శూన్యస్తితికి చేరుకున్న కభీర్ (దీని గురించి తర్వాత తెలుసుకుందాము) ఒక కవిత్వాన్ని వ్రాసారట "మంచుబిందువు రాలింది మహా సంద్రంలోకి" . హేరాల్ హేరాల్ హే సాఖీ,రహయా కభీర్ హెరాయీ. . . .ఓ మిత్రమా, ఓ ప్రియా! వెతికేందుకు నే బయల్దేరా..నన్నే తెలుసుకోవాలని.. కాని ఏం జరిగిందో వింత! నేనెవరో తెలిసేది అటూ ఉంచి,సముద్రంలో మంచుబిందువులా నేనే మాయమై పోయా! ". "బూందా సమానీ సముందామే సోకత్ హెరీ జయీ ! " ...హిమ బిందువు మాయమయింది మహా సంద్రంలో, కనిపిస్తుందా ఆ మహా సాగరంలో? ఆదే కభీర్ కి ఆత్మానుభవమ్ అట. . . .మరిన్ని వివరాలు మరొసారి.
గురువు అవసరం ................
గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన ఇలా వివరించాడు. ఆత్మలోని జ్యోతి యమరుగా లింగంబు తెలిసి చూడకున్న తేటపడదు అదియు గురువు లేక అబ్బునా తెలియంగా విశ్వదాభిరామ వినుర వేమా ! తాత్పర్యం : హృదయంలో తేజో రూపుడుగా వున్న పరమేశ్వరుని దర్శించడానికి సద్గురువు దగ్గర అభ్యాసం లేకుండగా సాధ్యపడదు. ఇంకా.........ఇలా చెప్పారు......... ఉడుగక క్రతువుల తపముల నడవుల తీర్ధముల తిరిగినంతనే ధరలో నోడయని కనుగొనజాలదు కడు ధీరత గురుడు తెలుపగలడిది వేమా ! తాత్పర్యం : ఎ మాత్రం విడిచి పెట్టకుండా యజ్ణ యాగాదులు , తపస్సు చేసి, అడవులలో తిరిగి తీర్ధయాత్రలకు వెళ్ళినప్పటికీ స్వామిని కనుగొన లేరు. ఆ పరమాత్మను చేరుకొనే విధానాన్ని గురువు మాత్రమే చెప్పగలడు. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో అజునికైన వాని యబ్బకైన తాళపు చెవి లేక తలుపెట్ట్లూడునో? విశ్వదాభిరామ వినుర వేమా ! తాత్పర్యం : తాళం చెవులు లేకుండా తలుపు ఏవిధంగా రాదో, అదే విధంగా గురువు ఉపదేశం లేకుండా, ఆత్మా జ్ఞానాన్ని బ్రహ్మ గాని ఆతని అబ్బ (తండ్రి ) గాని తెలుసుకోలేరు. గురువు లేక విద్య గురుతుగా దొరకదు నృపతి లేక భూమి ని...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి