యోగి ఉత్తమమైనవాడు. యోగి జన్మ శ్రేష్టమైనది.. జ్ఞాని కంటే యోగి గొప్పవాడుగా తెలియజేయబడింది..
కర్మయోగి కార్యశూరుడుగను, భక్తియోగి ప్రేమ మార్గముని పాటించవాడుగను, రాజయోగి అంతశ్శక్తి గలవాడుగను, జ్ఞానయోగి తత్త్వమార్గదర్శకుడుగను వుండును..
సాధకుడు యోగఫలితములను పొందలేకపోవుటకు కారణము విషయ, వస్తు, శబ్ద, భోగ రాహిత్యముతో పాటు, సాధన యందు అనాసక్తిని పెంపొందించుకోలేకపోయిన వాడు అనాసక్తయోగిగను,
పుణ్యపాపములు లేనివాడు, విగతకల్మషుడు, బ్రహ్మ స్వరూపుడై నిత్యానందమును అనుభవించువాడు అగామ్యయోగి యని  పిలువబడుతున్నారు....
పరబ్రహ్మయే ప్రధమయోగి..
"ఋష్" అను ధాతువు నుండి ఋషి అను శబ్దం ఉద్బవించింది.
ముని అనగా మననశీలుడు... ఎల్లప్పుడూ పరమాత్మయందు లీనమై, పరమాత్మనే మననం చేయువాడు ముని..
దేవలోకమును నివసించు ఋషులు దేవర్షులు. వారిలో ప్రముఖులు....
1. నరనారాయణులు (ధర్ముని పుత్రులు)
2. వాలి ఖిలులు (క్రతు కుమారులు)
3. కర్ణముడు
4. పర్వతుడు
5. నారదుడు (పై ముగ్గురు పులహ సుతులు)
6. అసితుడు
7. వత్సలుడు
8. వ్యాసుడు

సనకాదులు నలుగురు... సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు..
వీరు కూడా బ్రహ్మ మానస పుత్రులే.
మనువులు పదునాలుగురు..
1. స్వాయంభువు 2. స్వారోచిషుడు 3. ఉత్తముడు  4. తామసుడు  5. రైవతుడు  6..చాక్షుసుడు  7. వైవస్వతుడు  8.. సావర్ణి  9. దక్షసావర్ణి  10. బ్రహ్మసావర్ణి  11. ధర్మ సావర్ణి  12. రుద్రసావర్ణి  13. దేవసావర్ణి
14. ఇంద్రసావర్ణి....

సప్తఋషులు.
బ్రహ్మ మానస పుత్రులే సప్తఋషులు..
1. మరీచి  2. అంగీరసుడు  3. ఆత్రి  4.. పులస్త్యుడు  5. పులహుడు  6. క్రతుడు  7. వసిష్టుడు.

ఇంకా ఈ పుస్తకంలో మనస్సు, దాని వికారములు, అది ఏర్పడిన విధానము, మనస్సు రకములు, ఇలా యోగములో అన్ని వివరాలను మనకు అందిస్తూ, భగవద్గీత లోని ధ్యాన, బుద్ది, భక్తి,జ్ఞాన, కర్మ, సాంఖ్య, రాజ, క్రియా, తారక, సత్య, ఐశ్వర్య, హఠ యోగముల వివరణలు అన్నీ మనకు అందించబడ్డాయి....
 భగవంతుని కృప, పూర్వజన్మ కర్మానుసారం మనకి ఈ జన్మ.. విధి అనేమాట వట్టిదని, పురుషప్రయత్నం మిన్న అని శ్రీయోగవాసిష్టం అనే పుస్తకంలో వసిష్టమహర్షి శ్రీరామచంద్రునికి భోదించినట్లుగా ఉన్నది......   

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం