గీతా భవనము
గీతా మే చోత్తమం గృహమ్ . ......అని భగవధ్వాక్యము. అనగా "నేను గీతనాశ్రయించుకుని యున్నాను. గీత నా యొక్క నివాసగృహము" అని భావము. ఈ ప్రకారముగ గీతామాహాత్యమున గీతా గృహమును గూర్చి భగవానుడు తెలిపియున్నాడు.. ఆ గృహము యొక్క స్వరూప,స్వభావముల వివరము ఈ క్రింద తెలుపబడుచున్నది. గీతా సౌధ వివరములు నిర్మాత____ శ్రీకృష్ణపరమాత్మ అలంకరణ కర్త___శ్రీ వేదవ్యాస మునీంద్రులు ఆకారము___ మూడంతస్థులు గలది. పునాది___అర్జున విషాదయోగము(ప్రధమాధ్యాయము) మొదటి అంతస్థు___ 5 గదులు (2వ అధ్యాయము నుండి 6 వ అధ్యాయము వరకు)(సాంఖ్యయోగము, కర్మ యోగము, జ్ఞానయోగము,కర్మయోగము,సన్న్యాసయోగము, ఆత్మసంయమయోగము _అనునవి) రెండవ అంతస్థు____ 6 గదులు (భక్తిషట్కము_ 7వ అధ్యాయము నుండి 12వ అధ్యాయము వరకు)(విజ్ఞానయోగము, అక్షరపరబ్రహ్మయోగము, రాజవిద్యారాజగుహ్యయోగము,విభూతియోగము,విశ్వరూపసందర్శనయోగము,భక్తియోగము..అనునవి) మూడవ అంతస్థు___ 6 గదులు ( జ్ఞానషట్కము..13వ అధ్యాయమునుండి 18వ అధ్యాయము వరకు) క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము, గుణత్రయవిభాగయోగము,పురుషోత్తమప్రాప్తియోగము,దైవాసురసంపద్విభాగయోగము,శ్రద్దాత్రయవిభాగయోగమ్య్, మోక్షసన్న్యాసయోగము...అనునవి) నిర్మాణమునకు ...