ఓ స్త్రీ స్వగతం


మై మాలికిన్ హుః అప్నీ మర్జీ కా.......... ఒహ్ యెస్....నేను ఆడుతున్నాను, పాడతున్నాను (మనసులో సుమండీ)... ప్రపంచంలోని ఆనందాన్నంతా ప్రతి సెకనూ అందుకోవాలని ఆరాట పడుతున్నాను... నాకు నచ్చింది చేస్తున్నాను,,నచ్చినట్లు ఉంటున్నాను... నిధి చాల సుఖమూ...........

"మమ్మీ........... వీల్లేదు. నువ్వు మాకు నచ్చినట్లు ఉండాలి..మాకు నచ్చిందే చెయ్యాలి... ఐనా నేను ఏ అమే...రికా అమ్మా,నాన్నకో పుట్టి వుంటే ఎంత బాగుండేది...నా బాడ్ లక్...." ఓ కన్న కూతురి నిట్టూర్పు.

"ఏమేవ్...నాకు నచ్చినట్లు మాత్రమే నువ్వుండాలి...లేదంటే నువ్వు నాకు అక్కరలేదు..ఐనా నిన్ను కాదే, నిన్ను కన్నవాళ్ళను,నాక్కట్టబెట్టిన వాళ్ళను అనాలి... నా ఖర్మ..". ఓ భర్త అంతులేని మనోవేదన............

"అమ్మా,నా ఫ్రెండ్స్ తో కలసి సినిమాకు వెళ్ళివచ్చానని,,సిగరెట్లు తాగుతున్నానని నాన్నకు ఊదేసావా...నువ్వు అసలు నా కన్నతల్లివేనా........"..ఓ కన్నకొడుకు ఆక్రోశం....
"ఓరి భగవంతుడా! నేనేం పాపం జేసానయ్యా ? వీళ్ళ కోసమా నేను రెక్కలు,ముక్కలు చేసుకున్నది...ఇదేనా జీవితం ?"
ఒక్కసారి గతంలోనికి తొంగిచూసుకున్న ఆ తల్లికి అంతా శూన్యం కనబడింది... ఏమయింది నా గతం? ఎలా గడిచింది ఇంతకాలం ? మరి నా భవిష్యత్ ఏమిటి? ఇన్నాళ్ళు కలగని ఈ సందేహం ఈరోజు ఎందుకు కలుగుతుందీ ? ఏరి నా కన్న తల్లిదండ్రులు,,అత్తా మామలు, ఇన్నాళ్ళు నా సపర్యలు అందుకున్న బంధుమిత్ర సపరివారాలు ? ఇదేమిటి ఈ ఒంటరితనం ? ఏమిటి ఈ జీవితం ? ఒక్కసారిగా భయం ఆ తల్లి కళ్ళలో........... ఇక ముందు ?................... ఇదేనా తరతరాల చరిత ?

కామెంట్‌లు

  1. అది ఆ స్త్రీ స్వయంకృతాపరాధం ! జీవితాన్ని, చేజేతులారా ఇంకోరి చేతిలో పెట్టడం, అసలు మొగుడయినా, పిల్లలయినా, ఎవరయినా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారాన్నివ్వడం లేదా వాళ్ళా అధికారాన్ని సొంతంగా తీసేసుకుంటే, మొక్కలోనే తుంచేయడం లాంటి రెమిడీస్ చేపట్టకపోవడం స్వయంకృతమే !

    రిప్లయితొలగించండి
  2. సుజాత చెప్పింది నిజం. భర్త ఐనా, పిల్లలైనా తన జీవితాన్ని పూర్తిగా వాళ్లకు అంకితం చేయకూడదు. వాళ్లకు అవసరమైనంత మాత్రమే చేస్తూ తనగురించి తాను చూసుకోవాలి. ఇన్ని రోజులు చేయకుంటే ఇప్పటికైనా మారాలి. ఒకరినని లాభంలేదు.

    రిప్లయితొలగించండి
  3. నూటికి నూరుపాళ్ళు నిజం.. కాని ఆలస్యం ఐపొయింది.. నాకు తెలిసిన ఆమె ఆవేదన అది.. అందుకే బ్లాగు లో పెట్టాను..కొందరికి ముఖ్యంగా కేవలం కుటుంబం, బంధుమిత్ర సపరివారాలగురించి సమయం పూర్తిగా కేటాయించే నాలాంటివారికి కనువిప్పు కాగలదని..

    రిప్లయితొలగించండి
  4. నిజానికి ఈ పరిస్థితి ఆడవాళ్ళదే కాదు. మగవాళ్ళది కూడా ! బహుశా ఆడవాళ్ళకంటే ఎక్కువ మగవాళ్ళదేనేమో కూడా ! But women complain, men don't.

    ఈ పరిస్థితి మారదు. మారే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైనా తమని తాము ఒక కుటుంబంలోని సభ్యులుగా భావించుకుంటారు తప్ప "నేను ఆడదాన్ని, నేను మగవాణ్ణి" అని భావించుకుని ఆ ప్రకారం ప్రవర్తించరు. అదీగాక కుటుంబాన్ని విడిచి మనిషికి వ్యక్తిత్వమే లేదు, ముఖ్యంగా మన దేశంలో !

    రిప్లయితొలగించండి
  5. ఐతే నేను వేరు,కుటుంబం వేరు అని ఏనాడూ భావించలేదు.. ఒక ఉద్యోగస్తురాలిగా అటు స్కూల్ లో, ఇటు ఇంట్లొ ముఖ్యసభ్యురాలిగా నా భాధ్యతలు సగర్వంగా నిర్వర్తిస్తున్నాను.... వారి ఆనందం నా ఆనందం,, ఇది సహజమే.. ప్రతి ఒక్కరూ తమ తమ భాద్యతలు అలానే నిర్వర్తిస్తారు అనడంలో ఏ మాత్రం సందేహం అక్కరలేదు.

    రిప్లయితొలగించండి
  6. కుమార్ దత్తా గారు,, మీ అభిప్రాయం శోచనీయం.. ధన్యవాదాలు..ఇదే విషయంపై మరికొన్ని విషయాలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను... కాని ఒక కుటుంబంలో నేను మగవాణ్ణి,నువ్వు ఆడదానివి అని విభజించని పురుషులు వుండరని నేను అనుకోను.. కుటుంబాన్ని విడిచి మనిషికి వ్యక్తిత్వం లేదు అన్నమాట ఆమోదయోగ్యం...

    రిప్లయితొలగించండి
  7. తమని గురించి ఆలోచించుకోగల్గిన వారే ఇతరులను మంచిగా పట్టించుకోగలరు..అని ఎక్కడో విన్నాను.

    రిప్లయితొలగించండి
  8. సమస్యకు భయపడితే మరింత భయపెడుతుంది.పరిష్కారశోధన సమస్యను దూదిపింజను చేస్తుంది.సమాజాన్ని ఎదిరించి ఏమైనా చేయగలం అనే భావంకన్నా సమాజాన్ని మనకనుకూలంగా మలచుకోవడమే స్థితప్రజ్ఞత.మీరు రాసిన ఓ స్త్రీ స్వగతం చూసాక నా బ్లాగులో కవిత పోస్ట్ చేసాను.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం