ఇంతకు ఇంతే

మనం వుదయం లేచిన దగ్గర నుండి, "  భగవంతుడా!  ఏమిటి కష్టాలు" అని కనీసం పదిసార్లు అయినా అనుకుంటూ  వుంటాము.. అవి మనం కొని తెచ్చుకునేవి అని తెలుసుకోలేక , తెలిసినా కొన్నింటిని తప్పించుకోలేం అని తెలుసు కాబట్టి ... మన కర్మల  ఫలాలే అవి..  కర్మ యోగం గురించి ఇంతకు ముందే వివరించడం జరిగింది కాబట్టి ఆ సబ్జెక్ట్ టచ్ చేయను గాని ,  దానం అనెడి   కర్మయొక్క ఫలం ఎలా వుంటుంది అన్నది ఒక చిన్న కధ ద్వారా  తెలియజేస్తాను
       ఒకానొక  రాజ్యాన్ని పరిపాలించే రాజు గారికి పుత్ర  సంతానం కావాలని యజ్ఞ యాగాదులు చేయించగా అదృష్ట వశమున పుత్ర సంతానం కలిగినది.   కాని, దురదృష్ట వశాత్తు రాజుకి  జన్మించిన కుమారుడు మూగవాడయ్యెను. ఐతే,  ఆనాటి నుండి ఆ రాజ్యం లోని బ్రాహ్మణులకి కష్టములు మొదలైనవి. ..బ్రాహ్మణులు లోప భూయిష్టమైన యజ్ఞమును చేయుట వలన తన  కుమారుడు మూగ వాడు  అయినాడని  రాజు అభిప్రాయ పడెను  .. అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులను గుండు గొరిగించి విభూతి  రేఖలు పెట్టించి గాడిద పై వూరేగించెను.    ఆనాటి నుండి రాజుగారు  వింతగా ప్రవర్తింప సాగెను.. . బ్రాహ్మణులను పిలిచి విరివిగా తోటకూర దానం చేయ సాగెను. సాగు భూమిలో అధిక విస్తీర్ణములో  తోటకూర పండించునట్లు ఆజ్ఞాపించెను .. సుంకములో భాగము తోటకూర రూపం లో వసూలు చేయబడుచుండెను. కోటలో బండ్ల కొలడి తోటకూర జమ చేయబడుచుండెను . బ్రాహ్మణులు అన్నము వండుకొనుట , తక్కిన వంటకములను భుజించుట నిషేధింపబడెను . ఈ పరిస్థితి శైవులు మరియు వైష్ణవులు ఇరువురికీ సంకటప్రాయమైనది ..తర్కములో మహా పండితులైన  బ్రాహ్మణులు కూడా తమ అహంకారమును విడిచి మౌనముగా తమ ఈ  దురవస్థ ను భగవంతునికి చెప్పుకుని ప్రార్ధిస్తూ వుండిరి.. . బ్రాహ్మణులు అందరిలో అగ్రగణ్యుడు ఐన  ఒక దత్త భక్తుడు   " శ్రీ దత్తాత్రేయుని స్మరణ మాత్రమున  తమ దురవస్థను బాపగలదు"  అని తెలుపగా వారందరూ మండల దీక్షను పూని ఆ దత్తాత్రేయుని ఆరాధించసాగిరి     ఇదిలా వుండగా     రాజుగారి ఆజ్ఞ మేరకు రాజ భటులు దారిన  పోయే బ్రాహ్మణులను పట్టి ఆపి  రాజు  తీసుకు వెళ్తూ వుండేవారు.. వారందరూ రాజుగారి ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోవుటచే కష్టాల పాలు  అవుతుండేవారు   ఒకరోజు ఆ రాజ్యం లోని  విచిత్ర పురం అనే   గ్రామము నుండి కాలి నడకన   పోవుచున్న పరమ యోగ్యుడు , దత్తాత్రేయుని భక్తుడు  ఐన శంకర భట్టు అనే బ్రాహ్మణుని రాజ భటులు మార్గ మధ్యంలో ఆపి    " అయ్యా ! మీరు  వైష్ణవులా లేక శైవులా   అని ప్రశ్నించిరి.  "  ........   
" శివ కేశవ  బేధమును పాటించని స్మార్తులము. ఐనను కాస్త  శైవం వైపు మొగ్గు చూపెదము , ఆది శంకరుల దక్షినామ్నాయి  పీఠం  అయిన శృంగేరి   యందలి శంకరాచార్యుల వారు మాకు  గురువు అగుదురు"   అని శంకర భట్టు సమాధానం ఇచ్చెను . అప్పుడు రాజభటులు ఆ బ్రాహ్మణుని తమ రాజుగారి వద్దకు రావలసిందిగా వేడుకొనగా  వారిని అనుసరించి రాజ దర్శనమునకు పొయెను..
శంకరభట్టుని రాజసముఖమున నిలబెట్టిరి. ఆతనికి ముచ్చెమటలు పట్టసాగినవి . మనసులో దైవ ప్రార్ధన జరిగి పోతుండెను. రాజు అందరినీ ప్రశ్నించినట్లే ఆతనిని ఇలా  ప్రశ్నించెను ... "అంతకు ఇంత ఐతే ఇంతకు  ఎంత ?" .....
 శంకర భట్టు గంభీరముగా    " ఇంతకు ఇంతే !"   అని బదులు ఇచ్చెను . రాజు  ఆశ్చర్యముతో ఈ విధముగా అనెను ... "మీరు చాలా గొప్పవారు   మీ దర్శన భాగ్యమున ధను ధన్యుడనైతిని . నాకు ఇటీవల పూర్వ  జ్ఞానము  కలిగినది . నేను గత జన్మలో బహు భీదవాడిని . నా ఇంటిలో పెంచుకున్న తోటకూరను అడిగిన వారికి లేదనకుండా వారు వీరు అనుకోకుండా దానం చేసేవాడను .  వారందరూ నా వద్ద దానము పొందుటయే గాని ఏనాడూ నాకు సహకరించ  లేదు . నాపై దయ చూప లేదు . ఆబ్దికములకు , వివాహాది శుభ  కార్యములకు నన్ను పంపినప్పుడు ముట్టిన సంభావనలలో నాకు ఒక వంతు మాత్రమె ఇచ్చేవారు 
 శ్రమ నాది, ఫలితం వారిది . పైగా నా ఇంటి నుండి తోటకూర వుచితంగా పొందేవారు . నేను కటిక దరిద్రమును అనుభవిస్తూ కూడా యధావిధిగా తోటకూరను దానం చేస్తూ  వుండేవాడిని . నా  దాన ఫలితమున   ఈ జన్మలో రాజుగా జన్మించితిని . పూర్వ జన్మలో నా వద్ద దానము  పొందిన  అ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యము లోనే బ్రాహ్మణులుగా  జన్మించితిరి . నేను వారికంటే  ఎన్నో రెట్లు అధిక  ధనవంతుడిగా,  శ్రేష్టుడిగా జన్మించితిని . తోటకూర దానం  చేయుట వలన  రాజును ఐతిని  కదా...   మరి ఇప్పుడు  అప్పటికంటే ఎన్నో రెట్లు తోటకూర దానము చేయుచున్నాను . దానికి ఫలితముగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి ? అని తెలుసుకొనుటకు ఈ ప్రశ్న వెసితిని. మీరు మాత్రమె దానికి సరియైన సమాధానం  చెప్పినారు " అని తన కదను ముగించెను.. అంతట  శంకర భట్టు ఈ విధముగా పలికినాడు --- రాజా !  పోయిన   పూర్వ జన్మ లోని పరిష్టితుల దృష్ట్యా మీ వద్ద వున్న తోటకూర ఎంతో  విలువైనది . ఐతే, ప్రస్తుతము మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర  అత్యల్పమైనది . మణులు రత్నాలు బంగారము వంటివి దానం ఈయదగిన ఈ స్థితిలో మీరు ఎంత తోటకూర దానము చేసినాను అంతకు వంద రెట్లు  తోటకూర లభించు గాని అంతకంటే మరేదియును రాదు ! ....
రాజు గారు  ఎంతో సంతోషంతో శంకర భట్టుని రెండవ రెండవ ప్రశ్న అడిగారు ... ఆ ప్రశ్న   ఏమిటో రేపు తెలుసు కుందామా మరి !!!!!!

 అదండీ సంగతి .. మన నిత్య జీవితంలో మన ద్వారా జరపబడు కర్మలలో ఒకటి దానం చేయడం .. సద్భావనతో చేయబడు దానం ఎంతో వుత్తమ ఫలాన్ని ఇస్తుంది.    "పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలూ "  అని పెద్దలు చెప్తూ వుంటారు .. అది కూడా   మన కర్మలు ఎలా వుండాలో తెలియజేస్తుంది కదు..







 

కామెంట్‌లు

  1. కధ బాగుందండి. అంతకింతయితే ఇంతకెంతవుతుందని ఒక టపా రాశానండి, ఈ కధతోనే, కాని పూర్తి కధ గుర్తు లేకపోయింది, ఇప్పుడు చదివేను.

    రిప్లయితొలగించండి
  2. థాంక్ యు శర్మ గారు .. ఈ కధ చదవగానే బ్లాగ్ లో పోస్ట్ చెయ్యాలి అనిపించింది .. ఎంతో నేర్చుకోవచ్చు ఈ కధ నుండి

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం