జీవో ఔర్ జీనేదో
ఒక స్త్రీ కి కావలసినదేమిటి ? తను ఏది కోరుకుంటే అదే చేయగల స్వేచ్చ ఇస్తే సరిపొతుందా ? దానికే స్వేచ్చ అని పేరు పెడితే తెల్లవారి లేచిన దగ్గరనుండి రాత్రి పడుకొనేవరకూ చీరలు,నగలు అని కలలు కంటూ, వాటికోసం భర్తను సాధించే వారిని ఎంతోమందిని చూస్తున్నాము.. అందరూ అలా వుండరు, లేకుండా కూడా లేరు..ఇది ఒప్పుకోవాల్సిన విషయం.. షాపింగ్ మాల్స్ ఎన్ని చూడడం లేదు...కాని శారీరకంగా గానీ,మానసికంగా గాని మగవారికి ఏమాత్రం తీసిపోని ఒక స్త్రీ బాంధవ్యాల దగ్గరకొచ్చేసరికి తనను తాను మలచుకుంటూనే తన వారిని నడిపించే విషయానికొచ్చేసరికి బలహీనురాలిగా ఎందుకు తయారవుతుంది..? ఆమె ఏం కోరుకుంటుంది ? నా బార్య నా మాట జవదాటరాదు అనుకునే భర్తను కోరుకుంటుందా ? లేదండి......అలా ఏ బార్యా కోరుకోదు...కాని భర్త ప్రేమతో గీస్తే, లక్ష్మణరేఖను దాటాలని ఏ స్త్రీ కూడా కోరుకోదు ..ఒక సెక్యూరిటి కోరుకుంటుంది..నేనున్నాను అనే ఒక అండ కోరుకుంటుంది..పిల్లలకు అన్నీ సమకూరుస్తూనే వారి ప్రేమ ఆశిస్తుంది.. వీటన్నింటితో పాటు "నేను" అన్న ఒక గుర్తింపు కోరుకుంటుంది..(అందుకే తన వంట కొత్త కాకపోయినా ప్రతిరోజు ఇంట్లోవారి మెప్పుకోలు పొందాలని ఆశిస్తుంది) వంటగద...