మన భవిష్యత్తుకు మనమే భాధ్యులం

"రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే" అన్నపాట ఎక్కువ గుర్తు వస్తూ వుంటుంది...ఏదో ఒకరోజు వదిలిపోయే ఈ శరీరం కోసం, అందులోని మనసనే ఒక భాగం కోసం ఎంత  ఆందోళన చెందుతాము ??.......

కాని బ్రతుకుతాము.... ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ, పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మార్చుకుంటూ... నవ్వుతాము, ఏడుస్తాము,, అలుగుతాము ...ఇలా నవరసాల్ని పండిస్తూ ఈ భూమి అనే నాటకరంగం మీద మన పాత్రల్ని మనం పోషిస్తాము..జననం అన్న ఎంట్రీతో మొదలైన మన పయనం,మరణం అనే నిష్క్రమణతో  ముగింపు పాట  పాడతాము.. ఎందుకు ఈ ఉపోద్గాతం అనుకుంటున్నారు కాదు... ప్రాపంచికమా, ఆధ్యాత్మికతా అని ఆ రెండు జీవన విధానాలని విడదీసి, మానసికి ఆందోళనకు గురి అయ్యే ప్రతివారికి కొన్ని విషయాలు నేను చదివినవి, అంతకన్నా ekkuva నాకు అనుభవానికి వచ్చినవి visHadeekarinchaalani నిర్ణయించుకున్నాను...

" ఆధ్యాత్మికతను, ప్రాపంచిక జీవనవిధానాన్ని వేరువేరుగా చేసి జీవితమంతా విశాడంతోను, కటిక దారిద్యంతోను, అనారోగ్యంతోను, అయోమయంతోను జీవిస్తున్నారు మానవులు.. మేల్కొంది. జీవితమాదుర్యాలన్నింటినీ ఆస్వాదించండి.."
ఆధ్యాత్మికత +ప్రాపంచికత (నిర్వాణం + సంసారం) అనే ఫోర్ములే తో జీవితాన్ని కొనసాగించండి.. పసిపిల్లల నవ్వులని, గుండెచేసే చప్పుడిని, గాలి స్పర్శని, పూల సువాసనని, ప్రకృతి అందాలని, అది ఇచ్చే ఆహ్లాదాన్ని, మధురానుభూతులను అన్నింటిని స్వీకరించండి..ఆకాశంలో నక్షత్రాల వెలుగుని, చందమామ చల్లదనాన్ని, ఆ వెన్నెలని, భూదేవి ఇచ్చే సాంత్వనని.........అన్నింటిని ఆశ్వాదించండి ".............

ఇవీ "మీ సంపద మీ చేతుల్లో " అని రామ్తా అను మహాయోగి ద్వారా విరచితమైన పుస్తకంలోని అత్యద్భుతమైన వాక్యాలు. నిజమే..పూర్తి ప్రాపంచికతతో వున్న మానవుడు అసలైన ఆనందాన్ని అనుభవించగల స్థితికి రాదు..

ఇంకో విషయం కూడా చెప్పారు...చాలా మంది ఇంద్రియాలు కలిగించే బలహీనతలకు దాసోహం అవుతున్నారు. 

సోమరితనం+సంకుచిత్వం+బద్ధకం+ శృతిమించిన బలహీనతలు మనుషులను గానుగెద్దు ప్రవృత్తి లాగ ఒకే విషయం చుట్టూ పరిబ్రమించేట్లు చేస్తున్నాయి.. అత్యున్నతమైన జీవితానుభవాలను వాంచించక, వాటికోసం ప్రయత్నం చెయ్యాలనే ఆకాంక్ష లేక , ఆయాచితం గా అన్నీ కావాలని ఆశిస్తుంటారు... 

బ్యాంకులలో లేదా treasury లో ఎన్ని నోట్ల కట్టలు నిల్వ ఉన్నప్పటికీ 

------- మనిషి యొక్క సంతృప్తికర జీవితానికి, ఆ నోట్ల కట్టలకూ ఎటువంటి (ఎ  మాత్రం) సంబందం లేదని చెప్తున్నారు..
 ౧. అజ్ఞానం వాళ్ళ చిత్తచాపల్యం సంభవిస్తుంది.

౨. జ్ఞానం మెండుగా వున్నపుడు మనస్సు స్థిరంగా వుంటుంది.

౩. భాహ్యంగా  ఏది కలిగి ఉంటున్నారనేది కాదు.......అంతర్ ప్రపంచంలో ఏది కలిగి ఉంటున్నారనేది ముఖ్యం.

౪. ప్రాపంచిక జీవితం + ఆధ్యాత్మిక జీవితం అనేది భూమిమీద మానవ జన్మ యొక్క వారసత్వ హక్కు.

౫. ధనసంపదను కోరుకోవడం, సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం. ఐశ్వర్యాన్ని కోరుకోవడం, ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితంలోని అంశాలే..

౬.ఈ భూమి మీద అన్ని కర్మలూ ఆధ్యాత్మిక పాఠాలు   నేర్పడానికే అని తెలుసుకోవాలి..

౭. అంతర్ ప్రపంచంలో దేనిని కలిగి ఉంటున్నారో, అదే భాహ్య ప్రపంచంలో వాస్తవరూపం దాల్చుతుంది. 

౮. కలలు సాకారం కానట్లయితే, సరిపడా సంపదను (జ్ఞానాన్ని) 
సంపాదించుకోలేకపోతే   ఇంకా   పరిమితులలో వున్నట్లే..

౯. మనల్ని మనం నూరు శాతం ప్రేమిన్చ్గుకోగాలిగినప్పుడే  కలలు కనగలరు..............

 ఎవరి అభిప్రాయాలకోసమో, ఇతరుల గుర్తింపు కోసమో, అహం ను తృప్తి పరచడం కోసమో, ప్రేమికుడు లేదా ప్రియురాలి మెప్పు కోసమో లేదా పేరు ప్రతిష్టల కోసమో జీవిస్తున్నంత కాలం ........హ్ర్య్దయపు లోతుల్లోంచి ఎమోషనల్ గా కలలు కనలేరు.. 

ఏది చేసినా మనస్పోర్తిగా చెయ్యాలి. అప్పుడు కలలు వాస్తవ రూపం చెందుతాయి..

 "పరాధీనతతో జీవించే వ్యక్తీ వాస్తవ రూపం చెందని, అణచుకోబడిన కలలతో జీవిస్తారు.. కాని అది సంతృప్తికరమైన, ఆనందకరమైన జీవితం కాదు..

మనస్పూర్తిగా, స్వేచ్చగా జీవించలేనప్పుడు మనలోని దైవత్వాన్ని ప్రకటితం చెయ్యలేము. ఆనందంగా జీవించలేము.
మెదడుని హీలింగ్ చేస్తే తప్ప కాలిలోని గాయం నయం కాదు..

ప్రకృతి మనిషిని దుర్దశ తో vadilipettadu ..

నిరాశా నిస్పృహలతో కూడిన మన నమ్మకాలే మనలని దుర్దశ లోనికి నేట్టివేస్తున్నాయి..

దైవం అనేవాడు మనలోనే వుండగా భాహ్యదైవం మన తలరాత ఎలా వ్రాస్తుంది ?

ఆత్మా శక్తిని గుర్తించకపోవడం వాల్ మనల్ని మనం vanchinchikuntunnaamu ,    

మనిషి జీవితంలో ద్వంద్వాలకు బాగా అలవాటు పడిపోయారు. ఒకవైపు సంతోషంగా జీవిన్చావచని భావిస్తూ, మరోవైపు ఇప్పటి పరిస్థితులలో అలా జీవించడం సాధ్యం కాదేమో నని ప్రగాడంగా విశ్వసిస్తూ వుంటారు.

ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆసిస్తున్నంత కాలమూ parishతితి ఎలా ఉంటుందంటే........మన దుఖ్హాని ఇతరులు పంచుకోవాలని, మన అయోమయాన్ని ఎవరో వచ్చి తొలగిస్తారని, మన దుఖ్హం పట్ల సానుభూతి ప్రదర్శిస్తారని. " నువ్వు గొప్పవాడివి లేదా అద్భుతమైన వాడివి " అని ఎవరైనా పోగుడుతారని ఆశిస్తుంటారు..

మరికొన్ని విషయాలతో రేపు కలుద్దాము...అంతవరకూ ఆలోచించండి ..ప్రాపంచికమా ..ఆధ్యాత్మికతా ...లేక రెండింటిని సమన్వయ పరచుకుంటూనా  .........................




.
          
  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం