మార్కండేయ మహా ముని ద్వారా తన సందేహాలను తీర్చుకుంటున్న ధర్మరాజు పతివ్రతల ప్రసంగం తీసుకు వచ్చి ఇలా అడుగుతాడు.. " మహా మునీ, ఇంద్రియాలు సహజంగా గెలవరానివి. అలాంటి ఇంద్రియాలు జయించి, మనస్సు స్వాధీనంలో వుంచుకుని, అహంకారం విడిచి పెట్టి భర్త శూశ్రూష చేసే స్త్రీ సర్వ లోకాలలోనూ వుత్తమురాలని భావిస్తాను. పతివ్రతల చరిత్ర దుర్లబ మైనది, ధర్మ సూక్ష్మాలు తెల్పేది కదా. అందు చేత పతివ్రతల ప్రభావం వినిపించండి ” అని అడుగుతాడు.. మరియు, “ కుమాళ్ళ కోసం తల్లి, తండ్రి వుభయులూ ఆయాసపడతారు. ఐతే, వారి ఇద్దరిలోనూ ఎవరి ఆయాసం అధికం? తల్లిదండ్రుల విషయంలో కుమారుడు ఎలాంటివాడు కావాలి ? ఒకడు హీన యోనిలో పుడతాడు. వాడు పరమ ధార్మికులు పొందే లోకాలు పొందాలంటే ఎలా నడుచుకోవాలి ? దయచేసి సెలవివ్వండి ” అని అడుగుతాడు.. అప్పుడు మార్కండేయుడు ఇలా చెప్పాడు. . ” తొమ్మిది మాసాలు భద్రంగా గర్భం మోస్తుంది తల్లి. ఎన్నో కష్టాలు సహిస్తుంది. తుదకి ప్రాణం ఆటా, ఇటా అన్న స్థితికి వచ్చి కుమారున్ని కంటుంది. ఐతే, కొడుకు కోసం తపస్సులు, దానాలు చేస్...