సర్వేజనా   సుఖినో భవంతు      మనం తెల్లవారి  నిద్ర  లేచిన దగ్గర నుండి  రాత్రి నిద్రకు వుపక్రమించే వరకూ    ఎన్నో చెయ్యాలని అనుకుంటాము .   అనుకున్న   పనులు    అన్నీ పూర్తీ కావచ్చు లేదా కాక పోవచ్చు . పూర్తి  ఐతే సంతోష పడతాము లేదంటే   ఏదో విచారం మనల్ని కమ్ముకుంటుంది . ఇది అందరికీ  కాక పోవచ్చు కాని కొందరికి ఇలా జరుగుతూ వుండవచ్చు. ఐతే ఏ   పనిలో విజయం సాధించాలన్నా అది మన సంకల్ప శక్తి మీద   ఆధార పడి  వుంటుంది. ఆ సంకల్ప శక్తి  ఏమిటి ?  అన్న విషయం మరో సారి వివరిస్తాను. ఈరోజు ఈ మధ్య కాలంలో మా కుటుంబానికి  అత్యంత మధురానుభూతిని కలిగించిన రెండు విషయాలు ప్రస్తావిస్తాను . 
నేను సామాన్యంగా రద్దీ ఎక్కువ వున్న  ప్రదేశాలకు అది ఎంతటి   ప్రాముఖ్యత   కలిగినదైనా  లేదా ఎంత  పర్వదినం అయినా   అడుగు పెట్టడానికి సాహసించను..   వూపిరి ఆడనట్లు వుంటుంది.  హాయిగా ఇంటిలో ప్రశాంతంగా  టి . వి లో    చూసుకోవచ్చు కదా అని అనుకునే దానిని..  వైకుంఠ ఏకాదశి పర్వదినాన అందరూ తిరుపతి వెళ్తుంటారు.   నేను ఎందుకు వెళ్ళడానికి  ఇష్ట పడడం లేదు అని నా మనసులో కూడా తిరుపతి తిరుమల వేంకటేశ్వరుని ఆ సమయం లో దర్శనం చేసుకోవాలి అన్న కోరిక ( అని కూడా  చెప్పను ) చిన్నగా కలిగింది, కాని ప్రయత్నం మాత్రం చేయలేదు. అక్కడికి వెళ్ళిన  వారు  ఎంత అదృష్ట వంతులో కదా అని కూడా అనుకున్నాను.  నేను ఆ సమయం లో సాయినాధుని లీలామృతం అన్న పుస్తక పారాయణం చేస్తున్నాను... కేవలం నాలుగు రోజులు సమయం వుంది అనగా మా చెల్లెలు  " అక్కా మీరూ రావచ్చు కదా"  అని ఫోన్ చేసింది..   " కష్టం కదరా  .రిజర్వేషన్ లేదు . దర్శనం గురించిన టోకెన్లు మా దగ్గర లేవు.. " అని  అన్నాను  కానీ  మావారికి కూడా తను చెప్పడం,  రిజర్వేషన్ ఏంతో  పెద్ద సంఖ్యలో వెయిటింగ్ లిస్టు వుండడం,   సరే    చూద్దాం   అని   బాబా మీద వదిలి వేసాను      దర్శనం కాకపొతే గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి వచ్చేద్దాములే అనుకున్నాము . ఆ సమయంలో మా ఇంటి పనులు జరుగు తున్నాయి . మేము లేకుంటే ఇబ్బందే కాని  మా  జోగారావు గారు  ఎవరితో  అయినా  పెట్టుకోండి  గాని వెంకటేశ్వరునితో మాత్రం పొరపాటున కూడా పెట్టుకోవద్దు  అని చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి    ఎందుకంటే ముందు రోజు రాత్రి మాకు  రిజర్వేషన్ కన్ఫర్మ్  ఐనట్లు మెసేజ్ వచ్చేసింది  సిస్టం లో  .. రూం బుక్ చేసినట్లు మెసేజ్ మా  చెల్లెలు నుండి  ( తను అక్కడ స్టాఫ్ ).. అనుకోకుండా ఈ రెండు ముఖ్యమైన పనులు పూర్తి  కావడంతో ఏదైతే ఐంది   అని సాహసించి  బయలుదేరి వెళ్ళాము. తిరుపతి  వెయిటింగ్ హాల్ లో స్నాన పానాదులు పూర్తి  కావించుకుని తయారుగా వున్నాము . ఇక దర్శన భాగ్యం  ఒక్కటే తరువాయి. ఎప్పుడూ లేనిది ఆ రోజు పట్టు చీర కట్టుకున్నాను.. నాకే నవ్వు  వచ్చింది . అనుకోకుండా మా   తిరుపతి రైల్వే స్టేషన్ లో  జాయిన్ అయ్యారు..
తిరుమల వెళ్ళాము .. క్యూ లైన్ దగ్గరగా నిలబడ్డాము . ఈ రోజు నువ్వు పట్టు చీర కట్టినందుకు అయినా దర్శన భాగ్యం కల్పించాలి అని మా మరదలు అన్నది అ. నేను బాబా మీద వదిలి పెట్టేసాను.. ఏదైతే అది అవుతుంది అని . ఈలోగా మా నాన్న గారి పోలికలు కలిసిన ఒక వ్యక్తీ ( యూనిఫారంలో వున్నారు) ఏమ్మా ఇక్కడ నిలబడ్డారు అని అడగడం , మాకు దర్శనం టోకెన్లు లేవని చెప్పడం , మమ్మల్ని అతనితో రమ్మని    చెప్పి   స్టాఫ్ అడ్డగిస్తుంటే , నేను చెప్తున్నాను కదా వీరిని లోపలి పంపండి అని మమ్మల్ని లోనికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం , నిజంగా నిజంగా ఏంటో ఆశ్చర్య కరమైన అనుభూతి ... ఈ నాటికీ , ఏనాటికీ మరచిపోలేని సమయం .. అంతకుముందు తిరుమల వెళ్ళినప్పుడు  మూడు   వందల రూపాయల టోకెన్లు తీసుకుని వెళ్ళినా ఐదు గంటల పాటు లైన్ లో వెళ్ళినా నలిగి పోయాము  తప్ప  నాకు ఆ స్వామీ విగ్రహం కూడా కనబడలేదు . మరల ఇంకెప్పుడూ రాకూడదు అని అనుకున్నాను ..  మరి ఇది అత్యంత అద్భుతమే   కదా ...
