ఎవరు గొప్ప

 మనలో చాలా మందికి ఒక గొప్ప   సందేహం కలుగుతూ వుంటుంది . దేవుళ్లలో ఎవరు గొప్ప ?.. శివుడే గొప్ప ..కాదు,  విష్ణువే గొప్ప ...అదేమీ  కాదు శక్తి లేనిదే ఈ  ఇరువురూ దేనికీ   పనికి రారు అని ఇలాంటి వాదనలు  చూస్తూనే వుంటాము..   అసలు ఎవరిని పూజించాలి ? మనకెందుకు ఈ గందర గోళం ?  ఇది కేవలం హిందువులలో మాత్రమె కనబడుతుంది .. ఎందువల్ల ? ఆత్మ, పరమాత్మ ల తత్త్వం తెలిసిన మన పెద్దలు మనకు ఏమి తెలియ జెప్పాలనుకున్నారు.. మూలాన్ని వదిలేసి ఈ వాదనలు అవసరమా అని ఒక ప్రశ్న ..కానీ భగవద్ గీత లో నేను ఎవరిని పూజించాలి  అన్న సందేహానికి   ఒక శ్లోకం ద్వారా  ఆ కృష్ణ   పరమాత్మ  వివరించారు  ...........

                యే యదా మాం ప్రవద్యంతే తాంస్తదేవ భజామ్యహమ్ !
                 మమ  వర్త్మానువర్తనే మనుష్యః పార్ధ సర్వశః !!
                 యేప్య న్య   దేవతా భక్తా యజంతే శ్రద్ధ యాన్వితాః !
                  తే పి  మా మేవ కౌన్తేయ !యజన్త్య విధిపూర్వకం !!     

ఎవరు ఎవరిని  పూజించినా  చేరేది ఆ భగవంతునికే ... ఆయనను ఎవరు ఏ  రూపంలో పూజిస్తే , ఆ రూపం లోనే  పూజలు గ్రహిస్తాడు . తమలో ఎన్ని వైవిధ్యాలున్నా మానవులు ఆయన మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు .  ఎవరు, ఏ  దేవతలను పూజించినా అదీ ఆయనకే చెందుతుంది . ఐతే తొలిపూజ సాక్షాత్తు గానూ, ఈ పూజ పరంపర గానూ చెందుతాయి..   అదీ తేడా .. కనుక మనకు  నచ్చిన విధంగా పూజించుకోవడానికి ఆయనే అవకాశం ఇస్తున్నాడు .. ఈ గందర గోళానికి  కారణం అజ్ఞానం తప్ప మరి   ఇంకేమీ లేదు  






             

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం