అసంతృప్తి ... ప్రతి ఒక్కరి జీవితాలలో పాచిపట్టబడి అంటుకుపోయిన ఒక భావన .. దానికి వయసుతో సంబంధం లేదు . కేవలం మనసుతో మాత్రమె బంధం .. ఒక నిమిష మా, ఒక గంటా , ఒక నెలా లేక ఒక సంవత్సరమా అని కాకుండా జీవితాంతం మనతో వుండిపోయేది ..బాల్కనీ లో నిలబడి అల్లంతదూరాన ఒక చిన్న గ్రామం వంటి వాతావరణం చూసినప్పుడు ..." ఆహా ఎంత హాయి ఐన జీవితాలు.." అని మన మనసులో ఒక భావన పుడుతుంది. అవి ఎంత హాయి ఐన జీవితాలో మనకి తెలియదు గాని ఆ నిమిషం మనకు ఒక హాయినిస్తుంది . ఇది నిజమ్.. ఆ భావన మన మనసులో పాతుకుంటుంది . మన జీవనానికి , అక్కడి జీవనానికి పోలిక కట్టడం మొదలుపెడుతుంది .. ఇక్కడ మనమేదో కష్ట పడిపోతున్నట్లు , అక్కడి వారు సుఖపడిపోతున్నట్లు , వాళ్ళు అదృష్టవంతులు ఐనట్లు, మనం దురదృష్టవంతులము ఐనట్లు ఒక పెద్ద ఫీలింగ్ కలుగుతుంది.. దూరపుకొండలు నునుపు అన్న సంగతి మన మనసు ఆ క్షణంలో మరచిపోతుంది . . . అక్కడ మొదలౌతుంది మన మనసులో అసంతృప్తి ... "జీవితం నీకు ఏది ఇస్తే అది తీసుకో"... అని మా వాడు ఎవరికో హితభోద చేస్తుంటే ఆశ్చర్యం తో నిలబడిపోయాను ..ఎంత గొప్ప సత్యం దాగి వుంది ఆ మాటలో. ...