అబ్బ మమ్మీ వుండు,,ఊపిరాడనివ్వవు,,ఒక్కరోజు హాలిడే దొరికితే చాలు...అది చెయ్యి,ఇది చెయ్యి అని ప్రాణం తీస్తావు...ఏంచెయ్యాలి? ప్రశాంతంగా ఒక్కరోజు ఉండనివ్వవు కద,,,,,,,,,,,,ఇదండీ ప్రతి ఆదివారం మా పక్కింటి సందడి...అక్కడే వాష్ బేషిన్ శుభ్రం చేస్తున్న నేను అవాక్కవుతుంటాను..ఇంతకీ ఆ తల్లి చేసిన పాపం ఏమిటంటారా....ఫ్రిజ్ లో నుండి పాలగిన్నె తీసుకురమ్మనో లేదా ఏదొ అందించమనో (రిక్వెస్టేనండి నాన్నా,బుజ్జి అని) పిల్లలు ఇంట్లొ వున్నారు,కొంచం సాయం చేస్తారు అని చిన్న ఆశ తో అడుగుతారండి ...
మేడమ్,,,ప్లీజ్ మేడం.......కొంచెం సేపు,ఓన్లీ ధర్టీ మినిట్స్,,ఈ పీరియడ్ ఆడుకుంటాం మేడం..మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ట్యూషన్ కి వెళ్ళిపోవాలి........మా అనిరుధ్ లాంటి పిల్లల వేడుకోలు..ట్యూషనా....ఉదయం నిద్రలేచి,కాలకృత్యాలు తీర్చుకుని,అమ్మ పెట్టింది తిని గబగబ తయారై స్కూల్ కి పరుగెత్తి(లేటైతే పి.టి. మాష్టారితో భాధ) అసెంబ్లీ ఐన దగ్గర్నుండీ సాయంత్రం స్టడీ అవర్స్ (పేరిట రుబ్బబడుతున్న చదువులా కాదు కాదు పసిపిల్లల మెదడులు.) అయ్యేంతవరకు ఆ బెంఛీ ల మీద కూర్చుని,కూర్చుని (బ్యాక్ పెయిన్స్,మెడ వంగిపోవడాలూ)బ్రేకు దొరికితే సింహాలైపోయే ఈ పసిపిల్లల జీవితాలు ఇంటికి వెళ్ళాగానే పూర్తిచెయాల్సిన హోంవర్క్ లు మెడలమీద మోసుకుంటూ మరల ట్యూషన్ అనబడే బందిఖానాకి బలి....అవాక్కే కదండీ మరి...నిజంగా ఏడుపు వస్తుందండీ వాళ్ళ ముద్దు ముద్దు మాటలతో వారి వేదన వింటూ వుంటే.........
ఏమండీ మనం చదువుకోలేదా ఆడుతూ,పాడుతూ.........................
(ఒక్కటి గమనించాను..... ఏ పిల్లలైతే తమ తాతయ్యలు,అమ్మమ్మ లేక నాయనమ్మల అనుబంధాలతో పెరుగుతున్నారో వారిలో ఒక మెచ్యురిటీ, వారి చదివే విధానం,వారి ప్రవర్తన,,వినయవిధేయతలు ఇతరత్రా ఎన్నో అందరినీ ఆకట్టుకొనే లక్షణాలు........... వారిలో ఒక రకమైన రిలాక్స్ డ్ మైండ్...బహశా వారికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో అందరు వుంటారన్న భధ్రతా భావం కావచ్చు.)
ఈ మధ్య ఒక స్లోగన్........అందరికీ నచ్చేదే......కష్టపడి కాదు ఇష్టపడి చదవండీ..... కరెక్ట్..కాని ఆ వాతావరణం ఏదండీ..........సమయం అంతా టీచర్లు ఇచ్చిన షెడ్యూల్ కి,తల్లి తండ్రులు తమకి ఇచ్చిన షెడ్యూల్ కి సమయం చాలడం లేదే.....................
(డాడీ ,అంతా మీ ఇష్ట ప్రకారమే జరగాలంటే ఎలా....ఇదిగో ఈ మూవీ చూడండి అని బొమ్మరిల్లు(సిద్ధార్ధ్,జెనీలియా) సినిమా చూపించేసాడండి మా అబ్బాయి..ఆ మరుసటిరోజు ఏదో సందర్భంలో నీ ఇష్టం అన్న మావారి మాటలకి "అంటే మాకూ ఇష్టాఇష్టాలు వుంటాయి అని మీకు సినిమా చూపించితే గాని అర్ధం కాలేదా" అని ఓ డైలాగ్.. )
పిల్లలకి కావాలి ఫ్రీడం...(వేరే మీనింగ్ తో కాదు.ఈ ఫ్రీడం వేరు)..పెద్దలకు కావాలి వారివారి కోరికల మేరకు పిల్లల భవిష్యత్తు..భాధ్యతలు,బందాలు....
తెల్లవారితే ఇన్ని రకాల ఒత్తిడుల మధ్య జీవితం... మరి మనకి ఒరిజినల్ గా కావాల్సింది ఏమిటి?
ఏది కొరవడితే మనం జీవించలేమో దాన్ని వెదికే ప్రయత్నం ఎక్కడ చేస్తున్నాము..వేడిగా వుంటే ఏ.సీ రూముల్లో వుంటాం..ఎంజాయ్ చెయ్యాలనుకుంటే ఏ సినిమాకో,బీచ్ రోడ్డుకో పరుగెడతాం....
మన జీవితాలకు ఒక అర్ధం పరమార్ధం చేకూర్చుకోవాలంటే మనకి కొరవడినది ఎక్కడో లేదు మనలోనే వుంది అని తెలుసు కునే ప్రయత్నం చేస్తే చాలు..మన జీవితాలని ఎన్ని ఒత్తిడుల నుండి ఐనా తప్పించి
బ్రతకగలము అని తెలుసుకోవడమే జీవిత సత్యం....అంతా మనలోనే వుంది అన్నారు ఆది శంకరాచార్యులు,,నిన్ను నీవు తెలుసుకో అన్నారు రమణ మహర్షులు....ఈ నాడు పిల్లలనుండి పెద్దల వరకు ఎవరిని చూసినా స్ట్రెస్సు,స్ట్రెయిను.....ఎన్నొ భాధలు.....కాని ఒకటి తెలుసుకోవడం లేదు మనం..
ఈ భూమి ఒక స్టేజ్,మనం అందరం ఈ భూమి మీద ఆ భగవంతుడు ఆడించే నాటకం లోని పాత్రధారులం..
మన పాత్ర ముగిసిందా, జెండా ఎత్తేసే వాళ్ళం.....ఆ మాత్రానికి ఇంత హంగూ,హంగామా,,పోటీలు,,ఒకరిని ఒకరు మోసం చేసుకోవడాలు,,కరప్షన్ ...ఇంత అవసరమా అండీ....అంటే అవసరమే అంటున్నారండీ....మరి బ్రతకాలి కదండీ.........ఎలా బ్రతకాలి? ఆనందంతో...........అది ఎక్కడో లేదు మనలోనే వుంది అన్న రహస్యం తెలుసుకుంటే చాలు. ..మనతో పాటు మన చుట్టుప్రక్కల వారిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వవచ్చు..కదండీ... ఆనందో బ్రహ్మ.......

కామెంట్‌లు

  1. మనిషి తనను తాను అంతర్ముఖంగా వీక్షించుకున్నపుడు అంతరాత్మ ప్రభోదాలు పారదర్శకంగా ప్రత్యక్షమవుతాయి.మనం చేరవలసిన గమ్యాన్ని సూచించే మైలురాళ్లు గమ్యాన్ని చేరవు.మనమే ఆ మైలురాళ్ల ఆనవాళ్లతో మన ప్రయాణాన్ని కొలుచుకుంటూ వెళ్లి గమ్యాన్ని చేరుకుంటాం.మనిషి నడవడిని అనుక్షణం నియంత్రించే మైలురాయి అంతరాత్మ.అంతరాత్మ ప్రభోదాన్ని పాటించినవారెపుడూ ఆనందాన్నేకాదు,ఆత్మీయులను పొందుతారు.రుక్మణిదేవిగారు, మీ భావాలు ఆలోచనాత్మకమై అలరించాయి.

    రిప్లయితొలగించండి
  2. మన అంతరాత్మ మనకు తెలియని ఎన్నో విషయాలు భోదిస్తుంది కదండీ..దాన్ని వినడం నేర్చుకోవాలి..చూడగలగాలి..అప్పుడు మాత్రమే మనిషి తను ఏమిటి అని తెలుసుకుని మసలుకుంటాడు.ధాంక్ యూ ఉమాదేవి గారూ.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం