పోస్ట్‌లు

భారతీయం: ఈ కాలం మగపిల్లలు

భారతీయం: ఈ కాలం మగపిల్లలు : "మా చెల్లెలు కాంపిటీటివ్ ఎక్జామ్ వ్రాయడానికి ఎక్జామ్ సెంటర్ కి తీసుకు వెళ్ళాము.. ఎక్జామ్ ఐపోయిన తర్వాత పిల్లలందరూ బయటకు వస్తున్నా..." పోస్ట్‌ను ప్రచురించు

ఈ కాలం మగపిల్లలు

మా  చెల్లెలు కాంపిటీటివ్ ఎక్జామ్ వ్రాయడానికి ఎక్జామ్ సెంటర్ కి తీసుకు వెళ్ళాము.. ఎక్జామ్ ఐపోయిన తర్వాత పిల్లలందరూ బయటకు  వస్తున్నారు.. మా ముందునుండి ఒక మగపిల్లల గుంపు వెళుతుంది.. వారి సంభాషణ విని ఆహా అని ఎంతో ఆశ్చర్యపోయాము.. మరచిపోలేక పోతున్నాము ఆ మాటలు..వారిలో వారు ఇలా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.. "ఏరా, ఎక్జామ్ ఎలా వ్రాశావు?"  "ఏదో లేరా. అసలు ప్రిపేర్ ఐతే కద..మనకొస్తుందని ఏం గారంటి లేదు. ఐనా మనం ఇంత కష్టపడడం అవసరం అంటావా? ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే పోలా.. ఇంట్లో ఉండి హాయిగా మనకి నచ్చినట్లు వండుకుని తినవచ్చు..." ఔరా..ఔరౌరా.....కద.............

ఈ కాలం పిల్లలు కేవలం ఒక భర్తగా లేక ఒక భార్యగా వుండాలని అనుకోవడం లేదు. మరి ఏం కోరుకుంటున్నారు??

మనకి మనం సంప్రదాయాలు విదించుకున్నాము . . . మన సంస్కృతి దేశ విదేశాలకి తెలియజేశాము..ఇతరులు మన దేశవిలువలను అనుసరిస్తున్న సమయానికి మనం వింతపోకడలు పోతున్నాము. ఇంతవరకూ అందరూ ఆమోదించే విషయమే... ఐతే ఇంకా ఏదో తెలియనిది తెలియజేస్తున్నారు మన పిల్లలు..   ఇదివరకు టెక్నాలజీ అభివృద్ది లోనికి రాని సమయంలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్న సమయంలొ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే పదిమంది కూర్చుని తినే స్థితిలో సహజంగానే పెద్దవారు అంటే వయసు పైబడిన వారు తమ శక్తి సామర్ధ్యాలు తగ్గిన తరువాత పిల్లల సేవలపై ఆధార పడి ఉండేవారన్నది అందరికీ విధితమే...ఉద్యోగరీత్యా కానివ్వండి లేదా అన్నదమ్ముల కుటుంబాలలో ఒకరికొకరికి సరిపడక కానివ్వండి లేదా పిల్లల భవిష్యత్ దృష్ట్యా, ఒక ఊరినుండి ఇంకో ఊరికి బదిలీ వెళ్ళే సమయంలో పెద్దలు తాము పుట్టి పెరిగిన ఊరిని విడిచి వెళ్ళలేక ఆక్కడే ఉండిపోవడం వల్ల(ఈనాడు ముందు జాగ్రత్తగా పిల్లల పెళ్ళిళ్ళు చేసిన వెంటనే వారిని విడిగా ఉంచి వారికంటూ ఒక కుటుంబం ఏర్పాటు చేస్తున్నారు పెద్దలు) చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడడం జరిగింది...ఒక కుటుంబం అంటే అమ్మ,నాన్న, ఒకరు లేక ఇద్దరు పిల్లలు..అమ్మనా...

నేనెలా వుండాలనుకుంటానంటే..............

పడిలేచే కెరటం లా చల్లగా,మెల్లగా వీచే చిరుగాలిలా ప్రకృతి సందడిలా వాన చినుకులా ముత్యపు బిందువులా విద్యుత్తరంగంలా పదహారేళ్ళ ప్రాయంలా సుమధుర గానంలా గలగల పారే సెలయేరులా గాలికి కదిలే ఆకులా చిరుమువ్వల సందడిలా పసిపాప నవ్వులా అమ్మ ఒడిలా నాన్న లాలనలా... నేను "నేను" లా....................................... ఒక "మనీషి" లా................. చాలా సార్లు మా స్నేహితురాలు "నేనెలా వుండాలి?", "ఎలా ఉంటే బాగుంటుందీ" అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటే "మీరు మీరు లా ఉంటే చాలు" అని సమాధానం ఇచ్చాను.. ఆ తర్వాత నా మదిలో కదిలినవి ఇదిగో. ఇలా వ్రాయడం జరిగింది....   

మనిషి తనలోని భావ పరంపరలను, ఒత్తిళ్ళను తగ్గించుకోగల ఏకైక మార్గం ఏదైనా ఒక పదార్ధం మీద ధ్యాస పెట్టడం.... ఆ పదార్ధం మనలోని శ్వాస కావచ్చు లేదా భగవంతుడు కావచ్చు..సృష్టి అనేక పదార్ధాలతో కూడి ఉన్నది.. మానవ దేహం కూడా అనేక పదార్ధాలతో కూడి ఉన్నది...ఐతే భగవంతుని కూడా పదార్ధంతో పోల్చవచ్చా ??

dare2question (d2q): తన కెరీర్ ను ఫణంగా పెట్టి పేదలకు తిండిపెడుతున్న నారాయణన్ కృష్ణన్ (Catch: He brings hot meals to India's homeless)

dare2question (d2q): తన కెరీర్ ను ఫణంగా పెట్టి పేదలకు తిండిపెడుతున్న నారాయణన్ కృష్ణన్ (Catch: He brings hot meals to India's homeless)

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరూ ??????

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరూ ??????బైక్ మీద మా హజ్బెండ్ వెనకాల ఆరామ్ గా కూర్చుని ప్రయాణిస్తున్న నేను సడన్ గా ఉలిక్కిపడ్డాను.. మా బండి ఉన్న స్థలానికి ఎక్కడో ఆమడ దూరం అన్నట్లు సిగ్నల్స్..ఎన్నెన్నో రకరకాల వెహికల్స్ మధ్యలో..అందులోనూ దీపావళి సందడి ఏమో త్వరత్వరగా ఇంటికి చేరాలని చుట్టుప్రక్కల ఏమి జరుగుతుందో గమనించాలన్న ధ్యాస కూడా లేనంతగా ఆత్రుతతో వున్నారు...సడన్ గా నా మనసులో ఒక భయం..ఏదో జరగబోతుంది అన్న భయం..నెమ్మదిగా అన్ని వెహికల్స్ కదలడం మొదలుపెట్టాయి...మా హజ్బెండ్ కూడా ఏమీ తీసిపోరు...ఏవేవో చిన్న చిన్న సందులు దొరికినా బండి లాగించేద్దామని చూస్తారు.వెనక నుండి హెచ్చరిస్తూనే వుంటాను..వింటేగా...నా డ్రైవింగ్ నే సంశయిస్తావా అన్నట్లు ఒక చూపు నా వైపు విసురుతారు..సిగ్నల్స్ దాటుతూ టర్న్ తీసుకొనేలోగా మా ముందు స్పీడ్ గా టర్న్ తీసుకున్న బండి స్కిడ్ అయి, బండి ఈ మూలకు..మనుషులు ఎటో విసిరేస్తున్నట్లుఒకరు డివైడర్ ని గుద్దుకున్నట్లుగా,మరొకరు బండిక్రింద కాలు ఇరుక్కుపోయి... అయ్యో, అంటూ హృదయం ద్రవించిపోయింది.. బిత్తరపోయినట్లు ఐపోయింది..కొన్ని క్షణాల్లో అంతా ఐపోయింది..ఇప్పుడే కదా దీపావళి సందడితో పెద్దగ...
ఒక్కోసారి పరిస్థితులు మన చేయిదాటిపోతున్నాయి అని అన్పించినప్పుడు, ఏదో అసహాయత మనలో కనబడుతుంటుంది...అలాంటప్పుడు మనలో ఎన్నో ప్రశ్నలు ఇది ఇలా వుంటేనే బాగుంటుందా, ఇలా చేస్తేనే బాగుంటుందా అని.. అవి పిచ్చి ప్రశ్నలు అని నేను అనుకోను.. అలాంటివాటిలో ఇదొకటి.. .మా మామయ్యా గారి అమ్మాయిని రీసెంట్ gaa తన retirement డబ్బు ఆంతా పెట్టి కట్నం,అత్తా, ఆడపడుచు laanchanaalalo చాలా గ్రాండ్ గా చేసారు.....ఎందుకంటే అబ్బాయి తరపువారు చాలా గొప్ప background మరి...పేరు గొప్ప, వూరు....ఈ సామెతలు ఎలా వస్తాయో ఇప్పుడు అర్ధం అవుతుంది..........అమ్మాయిని అబ్బాయి పట్టించుకోడు.తిన్నావా, లేవా అడగడు....తెల్లవారేవరకూ ఇంటికి చేరడు..కొన్ని రోజులు ఇంటిమోహమే చూడడు..ఇంట్లో అత్తా మామల సతాయింపు...కూరలో ఉప్పెక్కువైందని.. అదని,ఇదని వంకలు..భార్యని మాత్రం తల్లిని చేసాడు..అత్తగారింటికి vaste A.C. లో తప్ప padukodani అప్పటికప్పుడు arrange చేసారు..అదేమని అడిగితే, "పెళ్లి ఐతే బాగు పడతాడని పెళ్లి చేసాము" అని అత్తవారింటి సమాదానం...అమ్మాయి పుట్టింట్లో,, తల్లిదండ్రులు కన్నీటితో, అబ్బాయి రోడ్లు పట్టుకుని వుద్యోగం సద్యోగం లే...

జీవో ఔర్ జీనేదో

ఒక స్త్రీ కి కావలసినదేమిటి ? తను ఏది కోరుకుంటే అదే చేయగల స్వేచ్చ ఇస్తే సరిపొతుందా ? దానికే స్వేచ్చ అని పేరు పెడితే తెల్లవారి లేచిన దగ్గరనుండి రాత్రి పడుకొనేవరకూ చీరలు,నగలు అని కలలు కంటూ, వాటికోసం భర్తను సాధించే వారిని ఎంతోమందిని చూస్తున్నాము.. అందరూ అలా వుండరు, లేకుండా కూడా లేరు..ఇది ఒప్పుకోవాల్సిన విషయం.. షాపింగ్ మాల్స్ ఎన్ని చూడడం లేదు...కాని శారీరకంగా గానీ,మానసికంగా గాని మగవారికి ఏమాత్రం తీసిపోని ఒక స్త్రీ బాంధవ్యాల దగ్గరకొచ్చేసరికి తనను తాను మలచుకుంటూనే తన వారిని నడిపించే విషయానికొచ్చేసరికి బలహీనురాలిగా ఎందుకు తయారవుతుంది..? ఆమె ఏం కోరుకుంటుంది ? నా బార్య నా మాట జవదాటరాదు అనుకునే భర్తను కోరుకుంటుందా ? లేదండి......అలా ఏ బార్యా కోరుకోదు...కాని భర్త ప్రేమతో గీస్తే, లక్ష్మణరేఖను దాటాలని ఏ స్త్రీ కూడా కోరుకోదు ..ఒక సెక్యూరిటి కోరుకుంటుంది..నేనున్నాను అనే ఒక అండ కోరుకుంటుంది..పిల్లలకు అన్నీ సమకూరుస్తూనే వారి ప్రేమ ఆశిస్తుంది.. వీటన్నింటితో పాటు "నేను" అన్న ఒక గుర్తింపు కోరుకుంటుంది..(అందుకే తన వంట కొత్త కాకపోయినా ప్రతిరోజు ఇంట్లోవారి మెప్పుకోలు పొందాలని ఆశిస్తుంది) వంటగద...
అమెరికాలో చదువు ఎందుకురా? డాలర్లే,డాలర్లు.........ఇదండి సమధానం... నిన్న మావారు ఇంటికి వచ్చి వినిపించిన ఒక కధనం నా మనసులో ఈ చెత్తకధకి నాంది.. మాకు తెలిసినవారి అబ్బాయిని అమెరికా పంపడం కోసం ఇంకా కనీసం నివాసయోగ్యంగా కూడా కట్టని ఓ ఇల్లు తాకట్టు పెట్టి. అక్షరాలా ఇరవై ఐదు లక్షలు (తల్లి తపన తన కొడుకు అమెరికా వెళ్ళాలని) పెట్టి ఎలా ఐతేనేం అక్కడ ఉద్యోగ రీత్యా ఉంటున్న తమ కూతురు,అల్లుడుల సహకారంతో ఒక యూనివర్శిటీ లో ఎమ్.ఎస్ కోర్స్ లో జాయిన్ చేశారు...యూనివర్శిటీ కాంటీన్ లో ఐతే తక్కువ డాలర్లు ఇస్తారని,బయట పని (పార్ట్ టైమ్) ఒప్పుకుని (వారానికి రెండువందల డాలర్లు) జాయిన్ ఐన తర్వాత అమ్మా,నాన్నకి ఫొన్ చేసాడట.. అమ్మా,నీకేం కావాలి అన్నాడట..ఇంతకీ ఏం పనిరా బాబు అని అడిగిన అమ్మకు "కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న చెత్తను సంచులలో నింపి భుజాలు పడిపోయేలా మోసుకుని వాళ్ళు చూపిన స్థలంలో పొయ్యాలట" అని కొంచెం వివరంగా వివరిస్తే........ఏం చెప్పమంటారు ఆ తల్లి ఆవేదన? ఇంట్లో తను తిన్న చాక్లేట్ రేపర్ ని "ఒరెయ్ బాబు డస్ట్ బిన్ లో పడెయ్యరా", అని నెత్తి,నోరు కొట్టుకున్నా తలెగరేసి మరీ విదిలించుకు పోయే నా కొడుకు ఈరో...