చాలా రోజుల తర్వాత మరల బ్లాగు లోకం లోనికి ప్రవేశించాను..ఈ మధ్య కాలం లో ఎన్నెన్నో సంఘటనలు ... కష్టాలు, సుఖాలు, తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే పనులు ...వీటన్నింటి మధ్య సాగిపోతుంది మనిషి జీవితం . మనం కష్ట పడుతున్నా, సుఖపడుతున్నా.. మెలకువలో వున్నా , నిద్రించినా , ఏదీ ఆగదు . అదే మరి కాల మహత్యం.. మనం చేసే పని కరెక్టా కాదా అని తెలుసుకునే లోపలే ఎన్నో జరిగి పోతుంటాయి .ఆగదు ఎ నిముషం నీ కోసమూ, ఆగితే సాగదు ఈ లోకము.. ముందుకు సాగదు ఈ లోకము అన్న పాత గుర్తు వస్తుంటుంది ప్రతి క్షణం....ఎన్ని పుస్తకాలు chadivinaa, ఎప్పుడు ఎం చెయ్యాలో అని ఎన్ని ప్లానులు వేసుకున్నా ఒక్కో సమయం మన చేజారిపోతుంటుంది .. మరి వెనక్కి తిరిగి రాదు ...ఒక్కోసారి మనసు పూర్తి వైరాగ్యం తో నిండి పోతుంది. మరుక్షణం లోనే ఆశావహ పరిణామాలు . .ఏమిటి ఈ జీవితం అని లెక్కలేనన్ని సార్లు అనుకుంటూ వుంటాము . కాని ఇంకా ఇంకా బ్రతకాలని , ఏదో కావాలని కోరుకుంటూ వుంటాము . .మన మనుగడను ప్రశ్నించుకుంటూ వుంటాము .. బ్రతకక మానము ...వట్టి చేతులతో వస్తాము, వట్టి చేతులతోనే వెళ్తాము అన్నది అందరికి తెలిసిందే . అయినా సంపాదనకి పరుగులు తీయక మ...