ఆ రోజు  మధ్యాహ్నం ఐదు వందల రూపాయల  వి. ఐ ఐ .పి బ్రేక్ దర్శనం టోకెన్లు అమ్ముతారని తెలిసి  
అక్కడ సి. ఆర్ వో ఆఫీసు కి వెళ్లి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ... టికెట్లు దొరికాయి .   వుదయం ఐదు గంటలకు దర్శనం.. లైన్ లో నుండి గుడిలో ప్రవేశించాము  ఏమని వర్ణించనూ.. మాకు ముందుగా    టిటిడి చైర్మన్  బాపిరాజు గారు తన భార్యతో అతి సామాన్యంగా ఆ భగవంతుని దర్శించుకోవడానికి లైన్ లో వున్నారు .. చాలా చక్కని దర్శనం జరిగింది .. ఇది ఆ భగవంతుని  మాకు కలిగిన అనుభూతి లో అత్యంత   అద్భుత మైనది  ఐతే, అంతకు మించిన అనుభవం మరొకటి..
అలహాబాద్ కుంభ మేళా నూట నలభై ఏమి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి  వస్తుందని   టి .వి లో , న్యూస్ పేపర్ లో రోజూ చదువుతున్నాము.   ఇలాంటి సమయాలలో తప్ప బయటకి కనబడని సాదు జనుల  గురించి కూడా వింటున్నాము.   అయినా   అక్కడికి వెళ్ళాలి   అని   అనిపించలేదు .  అంతకు పూర్వం  త్రివేణి సంగమంలో స్నానం చేసిన అనుభూతి మనసులో వుంది.    అనుకోకుండా   పోయిన నెల ఇరవై ఏడవ తారీఖున మా వారి గురుస్వామి మరియు మా కుటుంబ సన్నిహితులు మా వారికి ఫోన్ చేసి   "కుంభ మేళా కు   మీరు రావడానికి సిద్దమా"    అని అడిగితె మా వారు  నన్ను  అడిగి  చెప్తాను అన్నారు . అది  విన్న నేను వెంటనే రిజర్వేషన్ చేయించండి   అని చెప్పడం ,  వెయిటింగ్ లిస్టు లో పెట్టడం జరిగింది. . ఎకస్త్రా బోగీలు వేయడం వల్ల రిజర్వేషన్ కన్ఫర్మ్ ఐపోయింది ఈ నెల ఏడవ  తారీఖు స్పెషల్ ట్రైన్ కి .. ఎనిమిది గంటల  మేము అలహాబాద్ ముందు  స్టేషన్ నైని  లో దిగి  ఆటో లో అక్కడ ఒక త్రివేణి సంగమ ఘాట్  కి వెళ్ళడం , హారతి  సమయం లో స్నానం   చేయడానికి  వుపక్రమించడం, సరిగా మంత్రం పుష్పం సమయానికి నా చేతిలో పసుపు కుంకుమ దక్షిణలు వుండడం అవి నీటిలో వదిలి పెట్టి నమస్కారం చేసుకుని దీపం వెలిగించి, అక్కడ నుండి ఆటో లో కళ్యాణీ దేవి  ఆలయం, శ్రీ లలితా దేవి ఆలయం ( రెండూ శక్తి పీఠాలు ) ( ఆది శంకరులు అక్కడే లలితా సహస్ర నామాలు రచించారని అక్కడి పూజారి చెప్పారు ) .. దర్శనం ఐన తర్వాత తిరిగి రైల్వే స్టేషన్  చేరాము .. తిరుగు ప్రయాణం .. ఇవన్నీ  ఒక    ఎత్తైతే , అసలు జరిగిన సంగతి ఒకటి.. మేము మహా శివరాత్రి రోజు మా వూరు చేరాము . త్రివేణి సంగమ నీరు  రెండు బాటిల్స్ లో తెచ్చుకున్నాము. మా గురు స్వామి గారు ఆ నీటిని గుడికి  తీసుకు  వెళ్లి  సంప్రోక్షణ చేయించండి అని మా వారి తో చెప్పారు. మరల   ఎలాగూ  గుడికి వెళ్తున్నారు  కాబట్టి , రుద్రాభిషేకానికి కావాల్సిన వస్తువులు కూడా తీసుకు వెళ్లి అభిషేకము  చేయించు కొండి అని చెప్పారు. .  ద్రాక్ష ,చెరుకు రసాలు,  కొబ్బరి నీళ్ళు , పళ్ళు ,కొబ్బరి కాయలు , పూలు పసుపు కుంకుమలు అన్నింటితో పాటు ఈ  నీళ్ళు కూడా తీసుకు వెళ్లి అక్కడి పూజారి  గారితో అభిషేకానికి కేవలం కొన్నినీళ్ళు  మా వుద్దేశ్యం లో ఒక చిన్న గ్లాసుడు మాత్రం వాడి మిగిలినవి మాకు ఇచ్చేయమని మరీ   మరీ చెప్పాము .  మందమతులం మరి .. ధ్యాస అంతా  నీటి మీదే. తెలిసిన వారు అందరికీ ఇవ్వాలి  అన్న ధ్యాసే తప్ప మరొకటి లేదు మరి. టి . వి . లో కనిపిస్తున్నాయి అభిషేక దృశ్యాలు.. నీళ్ళు బాటిల్స్ తో  పైకెత్తి శివుడికి అభిషేకం మొదలు పెట్టారు. అయ్యో,, అన్నీ పోసేస్తున్నారు అనుకున్నాము.. కాని అభిషేకం ఐన తర్వాత వారు మాకు బాటిల్స్ తో ఆ నీరు తెచ్చి ఇచ్చారు . అప్పుడు మా అందరి  కళ్ళూ తెరుచుకున్నట్లు  ఐంది.. మేము  కుంభ మేళాకు వెళ్ళడం ఏమిటి ? అక్కడి నీళ్ళు  తీసుకు రావడం , ఆరోజు మహా శివరాత్రి కావడం , అనుకోకుండా అభిషేకం చేయించాలని వెళ్ళడం , ఈ త్రివేణీ సంగమ నీటి తో   శివునికి అభిషేకం జరగడం , ఏమిటిది ఈశ్వరా , ఏమి ఈ మాయ ,  ఏమి ఈ అద్భుతం .. ఇక నాకు మాటలు రావడం లేదు .. ఏమని చెప్పేది ?  మీరే అర్ధం చేసుకోగలరు..   



 ఇక   ఈ నాటి సమస్యకు భగవద్గీత పరిష్కారం .............

సమస్య :-------- మా వూళ్ళో ఒకాయన గుడి కట్టించాడు . మరొకాయన రధం చేయించాడు . మరొకాయన డబ్బు ఖర్చు చేసి వుత్సవాలు చేయిస్తున్నాడు . వారు డబ్బు కలవారు కనక చేయిస్తున్నారు . నేను పూట గడవని  వాడిని . నేనేమి ఇవ్వగలను ?  

పరిష్కారం:-----              త్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి !
                         తదహం    భక్త్యుపహృతమశ్నామి    ప్రయతాత్మనం: !!

ప్రతివారూ గుళ్ళూ , గోపురాలు కట్టించ నవసరం లేదు . ఎంతో  డబ్బు పోసి ఆడంబరం గా వుత్సవాలు చేయించ నక్కర లేదు . భక్తి  తో చిన్న  ఆకు కాని, పువ్వు కాని,పండు గాని  ఏదీ  లేక పొతే చివరకు కాసిని నీళ్ళు కాని భగవంతునికి  నివేదిస్తే దేవుడు పరిగ్రహిస్తాడు . భక్తి  తో ఏది   సమర్పించినా దేవుడు తప్పక  స్వీకరిస్తాడు . భక్తి  లేకపోతె ఏమి సమర్పించినా భగవంతుడు ముట్టడు ..  అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది .   












                 

కామెంట్‌లు

  1. మీblog లోని విషయాలు నేను పేస్ బుక్ లో నేను పోస్ట్స్ గా పెట్టుటకు అనుమతిని కోరుచున్నాను . ఒక వేళ మీరు పేస్ బుక్ లో ఉండినట్లయితే షేర్ చేసుకుంటాను . నా పేరు రాఘవానంద్. రిటైర్డ్ టీచర్ ని . నా ప్రొఫైల్ పేస్ బుక్ లో చూడ గలరు . నా ఫోన్ నెంబర్ 9441242913 . కాకినాడ లో ఉంటాను . ఉచిత యోగ శిక్షణ , మంచిని అందరికీ పేస్ బుక్ ద్వారా చెప్పాలనే తపన తప్ప వేరే వ్యాపకాలు లేవు

    రిప్లయితొలగించండి
  2. నాకు గూగుల్ + ఎకౌంటు ఉంది గాని దానిని వినియోగించడం తెలియదు

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం