అమెరికాలో చదువు ఎందుకురా?
డాలర్లే,డాలర్లు.........ఇదండి సమధానం... నిన్న మావారు ఇంటికి వచ్చి వినిపించిన ఒక కధనం నా మనసులో ఈ చెత్తకధకి నాంది..

మాకు తెలిసినవారి అబ్బాయిని అమెరికా పంపడం కోసం ఇంకా కనీసం నివాసయోగ్యంగా కూడా కట్టని ఓ ఇల్లు తాకట్టు పెట్టి. అక్షరాలా ఇరవై ఐదు లక్షలు (తల్లి తపన తన కొడుకు అమెరికా వెళ్ళాలని) పెట్టి ఎలా ఐతేనేం అక్కడ ఉద్యోగ రీత్యా ఉంటున్న తమ కూతురు,అల్లుడుల సహకారంతో ఒక యూనివర్శిటీ లో ఎమ్.ఎస్ కోర్స్ లో జాయిన్ చేశారు...యూనివర్శిటీ కాంటీన్ లో ఐతే తక్కువ డాలర్లు ఇస్తారని,బయట పని (పార్ట్ టైమ్)
ఒప్పుకుని (వారానికి రెండువందల డాలర్లు) జాయిన్ ఐన తర్వాత అమ్మా,నాన్నకి ఫొన్ చేసాడట.. అమ్మా,నీకేం కావాలి అన్నాడట..ఇంతకీ ఏం పనిరా బాబు అని అడిగిన అమ్మకు "కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న చెత్తను సంచులలో నింపి భుజాలు పడిపోయేలా మోసుకుని వాళ్ళు చూపిన స్థలంలో పొయ్యాలట" అని కొంచెం వివరంగా వివరిస్తే........ఏం చెప్పమంటారు ఆ తల్లి ఆవేదన? ఇంట్లో తను తిన్న చాక్లేట్ రేపర్ ని "ఒరెయ్ బాబు డస్ట్ బిన్ లో పడెయ్యరా", అని నెత్తి,నోరు కొట్టుకున్నా తలెగరేసి మరీ విదిలించుకు పోయే నా కొడుకు ఈరోజు అమే...రికాలో చదువుకోసం లక్షలు పోసి పంపిస్తే,, అక్కడ వాడు .................. అని వాపోయిందటండి ఆ తల్లి..

ఈ మధ్య మా స్కూల్ లో నేను చూసిన ఒక స్కిట్ లోని డైలాగ్స్ ఇక్కడ వ్రాయాలనిపించిందండి..ఒన్ మినిట్...

"ఒరేయ్.. పెద్దైయ్యాక నువ్వేం చేస్తావురా ?"

రవి: సిగరెట్లు కాలుస్తానురా..

శీను: ఐ.ఏ.ఎస్..చదువుతానురా..

వెంకట్: సి.ఎమ్ అవుతానురా..

"అదేం కోరికరా బాబు...........".

"ఏం లేదురా..మా నాన్న వార్డు కార్పోరేటరు కద.. ఆ వార్డు ప్రజల సేవలు మాత్రమే వినియోగించుకుంటున్నారు..అదే సి.ఎమ్..ఐతే హోల్ మొత్తం రాష్ట్ర ప్రజల సేవలు వినియోగించుకోవచ్చు కదరా..మొత్తం రాష్ట్రమే మనది కదరా.."

"ఒరేయ్..తెలివితక్కువ నాయాలా..రాష్ట్రం ఎందుకురా..దేశప్రజల సేవలే వినియోగించుకోవచ్చు కదరా..రాష్ట్రపతివి ఐపో....."

అంత ఆశలేదు లేరా.... అప్పుడైతే రాష్ట్రపతి భవనంలోనే కూర్చోవాలి...appudappudu నేనున్నాను అని పేరుకు మాత్రమే ఉండాలి...సి.ఎమ్ ఐతే చాలు....
"మరి నువ్వేం చేస్తావురా?"
raaja: "రాజకీయాల్లో చేరతానురా..;"
నా నొరు ఎప్పుడూ ఎవరో ఒకర్ని తిడుతూనే ఉంటుంది... నీకు అదే కరక్టు అని మా అమ్మ చెప్పిందిరా..
ఎవర్నైనా తిట్టవచ్చు,,ఎప్పుడైనా తిట్టవచ్చు..(నోటి దురదకు రాజకీయాలు ఇచ్చ్ గార్డ్ అన్నమాట)
ఇదండీ సంగతి............

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం