మనం వుదయం లేచిన దగ్గర నుండి, " భగవంతుడా! ఏమిటి కష్టాలు" అని కనీసం పదిసార్లు అయినా అనుకుంటూ వుంటాము.. అవి మనం కొని తెచ్చుకునేవి అని తెలుసుకోలేక , తెలిసినా కొన్నింటిని తప్పించుకోలేం అని తెలుసు కాబట్టి ... మన కర్మల ఫలాలే అవి.. కర్మ యోగం గురించి ఇంతకు ముందే వివరించడం జరిగింది కాబట్టి ఆ సబ్జెక్ట్ టచ్ చేయను గాని , దానం అనెడి కర్మయొక్క ఫలం ఎలా వుంటుంది అన్నది ఒక చిన్న కధ ద్వారా తెలియజేస్తాను ఒకానొక రాజ్యాన్ని పరిపాలించే రాజు గారికి పుత్ర సంతానం కావాలని యజ్ఞ యాగాదులు చేయించగా అదృష్ట వశమున పుత్ర సంతానం కలిగినది. కాని, దురదృష్ట వశాత్తు రాజుకి జన్మించిన కుమారుడు మూగవాడయ్యెను. ఐతే, ఆనాటి నుండి ఆ రాజ్యం లోని బ్రాహ్మణులకి కష్టములు మొదలైనవి. ..బ్రాహ్మణులు లోప భూయిష్టమైన యజ్ఞమును చేయుట వలన తన కుమారుడు మూగ వాడు అయినాడని రాజు అభిప్రాయ పడెను .. అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులను గుండు గొరిగించి విభూతి రేఖలు పెట్టించి గాడిద ప...