మధురం, మధురం

స్నేహం అంటే ఏమిటి ? ఏమిటి ఈ పిచ్చి ప్రశ్న అంటారా ..... ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూ వున్నాను సరి ఐన   నిర్వచనం తెలుసుకోవడం కోసం ...... ఒకరి కొకరు చేతిలో  చేయి వేసుకుని సినిమాలు షికార్లు తిరగడం , బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం , గంటల తరబడి మాట్లాడుకోవడం . ఎక్కడికైనా దూరం   వెళ్ళాల్సి వస్తే  మిస్ అవుతామని  ఏడవడం .........  ఏదైనా మాట పట్టింపు వస్తే విడి పోవడం .......... ఒకరి మీద మరొకరు  ద్వేషం పెంచుకోవడం ........ ఇదే స్నేహం అంటే మాత్రం ఒప్పుకోవడం  లేదు  మనసు.... . చదువుకునే పిల్లలు ఐతే స్నేహం పేరున పెడదారులు  పడుతున్నారు ..అదా స్నేహమంటే ... వుహూ, మనసు అందుకూ అంగీకరించడం లేదు....
ఈ  విషయం మీదే మనసు కేంద్రీకరించాను ..సమాధానం దొరికింది . ఆ విషయాలు నెమ్మదిగా ప్రస్తావిస్తాను ... అందాకా ఈ విషయం పై ఎవరైనా స్పందించాలని అనుకుంటే వారికిదే నా ఆహ్వానం ......... మరచిపోయాను ..నా ఈ బ్లాగుకి పెట్టిన పేరు స్నేహానికి ఒక చిన్న జ్ఞాపిక.   
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం