"జీవితం నీకు ఏది ఇస్తే అది తీసుకో"...

 అసంతృప్తి ... ప్రతి ఒక్కరి జీవితాలలో పాచిపట్టబడి అంటుకుపోయిన ఒక భావన .. దానికి వయసుతో సంబంధం లేదు . కేవలం మనసుతో మాత్రమె బంధం .. ఒక నిమిష మా, ఒక గంటా , ఒక నెలా లేక ఒక సంవత్సరమా అని కాకుండా జీవితాంతం మనతో వుండిపోయేది ..బాల్కనీ  లో నిలబడి అల్లంతదూరాన ఒక చిన్న గ్రామం వంటి వాతావరణం చూసినప్పుడు ..." ఆహా ఎంత హాయి ఐన జీవితాలు.." అని మన మనసులో ఒక భావన పుడుతుంది. అవి ఎంత హాయి ఐన జీవితాలో మనకి తెలియదు గాని ఆ నిమిషం మనకు ఒక హాయినిస్తుంది . ఇది నిజమ్.. ఆ భావన మన మనసులో పాతుకుంటుంది . మన జీవనానికి , అక్కడి జీవనానికి పోలిక కట్టడం మొదలుపెడుతుంది .. ఇక్కడ మనమేదో కష్ట పడిపోతున్నట్లు , అక్కడి వారు సుఖపడిపోతున్నట్లు , వాళ్ళు అదృష్టవంతులు ఐనట్లు, మనం దురదృష్టవంతులము ఐనట్లు ఒక పెద్ద ఫీలింగ్ కలుగుతుంది..  దూరపుకొండలు నునుపు అన్న సంగతి మన మనసు ఆ క్షణంలో మరచిపోతుంది .  .  . అక్కడ మొదలౌతుంది మన మనసులో అసంతృప్తి ...

"జీవితం నీకు ఏది ఇస్తే అది తీసుకో"...  అని మా వాడు ఎవరికో హితభోద చేస్తుంటే ఆశ్చర్యం తో నిలబడిపోయాను ..ఎంత గొప్ప సత్యం దాగి వుంది ఆ మాటలో. ఎంత నిజం దాగి వుంది ? ఆ మాటలు ఎవరితో అన్నాడో వారికి ఏమి అర్ధమయిందో తెలియదు గాని నాకు మాటలు రాలెదు. . ఒకరిని కన్వీన్స్ చేయడానికి మనం ఎన్నో వుపాయాలు పట్టుకుంటాము ..కాని ఇంత  గొప్ప సత్యం మన  ముందు వుంటే దానిని పట్టించుకోము ..  తెల్లవారి నిద్ర లేచిన నాటి నుండి అది కావాలి ,ఇది కావాలి అని పరుగులు పెడుతూ వుంటాము .. ఆ అసంతృప్తి అనే భావనకి మనమే మార్గం వేస్తాము . ఏది కావాలో అదే పట్టుకో , అవసరం లేనిదానిని విడిచిపెట్టు అన్న పెద్దల మాటలు అశ్రద్ద చేస్తాము . మరి మనకి మిగిలేది అసంతృప్తే కాక మరేమీ మిగులుతుంది ? జీవితాన్ని ముందుకు నడవనీయక వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ అడుగులు వేస్తాము . అవి తడబడక ఏమి   చేస్తాయి ? ? ఎక్కడ వున్నావే గొంగళి అంటే ఇక్కడే వున్నాను అన్న చందాన మనల్ని ముందుకు నడవనీయవు . 

ఇంకా మనకి అసంతృప్తి కాకుండా ఇంకేమి మిగులుతుంది ? బాల్యం ఒక వరం , పసి మనస్సులు , తెలియని వయస్సులు .. కౌమారం అందమైనది . అప్పుడప్పుడే అడుగులు నేర్చుకుంటుంది . యవ్వనం ఇంకా అందమైనది .. మేచ్యురిటి సంతరించుకునేది .. ఆనాటి అడుగులు తప్పటడుగులు ఐతే మిగిలిన జీవితం శూన్యమే ..  గృహస్థ జీవితం కొత్త జెనరేషన్ కి పునాదులు వేసేది .. వీటన్నింటిని చాలా జాగ్రత్తగా అనుభవించడం నేర్చుకునేవారికి అసంతృప్తి అనే భావనే కలుగదు .. మనది మిడి మిడి జ్ఞానం .. ఒక క్రమశిక్షణ వుందని జీవితాలుగా తయారు కాబడడానికి మనమే కారణం .. ఒక మంచి ఆలోచన మన మనసుల్ని పవిత్రం చెస్తున్ది.. అటువంటి మనసుతో చేసే పనులు ఏనాటికి ఈ అసంతృప్తికి చోటు ఇవ్వవు ..       









              

కామెంట్‌లు

  1. అహ అసలు మాట వరసకి అడుగుతున్నాను లెండి. జీవితం ఏది ఇస్తే అదే తీసుకోవడం తప్ప వేరే ఏదైనా చాయిస్ ఉందాండి? :-) చచ్చినట్టు తీసుకోవడమే, నవ్వుతూనో, ఏడుస్తూనో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. thank you DG gaaru, choice lu maname teesukuntunnaamandi.. balavantapu korikalato... wudaaharanalu akkaraledu kada ..meeku telusu..

      తొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

నాన్న మాట అమ్మకి వేదం

స్నేహంలో రకాలు