ఏమిటో ఈ జీవితాలు?

ఈ రోజు ఆకు కూరలు అమ్మే ఆమె తను మాకు దగ్గరలోనే వుంటున్నానని, పిల్లలు లేరని, భర్త పని ఉన్నప్పుడు కూలీ పనికి వెళ్తాడు లేదంటే తిని ఉండలేక తనని చితకబాదుతూ ఉంటాడని,  కష్టపడుతున్నది తను, అయినప్పటికీ సుఖం లేని బ్రతుకైపోయిందనీ భాదపడుతూ ............ వెళ్తూ ఒక మాట అని వెళ్ళింది.  "ఏమిటో ఈ జీవితాలు" అని.................
ఆశ్చర్యపోయాను. గతుక్కుమన్నట్లు అయింది గుండెల్లో...........సామాన్యంగా ఈ మాట  ప్రతిఒక్కరి నోట వినిపించేదే.
కానీ విన్న ప్రతిసారీ క్రొత్తదనమే..... అంతకుముందు మా డాక్టరుగారు  "మాడమ్, ఈ జీవితం ఏమిటి? వివరించండి" అని చెప్తే తప్పించుకున్నాను. "ఇంకోసారి maaTlaaDataanu" అని.  ఆనాటినుండీ నా మనసులో అదే మాట తిరుగాడుతుంది. ఇదిగో, ఈ రోజు ఈమె.... నిజమే, ఈ జీవితం ఏమిటి? ఎందుకు పుడుతున్నాము. ఏం సాధిస్తున్నాము? సుఖదు:ఖ్ఖాల పయనం అని మన మనసుల్ని సరి పెట్టుకుందామా? .....................................

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం