మానవ గీత

జాతస్య హి ధ్రువో మృత్యు; : ధృవం జన్మ మృతస్య చ1  
తస్మా ద పరిహార్యే ర్ధే న త్వాం శోచితుమర్హసి౧౧

పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు . కనుక అపరిహార్యములైన ఈ విషయము ల యందు శోకించదగదు ..

చాలా బాగా చెప్పాడు కదండీ శ్రీకృష్ణ పరమాత్ముడు ...ఇంకో విషయం కూడా చెప్పాడండి....... 

ప్రాణులు అన్నియు పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు.  {అవ్యక్తములు }.. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే ......ఈ జనన మరణముల మధ్య కాలము నందు మాత్రమె అవి ప్రకతితములు { ఇంద్రియ గోచరములు }.  అగుచుండును . ఇట్టి స్థితిలో వాటికి పరితపించుట నిష్ప్రయోజనము ..........
ఈ విషయాలు తెలిసి నప్పటికీ మనం దుఖించక మానము .. అందుకే మనం మనుషులు గానే మిగిలిపోతాము ..

ఏదీ శాశ్వతం కాదు .. ఇది అందరికి తెలిసిన విషయమే .. ఒక కుర్చీ కాలు విరిగితే మేకులు కొట్టో  లేక  ఫెవికాల్ అంటించో దానిని బాగు చేసినట్లే , మన శరీరం లోని ఎ భాగాని కైనా దెబ్బ తగిలితే ఆపరేషన్ చేసి కుట్ల ద్వారానో లేక స్క్రూల   ద్వారానో దాని బాగు చేస్తాము .. మరి కర్రకి మన శరీరానికి తేడా ఏమిటండి ?   "జీవం"...... కదా .. ఈ జీవం పోయిన మరుక్షణమే మానవ శరీరాన్ని ఎంత త్వరగా ఇంటి నుండి  కదల్చాలి, ఎంత త్వరగా ఖననం లేదా దహనం చెయ్యాలి  అని సాటి మానవుడే తొందర చేస్తాడు .. కారణం ... జీవం లేని శరీరం ఇరవై నాలుగు గంటల లోనే పురుగులు పట్టుకు పోతుంది ...
అందుకే అప్పుడప్పుడూ... కాదు... ఎప్పుడూ ... మానవా, ఏమున్నది ఈ దేహం అని భక్త తుకారాం లోని పాట గుర్తుకు వస్తుంటుంది ..   అంతులేని వైరాగ్యం  కలుగుతూ వుంటుంది .. మళ్ళీ మామూలే, ఇంకా బ్రతకాలి, ఏదో చెయ్యాలి, అది కావాలి. ఇది కావాలి అని అనిపిస్తూ  వుంటుంది ..అమ్మో నేను లేకపోతె నువ్వు బ్రతక గలవా అని ఒకరి నొకరు ప్రశ్నించుకుంటూ వుంటాము  .. ఒదార్చుకుంటూ వుంటాము... కాని ఎవరు లేక పోయినా ఈ ప్రపంచం పరుగులు పెడుతూనే వుంటుంది .. ఆగదూ, ఆగదు , ఆగదు ఎ నిమిషం నీ కొసమూ అని ఎన్ని పాటలు పాడుకున్నా మన ఆలోచన స్రవంతి అంతే ...  బ్రతుకు మీద ఆశ..
ఏదీ శాశ్వతం కాదని తెలుసు . తెలిసి ఆశ పడతాము .. మరణం తప్పదని తెలుసు అయినా దుఖ్ఖిస్తాము . రోదిస్తాము .. కలలు కంటాము. తీరితే ఆనందం... లేదంటే ఆవేశం .. మాయలో పడిపోతాము. 
 ఒకరు బ్రతక డానికి ప్రక్క వాడిని పడగొట్ట డానికి కూడా వెనుకాడడు  ...  
 ఏమిటీ ఈ మాయ ? 
చిన్నప్పుడు నాకు చావు అంటే ఏమిటో తెలిసేది కాదు .. అమ్మ చిన్నాన్న మరణిస్తే అందరూ ఎందుకు ఏడుస్తున్నారో  తెలియక, కొన్ని నీళ్ళు నా కళ్ళ దగ్గర రాసుకోవడం గుర్తు .. పెదనాన్న గారు ఈ లోకం వదిలితే మౌనంగా చూస్తూ వుండి పోయాను .. నాన్న గారు పొతే దగ్గరకు కూడా వెళ్ళలేదు .. అమ్మ పోయిన తర్వాత తెలిసింది ...... అనాధ అని ఎందుకు అంటారో ...  కుటుంబం   , బంధాలు  మనం కోరుకున్నవే ... ఈ దుఖ్ఖాలు మనం అంటిన్చుకున్నవే ... కుటుంబం లో ఎ వ్యక్తికీ ఏమైనా ఐతే మిగిలిన వారికి దుఖ్ఖమే ... కాని వ్యక్తి లేని కుటుంబం లేదు , కుటుంబాలు లేని సొసైటీ లేదు .. సొసైటీ లు లేని వ్యవస్థ లేదు .. ఇది ఇలా జరుగుతూ వుండాల్సిందే .  మనుగడ కోసం ఈ ప్రయాణం లో   ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ....



 
   

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం