నిస్వార్ధం తో,నిష్కల్మషం తో అందరి క్షేమం కోరేవారు పూర్ణ ఆయుష్కులు కావాలి. ....
పోస్ట్‌లు
మానవ గీత
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
జాతస్య హి ధ్రువో మృత్యు; : ధృవం జన్మ మృతస్య చ1 తస్మా ద పరిహార్యే ర్ధే న త్వాం శోచితుమర్హసి౧౧ పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు . కనుక అపరిహార్యములైన ఈ విషయము ల యందు శోకించదగదు .. చాలా బాగా చెప్పాడు కదండీ శ్రీకృష్ణ పరమాత్ముడు ...ఇంకో విషయం కూడా చెప్పాడండి....... ప్రాణులు అన్నియు పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు. {అవ్యక్తములు }.. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే ......ఈ జనన మరణముల మధ్య కాలము నందు మాత్రమె అవి ప్రకతితములు { ఇంద్రియ గోచరములు }. అగుచుండును . ఇట్టి స్థితిలో వాటికి పరితపించుట నిష్ప్రయోజనము .......... ఈ విషయాలు తెలిసి నప్పటికీ మనం దుఖించక మానము .. అందుకే మనం మనుషులు గానే మిగిలిపోతాము .. ఏదీ శాశ్వతం కాదు .. ఇది అందరికి తెలిసిన విషయమే .. ఒక కుర్చీ కాలు విరిగితే మేకులు కొట్టో లేక ఫెవికాల్ అంటించో దానిని బాగు చేసినట్లే , మన శరీరం లోని ఎ భాగాని కైనా దెబ్బ తగిలితే ఆపరేషన్ చేసి కుట్ల ద్వారానో లేక స్క్రూల ద్వారానో దాని బాగు చేస్తాము .. మరి కర్రకి మన శరీరానికి తేడా ఏమిటండి ? ...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
చాలా రోజుల తర్వాత మరల బ్లాగు లోకం లోనికి ప్రవేశించాను..ఈ మధ్య కాలం లో ఎన్నెన్నో సంఘటనలు ... కష్టాలు, సుఖాలు, తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే పనులు ...వీటన్నింటి మధ్య సాగిపోతుంది మనిషి జీవితం . మనం కష్ట పడుతున్నా, సుఖపడుతున్నా.. మెలకువలో వున్నా , నిద్రించినా , ఏదీ ఆగదు . అదే మరి కాల మహత్యం.. మనం చేసే పని కరెక్టా కాదా అని తెలుసుకునే లోపలే ఎన్నో జరిగి పోతుంటాయి .ఆగదు ఎ నిముషం నీ కోసమూ, ఆగితే సాగదు ఈ లోకము.. ముందుకు సాగదు ఈ లోకము అన్న పాత గుర్తు వస్తుంటుంది ప్రతి క్షణం....ఎన్ని పుస్తకాలు chadivinaa, ఎప్పుడు ఎం చెయ్యాలో అని ఎన్ని ప్లానులు వేసుకున్నా ఒక్కో సమయం మన చేజారిపోతుంటుంది .. మరి వెనక్కి తిరిగి రాదు ...ఒక్కోసారి మనసు పూర్తి వైరాగ్యం తో నిండి పోతుంది. మరుక్షణం లోనే ఆశావహ పరిణామాలు . .ఏమిటి ఈ జీవితం అని లెక్కలేనన్ని సార్లు అనుకుంటూ వుంటాము . కాని ఇంకా ఇంకా బ్రతకాలని , ఏదో కావాలని కోరుకుంటూ వుంటాము . .మన మనుగడను ప్రశ్నించుకుంటూ వుంటాము .. బ్రతకక మానము ...వట్టి చేతులతో వస్తాము, వట్టి చేతులతోనే వెళ్తాము అన్నది అందరికి తెలిసిందే . అయినా సంపాదనకి పరుగులు తీయక మ...
గురువు అవసరం ................
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన ఇలా వివరించాడు. ఆత్మలోని జ్యోతి యమరుగా లింగంబు తెలిసి చూడకున్న తేటపడదు అదియు గురువు లేక అబ్బునా తెలియంగా విశ్వదాభిరామ వినుర వేమా ! తాత్పర్యం : హృదయంలో తేజో రూపుడుగా వున్న పరమేశ్వరుని దర్శించడానికి సద్గురువు దగ్గర అభ్యాసం లేకుండగా సాధ్యపడదు. ఇంకా.........ఇలా చెప్పారు......... ఉడుగక క్రతువుల తపముల నడవుల తీర్ధముల తిరిగినంతనే ధరలో నోడయని కనుగొనజాలదు కడు ధీరత గురుడు తెలుపగలడిది వేమా ! తాత్పర్యం : ఎ మాత్రం విడిచి పెట్టకుండా యజ్ణ యాగాదులు , తపస్సు చేసి, అడవులలో తిరిగి తీర్ధయాత్రలకు వెళ్ళినప్పటికీ స్వామిని కనుగొన లేరు. ఆ పరమాత్మను చేరుకొనే విధానాన్ని గురువు మాత్రమే చెప్పగలడు. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో అజునికైన వాని యబ్బకైన తాళపు చెవి లేక తలుపెట్ట్లూడునో? విశ్వదాభిరామ వినుర వేమా ! తాత్పర్యం : తాళం చెవులు లేకుండా తలుపు ఏవిధంగా రాదో, అదే విధంగా గురువు ఉపదేశం లేకుండా, ఆత్మా జ్ఞానాన్ని బ్రహ్మ గాని ఆతని అబ్బ (తండ్రి ) గాని తెలుసుకోలేరు. గురువు లేక విద్య గురుతుగా దొరకదు నృపతి లేక భూమి ని...
Hari OM Hari OM Sai OM Sai OM - Shirdi Sai Bhajan
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
గురు పౌర్ణమి శుభాకాంక్షలు ...................
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
అందరికి నమస్కారం.... మనిషి పుట్టుకతో అన్నీ నేర్చుకుని రాడు. కొందరికి స్వతహాగా నేర్చుకునే శక్తి వుంటే, మరి కొందరికి ఎదుటి వారిని చూసి నేర్చుకునే శక్తి వుంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి, రాత్రి నిద్రించే వరకూ ప్రక్క వారి సహాయం అవసరమౌతుంది. అది మాట సహాయం కావచ్చు లేదా పని సహాయం.... ఎందుకంటే మనిషి ఒంటరి జీవితం గడపలేదు. అలానే ఎవరి సహాయం లేకుండా అస్సలు బ్రతకలేడు. పుట్టిన మరుక్షణం నుండి మాతా పితరుల ఆధ్వర్యంలో, యవ్వనంలో జీవిత భాగస్వామి సహచర్యంలో , వృద్ధాప్యంలో తన బిడ్డల అండలో కాలం గడిపేస్తాడు. ఓనమాలు అమ్మ ఒడిలో నేర్చుకుంటే, అ ఆ లు బడిలో నేర్చుకుంటాడు . ఇలా ఎవరో ఒకరి సహకారంతో జీవన పయనం సాగిస్తాడు . కాని అదే జీవితాన్ని ఎటువంటి మార్గంలో, ఎలా నడిపించాలి అన్నమీమాంస ను ఒక్క గురువు మాత్రమే తీర్చగలడు. మనలో ఎన్నో సందేహాలు. వాటిలో ముఖ్యమైనది గురువుని గురించిన సందేహం. అందుకే ఈ గురుపౌర్ణమి సందర్భంగా నాకు మరియు మరికొందరి సందేహ నివృత్తి కోసం చిన్ని ప్రయత్నం మా అత్యంత ఆప్తురాలు భారతి గారి సహకారం...
భారతీయం: Tirupati Ghat Road
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
Tirupati Ghat Road
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
Tirupati Ghat Road , a photo by Arun Sundar on Flickr. ఏడుకొండల వాడా..వెంకట రమణా.... తిరుమల తిరుపతి... అత్యధ్బుతమైన ఆధ్యాత్మిక కేంద్రం... గొప్ప పేరు పొందిన యాత్రాస్థలం... వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మేము బస్సు లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా క్రిందకి చూసి అమ్మో అనుకుని ముందు బాట వైపు దృష్టి సారించాను.. సామాన్యంగా ప్రతి యాత్రికుడు చేసే పనే అదే.. ఐతే నాలో ఏవో భావాలు... మన వెనుకగా వున్న లోయ ప్రదేశం మన గతం ఐతే, ముందున్న బాట మన గమ్యాన్ని సూచిస్తుంది అన్న ఆలోచన.. మనం కూర్చున్న బస్సు మన వర్తమానం... గతం మనకు గతుకుల లోయను చూపిస్తుంది.. భవిష్యత్తు మనలో ఆశ ను రేకెత్తిస్తుంది.. ముందు ముందు అంతా మంచే జరుగుతుంది అన్న ఆశ... అందుకే గతం గతః అన్న సూక్తిని గుర్తు పెట్టుకుని, మనం ఎ స్థితిలో వున్నామో గమనిస్తూ,చిన్న చిన్న తుఫానుల తాకిడికి తట్టుకుని నిలబడే వృక్షాల్లా ముందుకు సాగాలి.. అయినా మనం ఆకాశాన ఎగిరే పక్షుల కన్నా బలమైన వాళ్ళం.......కదా... వాటిని మించిన కష్టాలా మనవి ????????
ఏడుకొండల వాడా..వెంకట రమణా
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-