Tirupati Ghat Road

Tirupati Ghat Road by Arun Sundar
Tirupati Ghat Road, a photo by Arun Sundar on Flickr.
ఏడుకొండల వాడా..వెంకట రమణా....

తిరుమల తిరుపతి... అత్యధ్బుతమైన ఆధ్యాత్మిక కేంద్రం... గొప్ప పేరు పొందిన యాత్రాస్థలం... వెంకటేశ్వర స్వామి 

దర్శనం కోసం మేము బస్సు లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా క్రిందకి చూసి అమ్మో అనుకుని ముందు 

బాట వైపు దృష్టి సారించాను.. సామాన్యంగా ప్రతి యాత్రికుడు చేసే పనే అదే.. ఐతే నాలో ఏవో భావాలు... మన 

వెనుకగా వున్న లోయ ప్రదేశం మన గతం ఐతే, ముందున్న బాట మన గమ్యాన్ని సూచిస్తుంది అన్న ఆలోచన..

 మనం కూర్చున్న బస్సు మన వర్తమానం... గతం మనకు గతుకుల లోయను చూపిస్తుంది.. భవిష్యత్తు మనలో

ఆశ ను రేకెత్తిస్తుంది.. ముందు ముందు అంతా  మంచే జరుగుతుంది అన్న ఆశ... అందుకే గతం గతః అన్న సూక్తిని

గుర్తు పెట్టుకుని, మనం ఎ  స్థితిలో వున్నామో గమనిస్తూ,చిన్న చిన్న తుఫానుల తాకిడికి తట్టుకుని నిలబడే

 వృక్షాల్లా ముందుకు సాగాలి.. అయినా మనం ఆకాశాన ఎగిరే పక్షుల కన్నా బలమైన వాళ్ళం.......కదా... వాటిని

 మించిన కష్టాలా మనవి ????????    

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం