దు అని ముందే చెప్పడం వల్ల టపాకాయలు దాదాపు రెండు సంవత్సరాలుగా మా ఇంట్లో కాకరపువ్వొత్తులు ఒకటో,రెండో పాకెట్స్ తప్ప తీసుకురావడం లేదు)
దీపాలు పెట్టి మేడ పైన పచార్లు కొట్టి క్రిందకి దిగివచ్చిన తర్వాత మొదలయ్యిందండి...ఎదురింటి టపాకాయల సందడి.. కాల్చవద్దని నేను చెప్పడం లేదు.."అతి" వద్దని మాత్రమే ఇక్కడ నేను చెప్పదలచుకున్నది.. హార్ట్ పేషంట్ ఐన మా "అమ్మ",,నోరు విప్పి ఇది అని చెప్పుకోలేని మా "టీనూ"
పడిన ఇబ్బంది ఏం చెప్పను. .ఇది మా ఒక్కరి సమస్య కాదు..అందరికీ విదితమే..మరి ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు అని అంటే నా సమాధానం ఒక్కటే.....ఆనందించండి.....ప్రక్కవాళ్ళను భాదపెట్టి మాత్రం కాదు..
మా ఇంటి ఎదురుగా 20 అడుగుల దూరంలో ఒక స్కూల్.. ఉదయం 8.30 నుండి, మధ్యాహ్నం 3.30 వరకూ.. ఆటోలు వరసగా పెట్టి వుంచుతారు ఆటొ డ్రైవర్లు...వాళ్ళు జస్ట్ అలా నిలబడి చూస్తూ వుంటారు.
పిల్లలు ఎంతో బరువున్నబ్యాగులు మోసుకుంటూ పరుగులు పెట్టి ఆటోల దగ్గరికి వస్తారు. అప్పుడు మొదలవుతుందండి..బియ్యం బస్తాలో లేక సిమెంట్ బస్తాలో ఎత్తి లోపల పడేసినట్లు ఒకరొకరుగా కుక్కి,కుక్కి ఒక పదిహెను మంది పిల్లలను ఒకే ఆటోలో(వెనక డిక్కీ తో సహా) ఇరికిస్తే, అంచుల వెంట కూర్చున్న పిల్లలను చూస్తే "ఆటో రన్నింగ్ లో వీళ్ళు పడిపోతే" అన్న ఆలోచన మమ్మల్ని తినేస్తూ వుంటుంది.. ఆటో డ్రైవర్లను పిలిచి తిడదామన్నంత ఆవేదన..అప్పుడనిపిస్తుంటుంది..సంపాదించండి....
ఎదుటివారి పిల్లలను తమ పిల్లలుగానే చూసుకొనేంతటి జాగ్రత్తగా...
ఈ రోజు మధ్యాహ్నం మా వారి క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో బారసాల వుంటే వెళ్ళాము..అక్కడికి ఒకాయన వచ్చారు..
మీ శ్రీమతి రాలేదు.ఆరోగ్యం బాగుందా అని అడిగిన నా ప్రశ్నకు "ఏం వస్తుందండీ..అదిగో ఆ తెలంగాణా గొడవలు జరుగుతున్నాయి కద..డిక్లేర్ చేసేలోగా సిలబస్ కంప్లీట్ ఐపోవాలట..ఈరోజు నుండే ఇంకో రెండు గంటల వర్కింగ్ పెరిగినా సిలబస్ కంప్లీట్ ఎలా అవుతుందిరా భగవంతుడా అని ఏడుస్తుంది కూర్చుని"
అని ఏదొ చెప్తుంటే వింటున్నాను.. నా మనసులో పిల్లలు మెదులుతున్నారు..గబ గబ సిలబస్ ఏదో విధంగా కంప్లీట్ చెయ్యగలిగినా, పిల్లల మీద పడబోయే ఒత్తిడి మీదకు నా ధ్యాస మళ్ళింది..ఇప్పటికే తలకు మించిన భారంతో డబ్బుకి డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం పోగొట్టుకుంటూ "ఇష్టంతో చదవండోయ్" అనే స్లోగన్ ని "కష్టపడి చదవండోయ్" గా మార్చేసిన మన కార్పోరేట్ చదువుల సంగతీ మనకు తెలియనిది కాదు..
మార్కుల, రాంకుల పోటిలకు పిల్లల్ని బలిపశువులుగా మారుస్తున్న సంస్కృతి మనది. చదువులంటే విరక్తి కలిగిస్తున్న రాక్షసానందం మనది.. టెర్రరిజం,ఫాక్షనిజాల మధ్య నలిగిపోతున్న జీవితాలు మనవి. జీవితాన్నిఅనుభవించండి...దినదిన గండం,నూరేళ్ళ ఆయుష్సు మాదిరి కాదు.. మరి ఏం చేస్తే ఈ సమాజంలో ఆరోగ్యకరమైన మార్పు వస్తుంది అంటే ఈ ప్రశ్నకు నా దగ్గరే కాదు..అంత తేలికగా సమాధానం ఎవరి దగ్గరనుండీ రాదు..ఎవరికి వారు మనం గడుపుతున్న జీవితం మనల్ని వైపుకి నడిపిస్తుంది అని ప్రశ్నించుకొనేంతవరకూ...

కామెంట్‌లు

  1. మలక్ పేట రౌడీ గారు ధన్యవాదాలండి.. ఇండియన్ మినర్వా గారు ఈ హమ్ కి అర్ధం ఏమిటో....

    రిప్లయితొలగించండి
  2. మంచి టపాఅండి. నిజాలు చెప్పారు.

    రిప్లయితొలగించండి
  3. నిజమే. బాగా చెప్పారు.

    /ఎవరికి వారు మనం గడుపుతున్న జీవితం మనల్ని ఏ వైపుకి నడిపిస్తుంది అని ప్రశ్నించుకొనేంతవరకూ/
    ప్రశ్నించుకోవడమెందుకూ .. అందరూ చేరేది అక్కడికేగా, చడీ చప్పుడు లేని ప్రశాంతమైన మరుభూమికి.

    రిప్లయితొలగించండి
  4. snkr గారు, మనిషి ఇంకా ఇంకా ప్రయాణం (ఎంతదూరమైనా) చెయ్యదానికి సిద్దపడతాడు గాని, మరుభూమి వైపుకి మాత్రం కలలో కూడా రెడీ అవడండి...అదే మానవ నైజం కద..ధన్యవాదాలండి...

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం