నేనెలా వుండాలనుకుంటానంటే..............

పడిలేచే కెరటం లా
చల్లగా,మెల్లగా వీచే చిరుగాలిలా
ప్రకృతి సందడిలా
వాన చినుకులా
ముత్యపు బిందువులా
విద్యుత్తరంగంలా
పదహారేళ్ళ ప్రాయంలా
సుమధుర గానంలా
గలగల పారే సెలయేరులా
గాలికి కదిలే ఆకులా
చిరుమువ్వల సందడిలా
పసిపాప నవ్వులా
అమ్మ ఒడిలా
నాన్న లాలనలా...
నేను "నేను" లా.......................................
చాలా సార్లు మా స్నేహితురాలు,  ఎలా ఉంటే బాగుంటుందీ అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటే "మీరు మీరు లా ఉంటే చాలు" అని సమాధానం ఇచ్చాను.. ఆ తర్వాత నా మదిలో కదిలినవి ఇదిగో. ఇలా వ్రాయడం జరిగింది....   

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం