
ఇక సుఫల స్నేహం గురించి .........శ్రీ కృష్ణుడు మరియు కుచేలుడు మధ్య గల స్నేహ సంబంధం అందరికీ తెలిసినదే... అతి బీద బ్రాహ్మణుడు కుచేలుడు తప్పని సరియై మిత్రుని వద్దకు వెళ్ళ వలసి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళలేక అటుకులను తీసుకుని బయలు దేరాడు.. తన చిన్ననాటి స్నేహితుని తన దగ్గరకు తీసుకుని ఎంతో ప్రేమతో ఆదరించి కుచేలుడు సమర్పించిన అటుకులను ప్రీతిగా ఆరగిస్తూ , నోరు తెరచి సహాయం అడగ కుండానే విషయాన్ని గ్రహించిన ఆ పరంధాముడు కుచేలుని ఇంటిని సర్వైశ్వర్యాలతో నింపిన విషయం మనకు తెలిసినదే.. అడగనిదే అమ్మైనా పెట్టదు అన్న సామెతకు ఇక్కడ చోటు లేదు. అడగకుండానే తన మిత్రుని పరిస్థితి గ్రహించి అన్ని వరాలను ఇచ్చిన ఆ పరమాత్మది సఫల స్నేహమే కదా . ఇక నర నారాయణు లైన కృష్ణార్జునుల స్నేహం సుఫలమా అన్నది పరిశీలిస్తే , అర్జునునికి ద్రౌపది , వులూచి ,చిత్రాంగద అన్న భార్యలు వున్నప్పటికీ ఆతని మీద నమ్మకంతో తన చెల్లెలు సుభద్ర ను ఇచ్చి పెళ్లి చేసాడు .. యుద్ద భూమిలో రక్త సంబంధ...