కృష్ణం వందే జగద్గురుం

   ఈ రోజు  వుదయం భక్తి  ఛానల్ లో   మల్లాది వారి శ్రీ మద్భాగవతం ప్రవచనం లో ఒక జీవి అంటే (ప్రత్యేకంగా మానవ జన్మ)  ఏ విధంగా తల్లి గర్భం లో  పడిన నాటి నుండి ఏ ఏ రకాల అనుభవాలను గూడి వుంటుందో అత్యద్భుతంగా వివరించారు ... నిజంగా  విని  అందరూ తెలుసుకోవలసిన విషయం. తల్లి గర్భం లో పడిన నాటి నుండి  బయట పడే వరకూ మల మూత్రాదులు ,కఫ శ్లేష్మాలలో ఏ విధంగా తిరుగుతూ   ఎందుకురా ఈ జన్మ అని జీవి ఎలా విలపిస్తాడో కళ్ళకు కట్టినట్లు వివరించారు మల్లాది వారు.. గర్భం నుండి బయట పడేప్పుడు ఆ జీవి  మీద నీళ్ళు  కొట్టినప్పుడు ఏడిస్తే బ్రతికి వున్నట్లు మనం గుర్తిస్తాము. ఆ క్షణం లో ఆతని పూర్వ జన్మ స్మృతి పోయి ఏడుస్తాడు కాబోలు జీవుడు.... సరే , గర్భం లో మల మూత్రాదులలో తిరుగుతాడు అది తప్పని స్థితి..  బయటకు వచ్చిన   కూడా ఈ మాయా ప్రపంచం లో అలమటిస్తూ తిరుగుతుంటాడు అజ్ఞానం తో..ఏ మనుష్యుడు అయినా  ఏ    అయినా క్షణ మాత్రము కూడా కర్మను ఆచరింప కుండా వుండలేడు  .. కర్మలను ఆచరింప కుండా వుంటే  శరీర నిర్వహణం కష్ట తరము అవుతుంది అని భగవద్గీత లో  చెప్పబడినది .. ఐతే  కర్మలను  అని తెలియనట్టి స్థితి లో మానవుడు వుంటున్నాడు .అదీ దురదృష్ట కరం... మనం   పుట్టిన    నాటి నుండి    దశ వరకూ ప్రతి క్షణం కోరికలతో యుద్ధం చేస్తూనే వుంటాము . కేవలం సుఖాలు కావాలని కోరుకుంటాము కనుక అది యుద్ధం గా చెప్తున్నాను. నిత్యం రామాయణ మహాభారత యుద్ధ  మనం ఎన్ని చూడడం లేదు ?  రావణాసురులు, కీచక, దుర్యోధనులు, దుశ్శాశనులు ఆనాడే కాదు ఈనాడూ వున్నారు.. ధర్మాధర్మముల మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది .. అదే యుద్ధం భాహ్యంగా కాకపోయినా  కూడా జరుగుతూ వుంటుంది .. గమనించే వుంటారు .. అంటే మనం నిత్యం మన జీవితాన్ని ఒక యుద్ధ రంగం గా మార్చుకుని జీవిస్తున్నాము అనడం లో ఏ మాత్రం సందేహం లేదు.. మనిషి ఆయుష్షు వంద సంవత్సరాలు అనుకున్నా ఈ వంద సంవత్సరాలలో ప్రతి నిత్యం మనతో మనం యుద్ధం చేసుకుంటూ మనల్ని మనం , మన ధర్మాలను మరచి , ఏ కారణం తో ఈ మానవ జన్మ తీసుకున్నాము అన్న ఆలోచన కలుగక రక  సమస్యల తో కొట్టు మిట్టాడుతున్నాము ...మరి ఈ సమస్యలకు పరిష్కారాలు ఏమిటి అని ఆలోచిస్తే ...కొందరు ఒక గురువుని ఆశ్రయిస్తారు , కొందరు ఆ  పై వాడికి వదిలేస్తారు , చాలా  మంది మాత్రమె తమకు ప్రాప్తించిన జ్ఞానం తో ముందుకు  సాగుతారు ....నిత్యం   మనల్ని, మనం చేసే కర్మలను విశ్లేషణా దృష్టితో చూడడం  చేసుకో గలిగితే కొన్ని రకాల సమస్యల నుండి బయట పడ  గలము అన్నది అందరికీ  లోనికి వచ్చే విషయమే.. ఐతే భగవద్గీతని  చేసుకుని చెప్ప బడిన    ఈ పరిష్కారాలు  .చూద్దాము ..
ముందుగా ఆ పరమాత్మకు నా సర్వస్వ శరణాగతి   వేడుకుంటూ .............(ఈ పుస్తకం లో వ్రాయబడిన కొన్ని ముఖ్య విషయాలు యధాతధం గా చెప్పడానికి ప్రయత్నిస్తాను ..ఎందుకంటే భావం ప్రధానం కాబట్టి ...)
కృష్ణం వందే జగద్గురుం  .............

కృష్ణం వందే జగద్గురుం  .............
 శ్రీ కృష్ణావతారం యొక్క ప్రయోజనం దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ ... రామునిగా ఆయన ఆచరిస్తూ మరీ తెలియ జేశాడు ధర్మం ఏమిటో ,త్యాగం ఏమిటో , సామాన్యంగా జీవించడం ఏమిటో .. అది త్రేతా యుగం , ద్వాపర యుగం వచ్చింది ధర్మస్వరూపం , మానవ నైజం మారిపోయాయి ...యుగ ధర్మాలకు మనిషి బద్ధుడు గా మారుతాడు . బందితుడుగా వుంటాడు .. ఆదర్శ ప్రవర్తన తో లోకాన్ని మేల్కొలపడం సాధ్యం   కానిది.. అందు చేతనే భగవంతుడు జీవ తత్వాన్ని ప్రపంచ తత్వాన్ని ఈ శరీర తత్వాన్ని నోటి మాటగా వుపదేశించ దలచినాడు . భగవంతుడు వుపదేషించాడు కనుక భగవద్గీత ఐంది. ఐతే , భగవద్గీత ఎందుకోసం ,  ఎవరి కోసం అన్న ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు రచయిత ...   మరల రేపు  చెప్పుకుందాము మరి ................   


    .  










          

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం