మనకి మనం సంప్రదాయాలు విదించుకున్నాము . . . మన సంస్కృతి దేశ విదేశాలకి తెలియజేశాము..ఇతరులు మన దేశవిలువలను అనుసరిస్తున్న సమయానికి మనం వింతపోకడలు పోతున్నాము. ఇంతవరకూ అందరూ ఆమోదించే విషయమే... ఐతే ఇంకా ఏదో తెలియనిది తెలియజేస్తున్నారు మన పిల్లలు.. ఇదివరకు టెక్నాలజీ అభివృద్ది లోనికి రాని సమయంలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్న సమయంలొ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే పదిమంది కూర్చుని తినే స్థితిలో సహజంగానే పెద్దవారు అంటే వయసు పైబడిన వారు తమ శక్తి సామర్ధ్యాలు తగ్గిన తరువాత పిల్లల సేవలపై ఆధార పడి ఉండేవారన్నది అందరికీ విధితమే...ఉద్యోగరీత్యా కానివ్వండి లేదా అన్నదమ్ముల కుటుంబాలలో ఒకరికొకరికి సరిపడక కానివ్వండి లేదా పిల్లల భవిష్యత్ దృష్ట్యా, ఒక ఊరినుండి ఇంకో ఊరికి బదిలీ వెళ్ళే సమయంలో పెద్దలు తాము పుట్టి పెరిగిన ఊరిని విడిచి వెళ్ళలేక ఆక్కడే ఉండిపోవడం వల్ల(ఈనాడు ముందు జాగ్రత్తగా పిల్లల పెళ్ళిళ్ళు చేసిన వెంటనే వారిని విడిగా ఉంచి వారికంటూ ఒక కుటుంబం ఏర్పాటు చేస్తున్నారు పెద్దలు) చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడడం జరిగింది...ఒక కుటుంబం అంటే అమ్మ,నాన్న, ఒకరు లేక ఇద్దరు పిల్లలు..అమ్మనా...