ఉపనిషత్తుల మనొహరత్వం,శక్తి :భగవద్గీత

ఉపనిషత్తులు రచించబడ్డ కాలాన్ని గురించి విద్వాంసులలో భిన్నాభిప్రాయాలున్నవి అని,ప్రధాన ఉపనిషత్తులు చాలామటుకు క్రీస్తు పూర్వం ఏడవశతాబ్దిలో బౌద్దయుగానికి పూర్వమే రచించబడ్డాయని చాలామంది అంగీకరిస్తారు. మొత్తం రెండువందల పైచిలుకు ఉపనిషత్తులు ఉన్నాయని ,చాలా మటుకు సంప్రదాయబద్దంగా ఉన్నాయని, ఇవన్నీ బౌద్దకాలం తర్వాతనే, అంటే శంకరాచార్యుల కాలం తర్వాతనే రచింప బడ్డవన్నది విస్పష్టం అని స్వామి రంగనాధానంధ తన ఉపనిషత్తుల సందేశం అనే గ్రంధంలో వివరించడం జరిగింది..సమాజంలో మానవుడి ఐహిక జీవితాన్ని శాసించే సంప్రదాయాలు, ఆచారాలు,కట్టుబాట్లు కాలానుగుణంగా మారవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. భారతీయ సమాజంలో శాశ్వత విలువలు పట్టుతప్పిన ప్ర్లతిసారి ఒక్కొక్క మహోన్నతుడైన ఆధ్యాత్మిక గురువరేణ్యుడు అవతరిస్తూ, ఆ విలువలను కాలానుగుణమైన రీతిలో తమ జీవితం ద్వారా,ప్రభోదాల ద్వారా పునరావిష్కరిస్తూ వచ్చారని రచయిత పేర్కోవడం జరిగింది;.రామక్రిష్ణ పరమహంస పునరావిష్కరించిన విశ్వజనీనమైన,హేతుబద్దమైన,సనాతన ధర్మాన్ని స్వామి వివేకానందులు నలు దిశలా ప్రచారం చేసారు..తర్వాత ఆ ధార్మిక సందేశాన్ని,వేదాంత తత్వాన్ని జీవితంలో వ్యక్తిగతంగా ఎలా ఉపయుక్తంగా,అనువర్తింపజెసుకొనవచ్చునో వివరిస్తూనే,మానవుల పరస్పర సంబంధాలలో,వ్యష్టికార్యకలాపాలలో,విద్యలో, విభిన్న మతాల మధ్యగల సంబంధాలలో, పరిపాలనా రంగంలో, సత్యనిష్ఠతో, సమర్ధవంతంగా సాగే సహకార కార్యకలాపాలలో పౌరసత్వం పట్ల అవగాహన,ప్రజాస్వామ్యం,బలహీన వర్గాల సముద్దరణ, కుల తత్వ నివారణ,వర్గ సంఘర్షణ,మానవ ఐక్యత, జాతీయ సమైక్యత, అంతర్జాతీయ శాంతి, జీవితంలో అన్ని రంగాలలో సుఖసంతోషాలకు ఎలా ఉపకరిస్తుందో స్వామీరంగనాధానంద స్వామీజీ తమ ఉపదెశాలలో సుస్పష్టం చేసారు .
శంకరాచార్యులు భాష్యాలు వ్రాయడానికి ఎన్నుకున్న ఉపనిషత్తులు పది.. అవి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యకాలు.
ఈశోపనిషత్తులో ఈశ్వరానందాన్ని పూర్తిగా అనుభవించిన వారి స్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ చిన్న కధలను అందించారు రచయిత..
"నువ్వు దేముణ్ని ప్రేమించావా" అని ఎవరో ఒకరు మహమ్మదీయ భక్తురాలైన రుభియాను అడిగితే' అవునన్నదట' ఆమె.. "నువ్వు సైతానుని ద్వేషిస్తావా" అని అడిగితే "భగవత్ప్రేమలో ఉన్న నాకు సైతానుని ద్వేషించే తీరిక లేదు" అన్నదట ఆమె.. ధెరిస్సా అన్న క్రీస్తు భక్తురాలు " చిరుబురులాడే సత్పురుషుల బారినుండి మమ్ము కాపాడు దేవా" అని ప్రార్థించేదట.
మహా పురుషులు ఉన్నత లక్షణాలతో గలగల నవ్వుతూ ఉల్లాసంగా ఉండేవారట.

ఆధ్యాత్మిక జీవితమంటే ఆహ్లాదరహిత,చింతాక్రాంతధొరణి అన్న అపోహనుండి తొలగించడానికి ఈ పైన ఉదాహరణలు చాలు కదు.
పితృయానం చీకటి మార్గం అంటే చైతన్యరహిత, సాంసారిక జీవనం అని వివరించారు.. దేవయానంలోని వెలుగు చైతన్యసూచకం..
ఉపనిషత్తులు ఈ రెండుమార్గాలతో తృప్తి చెందక,మూడవగతిని ఒకదానిని తెలిపారు..అదే "జీవన్ముక్తి".
..... బొందితో మోక్షం.......( మోక్షం కావాలి అనుకునే ప్రతివ్యక్తి చావు కోసం ఎదురుచూడడు..అదే విచిత్రం.)
maanavudi నిజస్వరూపం నిత్య శుద్ది,నిత్య పూర్ణ, నిత్య భోధమైన ఆత్మ అని ఈ జీవితకాలంలోనే సాక్షాత్కరింపజేసుకోవడం..అంటే ముక్తి పొందుటకొరకు ఊర్ధ్వలోకాలకు వెళ్ళనక్కరలేదు..శరీరం చాలించనక్కరలేదు.ఇక్కడే ఈ భూమి పైనే ఉంది. పూర్ణచైతన్య ప్రాప్తితో ఈ జన్మలోనే పరిపూర్ణత సిద్ధిస్తుంది అని ఈశోపనిషత్తు మొదటి 14 మంత్రాల సారాంశం.
గీతలో కూడా ఈ రెండు మార్గాలను వివరించిన పిదప
నైతే శృతీ పార్ధజానన్ యోగీ ముహ్మతి కశ్చన!
తస్మాత్సర్వేషు కాలేషు యోగ ముక్తో భవార్జునా !!

"ఈ రెండు మార్గాల స్వభావాలను ఎరిగిన యోగి భ్రాంతి చెందడు. కనుక ఓ అర్జునా,ఎల్లప్పుడూ యోగమంటే స్థిరంగా ఉండు " అని భొధించాడు శ్రీకృష్ణుడు.
అలానె ఈశోపనిషత్తు లోని 6,7 మంత్రాల భావాలకు అనుగుణంగా గీత ఈ మహనీయ భావాన్ని చాటుతుందట..
ఎవరి మనస్సులు సమస్థితిలో ఉంటాయో వారు ఈ జన్మలోనే జనన మరణాలను జయిస్తారు..బ్రహ్మం ధోషరహితం, అందరి యందు సమంగా ఉంటుంది కాబట్టి వారు బ్రహ్మమందే స్థిరంగా ఉంటారు.
సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః !
సర్వధా వర్తమానోపి సయోగీ మయివర్తతే !!

ఏకత్వంలోనే మనస్సుని లగ్నం చేసి,సకల ప్రాణులలో ఉన్న నన్ను ఎవరు అర్పిస్తారో, అటువంటి యోగి ఏ పరిస్థితిలో ఉన్నా నా యందే లగ్నమై ఉంటాడు.
ఆత్మా సమ్మేన సర్వత్ర సమం హ్యోతి యో అర్జునః !
సుఖమ్ నాయది నా దు:ఖం సయోగీ పరమో మతః !!

అన్యుల సుఖదుఃఖాలను తనవిగా భావించి.ఎల్లెడల సమానంగా చూసేవాడు పరమయోగి అని తెలుసుకో అర్జునా అని, ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక భావం కలిగి ఉండడాన్ని గీత గట్టిగా నిక్కి చెప్తుంది.. ఉపనిషత్తులు ఇవే చెప్తాయి అని రచయిత చాలా అందంగా వివరిస్తారు.
ఉదారా: సర్వ ఏవైతే, జ్ఞానీ త్వాత్త్మైన మేమతం.......అని అన్ని రకాల వారికీ స్వాగతం పలికే ఈ ఉదారబుద్ధి ఉపనిషత్తుల విశిష్ట లక్షణం.................

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం