కర్మ అంటే పని అని తెలుసుకున్నాము కదా .. పెద్దల ద్వారా కర్మలు ఎలా విభజించ బడ్డాయో మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు వివరించారు .
౧. సంచిత  కర్మ ౨. ఆగామి కర్మ ౩. ప్రారబ్ద కర్మ 
౧. సంచిత కర్మ : ఈ కర్మనే సంచయ కర్మ అని కూడా పిలుస్తారు. ఓ జీవి అనేక జన్మల్లో చేసిన కర్మలు పోగైనది . సంచిత కర్మని అంబుల పొదిలో ఉపయోగించ దానికి సిద్ధంగా వున్న బాణంతోపోల్చారు ..
౨. ఆగామి కర్మ : దీనికి ఇంకో పేరు క్రియామాన కర్మ వర్తమాన కాలంలో మన జీవన యానంలో కొన్ని కర్మలు తప్పని సరిగా చేయాల్సిన అవసరం వుంటుంది ..అలా చేసే కొత్త కర్మలు అంటే ఈ జన్మలో చేసే కర్మలను ఆగామి కర్మలు అంటారు .పుట్టిన నాటి నుండి మరణించే వరకూ మనం చేసే ప్రతి కర్మా ఆగామి కర్మ క్రిందకి వస్తుంది...
౩. ప్రారబ్ద కర్మ:  .పరిపక్వానికి అంటే ఫలాన్ని అనుభవించే స్థితిలోకి వచ్చిన కర్మలని ప్రారబ్ద కర్మలుగా పేర్కొన్నాను ..e జీవైనా మొదటి శ్వాస నించి ఆఖరి శ్వాసా వరకూ, గత జన్మల్లో చేసిన సంచిత కర్మraashi లోంచి అనుభవానికి తీసుకు వస్తుందో ఆ భాగానికి ప్రారబ్ద కర్మ అని పేరు ..
ఇంకా శుభ, అశుభ కర్మలు ,మిశ్రమ, తటస్థ కర్మలు , స్వార్ధ, పారమార్ధిక కర్మలు , నీతియ  కర్మలు, నైమిత్తిక కర్మలు , కామ్య కర్మలు గా మన కర్మలు విభజించ బడ్డాయి .. 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం