తిరస్కృతి
నిర్ణయం మనదే ..... సున్నితంగా తిరస్కరించడం - మనం మనకి ఎంత శక్తి వుందో అంత మేరకే వినియోగించుకోగలగడం ,చేయలేని పనిని మృదువుగా తిరస్కరించడం ముఖ్యం . There is no substitute for hardwork.. కష్టపడి పని చేయగలగడం ఒక అదృష్టం .. కానీ వారానికి ఒకసారి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమైన అంశం .. తిరిగి కోల్పోయిన శక్తిని సంపాదించుకోగలము ... పిల్లలను చూసి నేర్చుకోవలసినవి ఎన్నో... అన్నింటికన్నా నాకు నచ్చిన విషయం " వాచీ " ని ఒకరోజు మన దగ్గర లేకుండా గడపగలగడం .. అది సాధ్యమే .. ఐతే, మొబైల్ లేకుండా ఒక్క గంట గడపగలగడం ---- చాలా పెద్ద విషయం ఈరొజుల్లొ.. రాబిన్ శర్మ ఈ పుస్తకం వ్రాసిన రోజుల్లో మొబైల్ వుండి వుండదు కదా .. చిన్న పిల్లలు అల్లరి చేయకుండా వుండాలి అనుకునే పేరెంట్స్ వాళ్ళ చేతుల్లో ఒక మొబైల్ ఇచ్చెస్తున్నారు.. వీడియో గేమ్స్ కి అలవాటు చేస్తున్నది కూడా తల్లిదండ్రులు మాత్రమే .. ప్రతి ఒక్క విషయానికీ లాభనష్టాలను భేరీజు వేస్తుంటాము మనం .. మొబైల్ వాడకం వల్ల లాభం కన్నా నష్టాలు ఎక్కువగా వున్నాయి అని నెత్తి నోరూ కొట్టుకుంటున్నా పట్టించుకోము .. అందుకే...