నేను, నాది, సంసారం, కర్మ.............

ఒక్కోసారి మనం అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరమూ వుపయోగించే పదం "నా ఖర్మ " చాలాసార్లు విన్నాను ... ఇలా ఎందుకు అంటారు అని ప్రశ్నించుకునే దానిని .. ఎవరినీ అడిగే సాహసం చెయ్యలేదు గాని ఆలోచించి చూస్తె ఈ పదం  కొన్నిసార్లు  చాలా ఆత్మీయంగా, మన హృదయాన్ని సేద తీర్చేట్లుగా తీర్చేట్లుగాి వస్తుందా అని  అనిపించింది .. ఐతే ఈ " ఖర్మ " ఏమిటి ఏమిటికు ఏదైనా విపత్తు సంభవించి నప్పుడు నా ఖర్మ అని మన మనసుల్ని సరిపెట్టుకునే ఈ ఆయుధం ఏమిటి ? ఖర్మ అంటే నుదుటి వ్రాత అని గురించి వాపోవడమా ?కర్మ అంటే పని అని తెలుసుకుంటాము చిన్నప్పుడు చదువు కున్నప్పుడే ..కర్త , కర్మ , క్రియ ...ఈ మూడింటికి అవినాభావ సంబంధం వుంటుంది కదా .. ..ఖర్మ , కర్మ ల  మధ్య వ్యత్యాసం కేవలం మరియు   అక్షరాలూ మాత్రమేనా, ఇంకా ఏమైనా వున్నాయా ?  ... తెలుసుకోవాలని వెదుకులాట  మొదలుపెట్టాను ... ...... మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి "కర్మ-జన్మ అన్న పుస్తకం లభించింది... చిన్న ఆలంబన దొరికినట్లు ఐంది .. అందుకే నాకు కలిగిన సందేహాన్ని ఇలా బయట పెట్టె ప్రయత్నం చేస్తున్నాను .... ఈ ప్రపంచం చాలా అందమైనది .. ఈ ప్రపంచం లో అనంత  ప్రాణికోటి వుంది ..ఎన్నో జన్మల అనంతరం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దొరకనిది మానవ జన్మ.. ఇది అందరికీ తెలిసినదే .మరి ఇటువంటి అత్యుత్తమ మైన మానవ జన్మ తీసుకున్న జీవులు అందరూ  సుఖమయ జీవనం గడుపుతున్నారా ?.  ...ప్రతి వస్తువుకి రెండు ప్రక్కలు వున్నాయి అని అంటారు ..ఉదాహరణకి తెలుగు వ్యాకరణములో మనం నేర్చుకుని వున్నాము -- ప్రకృతి , వికృతి అని... సుఖము ప్రకృతి ఐతే , కష్టము వికృతి.. ధనవంతుడు ప్రకృతి ఐతే , పేదవాడు వికృతి .. అదేమిటి .. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దొరకని ఈ అతి అద్భుత మైన మానవ జన్మలో ఈ కష్టాలు ఏమిటి ? మానవుడు పేదరికము  ఎందుకు అనుభవిస్తున్నాడు ? , ... ..ఈ prashnalaku కర్మలకు ఏమిటి సంబంధం అంటారా ? అదేమిటో తెలుసుకోవాలనే నా ఈ చిన్ని ప్రయత్నం ...
                                                                                                                 
                                                                                                                       మిగతా రేపు ...

కామెంట్‌లు

  1. వర్త మాన కాలం లో మనం చేసే ప్రతి పనికి ఫలితం అనుభవించక తప్పదు (అది మంచి అవచ్చు, చెడు అవచ్చు).. దానినే "కర్మ ఫలము" అని అంటారు.. అది ఈ జన్మ లో కాక పోతే వచ్చే జన్మలో కూడా అనుభవించ వలసి వస్తుంది అని అంటారు.. ఈ విషయము గురించి భగవద్గీతలో బాగా విపులీకరించారు.. ఇప్పటి జన్మ పూర్వ జన్మ వాసనము బట్టే వుంటుందని అంటారు..
    మరొకటి "కర్మ" నే "తలరాత" అంటాము.. దానిలో చెడు ఫలితం వచ్చే సరికి "ఒత్తు "ఖ" పెట్టి "ఖర్మ" అంటారు.. ఇంతకంటే మరేం లేదేమో.. ఒకవేళ నా అభిప్రాయం తప్పయితే చెప్పండి..

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం